Thursday, October 20, 2016

4 వ బ్యాచ్ - ఒకేషనల్ ట్రైనింగ్ - టైలరింగ్


4 వ బ్యాచ్ -టైలరింగ్ ---ఒకేషనల్ ట్రైనింగ్ - శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతో,


భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతో, ఈ రోజు, అనగా స్వామి వారి అవతార ప్రకటన ఈ పవిత్ర రోజు అంటే 20-10-2016 న శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి , హైదరాబాద్ ఒకేషనల్ ట్రైనింగ్ లో భాగంగా, 20 మందికి,tailoring లో ఉచిత టైలరింగ్ శిక్షణ శిభిరం కార్యక్రమమునకు శ్రీ ఎం ఎల్ నరసింహ రావు, ప్రేమ సాయి కలేన్దర్స్ అధినేత, సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి జ్యోతి ప్రకాశం చెయ్యగా కార్యక్రమం, వేద పఠనం, భజనతో ప్రారంభం అయ్యింది. శ్రీ ఎం ఎల్ నరసింహ రావు, మాట్లాడుతూ అందరిని శ్రద్ధతో కోర్స్ పూర్తి చేసుకోవలసిందిగా, వారి శుభకాంశాలు తెలిపారు. సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి స్వాగత వచనాలు పలుకుతూ, ఇంతకు ముందు మూడు batches శిక్షణ నిచ్చినట్లు, గతంలో శిక్షణ పొందిన దాస పద్మావతి, లేజా పెరుమాళ్, ఈ 4 వ బ్యాచ్ వారికీ శిక్షణ నివ్వటము ఒక విశేషమని తెలిపారు. అందరిని ఆ విధమైన శ్రద్ధ తో నేర్చుకోవలసిందిగా, ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఎం ఎల్ నరసింహ రావు, బాలవికాస్ గురువులు, రేణుక, కుమారి స్వాతి, వాణీ, లక్ష్మి, విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దాస పద్మావతి మరియు లేజా పెరుమాళ్ గార్లు, ఈ రోజు కార్యక్రమంలో భాగంగా సారీ పెట్టికాట్ కట్ చేసే విధానం, కుట్టు విధానము నేర్పించారు. ఈనాటి కార్యక్రమం భగవానుడికి మంగళ హారతి సమర్పణతో సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ గావిస్తూ, విశేషముగా, నమస్తే తెలంగాణ, మరియు, సాక్షి, దిన పత్రికలలో, చూచి, శిక్షణ కు వచ్చిన వారి సంఖ్య ఎక్కువ గా నున్న కారణంగా, నమస్తే తెలంగాణ రమేష్ గారికి, సాక్షి రమేష్ జూలూరి గారికి, ప్రత్యేక కృతజ్య్నాతలు తెలియ జేస్తూ , ఈ శిక్షణ శిభిరం 90 రోజులు కొనసాగుతుందని, దీని తర్వాత ఇంకా మరిన్ని శిక్షణ శిభిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పొంద దలిచిన వారు 8886509410, 9440409410 ను సంప్రదించగలరు.

No comments:

Post a Comment

Sri Sathya Sai Youth Empowerment Series: Women's Well-being Campaign at City College, Near High Court, Hyd dt 6-2-2025

  Sri Sathya Sai Youth Empowerment Series: Women's Well-being Campaign at City College, Near High Court, Hyderabad 1. Introduction: * T...