Please Click Here to See Swachata Se Divyata Tak - Nilofer Hospital Swatch Bharat - Koti Samithi 12-10-2016
సాయిరాం, మన అందరికి తెలిసిన విషయమే, ఏమంటే అక్టోబర్, 2 నుండి అక్టోబర్, 20 వరకు, స్వచ్ఛత ద్వారా దివ్యత్వము వరకు అనే జాతీయ సేవా కార్యక్రమాన్ని హైదరాబాద్ నాంపల్లీ స్టేషన్ ప్రాగణంలో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, హైదరాబాడ్ బయట పరిసరాల స్వచ్చతతో పాటు అంతర్గత సుబ్రతా, స్వచ్ఛతకు ప్రాధాన్యమిస్తూ, నాంపల్లి స్టేషన్ పరిసరాల , గాంధీ గారి జయంతి నుండి స్వామి అవతార దినోత్సవము వరకు, ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారి సూచన మేరకు, మన అల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీ నిమేష్ పాండ్యా గారి, ప్రణాళిక ప్రకారం, ఈ సేవా కార్యక్రమమును, మనము శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, హైదరాబాద్, ఈ నీలొఫుర్ హాస్పిటల్ ను, సెలెక్ట్ చేసి, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీ ఎం వి ఆర్ శేష సాయి అద్వ్యర్యములో అక్టోబర్ 2 వ తేదీన లాంఛనంగా ప్రారంభించి, హైదరాబాద్ లో గల 28 సమితిలకు ప్రతీ రోజు ఒక సమితి కి ఆలౌట్ చేసినారు. ఇప్పడి వరకు మొత్తము భారత దేశం లో శ్రీ సత్య సాయి సేవ సంస్థల సేవకులు, దాదాపు, వేల మంది సేవకులు పాల్గొన్నట్లుగా అంచనా. మన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ, రాష్ట్రాలలో, ఎంతో ఉత్సహముతో, భక్తి శద్ధలతో, ఈ పవిత్ర యజ్ఞం లో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులవుతున్నారనుటలో ఏ మాత్రమూ అతిశయోక్తి కాదు. ఈ రోజు శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి విభాగమునకు, కేటాయించిన రోజు. ఎంతో ఉత్సహముతో, భక్తి శద్ధలతో, ఈ కార్యక్రమములో 11 మంది కోటి సమితి నుండి రండి, ఈ రోజు అంటే 12-10-2016 న, నాంపల్లి లో గల నీలొఫుర్ హాస్పిటల్ లో 11-30 నుండి 4-30 గంటల వరుకు పాల్గొని ఏ సమితి చేయలేని పనిని చేసినట్లుగా శ్రీ కస్తూరి వెంకటేశ్వర రావు, మరియు వెంకట రమణ గార్లు, కోటి సమితి సభ్యులను అభినందించి, వారి అమూల్యమైన సేవలను ఘనంగా కొనియాడారు. దాదాపు ఎన్నో సంవత్సరాల నుండి పేరుకుపోయిన, చెత్త , మురికి కాల్వలను, శుభ్రపరచి, బహు సుందరముగా, అందరూ ఆశర్య పడు రీతిలో కోటి సమితి సభ్య్లులు వారి సేవలు కొనసాగించారు. ప్రస్తుతము, పనికిరాని, డీఫ్లోరిడాషన్ ప్లాంట్ ను ఏ భాగానికి ఆ భాగము, తీసి పక్కన పెట్టడమైనది. ఎన్నో రోజులుగా పాడయిపోయి ఫ్లటుఫార్మ్ క్రుంగి, పందికొక్కుల నివాసముగా మారిన ఆ వాటర్ ప్లాంట్ ను శ్రీ సత్య సాయి సేవ సంస్థలు చివరి రోజు అంటే 20 అక్టోబర్ న దానిని నూతన స్థాయిలో దాని పునర్నిర్మాణము గావించి, హాస్పిటల్ అధికారులకు అందచేయాలని, సత్వర పనులు చేపట్టుచున్నారు. శ్రీమతి విజయలక్ష్మి గారు, శ్రీ విజయకుమార్ గార్లు, అందరికి ఉత్సహము, ఆనందము, కలుగునటుల, పలు భజనలు ఆలపించారు. శ్రీమతి విజయ లక్ష్మి గారు, హాస్పిటల్ లో పేషెంట్స్ అటెండంట్స్ కు చెత్త ను చెత్త బుట్ట లోనే వేయవలసిందిగా, కోరడమైనది. నాటి ఈ పవిత్ర యజ్ఞం లో కోటి సమితి సభ్యులు, శ్రీ చక్రధర్, శ్రీ రాము, శ్రీ రాందాస్, శ్రీ రతిరావు పాటిల్, శ్రీ మాణిక్ ప్రభు, శ్రీ వెంకట్ రావు, ఢిల్లీ రాజు, సురేష్, శ్రీమతి విజయ లక్ష్మి, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి పాల్గొన్నారు. ఖైరతాబాద్ సమితి నుండి, శ్రీ విజయ కుమార్, రాజయ్య గార్లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment