Thursday, November 3, 2016

4 వ బ్యాచ్ 90 రోజుల ఉచిత కుట్టు శిక్షణా శిభిరం

శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, ఆధ్వర్యములో ఉచిత కుట్టు శిక్షణా కార్యక్రమము గురువారం 20 వ తేదీ నుండి 4 వ బ్యాచ్ 90 రోజుల ఉచిత కుట్టు శిక్షణా శిభిరం, ఉస్మాన్ గంజు, టాప్ ఖానా, ( ప్రేమ్ సాయి క్యాలెండర్లు వారి ప్రెమిసెస్ లో ) శ్రీ సత్య సాయి సేవ కేంద్రంలో, ప్రారంభమైన విషయము విదితమే. ఈ శిక్షణా శిభిరంలో 21 మంది మహిళలు శిక్షన పొందుచున్నారు. ఈ రోజు, అనగా, 3-11-2016 న, 1 గంటలకు Dr కృష్ణ కుమార్ స్టేట్ కో-ఆర్డినేటర్, శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్, ముఖ్య అతిధిగా, విచ్చేసి, శిక్షణా మహిళలకు, నియమ నిభందనల,ప్రకారము, 200 గంటలు, శిక్షణా పొంది ఉండవలెనని, అప్పుడే, సర్టిఫికెట్ జారీ చేయబడునని, వాళ్ళ పిల్లలను, బలవికాస్, లో చేర్చమని, సలహా నిచ్చారు. శ్రీ సత్య సాయి సేవా కేంద్రమును, తమ పుట్టినిల్లుగా భావించి, ఇష్టముతో, శిక్షణలో, మెళుకువలు, తెలిసికొని, మీరే మళ్ళీ, తరువాయి, 5 వ బ్యాచ్ కు కోచింగ్ నిచ్చే స్థాయికి, చేరే విధముగా, నేర్చుకోవలసినగా, మరియు, మీ కుటుంబములో ఎవరన్నా, అనారోగ్యముతో నున్న వారికి, కూడా , తగు చికిత్స కూడా ఏర్పాటు చేయునటుల , సూచించారు. చివరగా శ్రీ సత్య సాయి సేవ సమితి, కోటి సమితి చేపడుతున్న, అనేక, ఆధ్యాత్మిక, సేవా, కొనియాడుతూ, కన్వీనర్ ను, సభ్యులను, అభినందించారు. ముఖ్యముగా, 3 వ బ్యాచ్ లో శిక్షణ పొంది, 4 వ బ్యాచ్ లో శిక్షణ నిస్తున్న, దాస పద్మావతి ని, వాణీ, మరియు స్వాతి లను కూడా ప్రత్యేక అభినందనలు తెలిపారు. కోటి సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి, వందన సమర్పణ గావిస్తూ, మెహందీ, మరియు బ్యూటీ పార్ల లో కూడా శిక్షణ తరగతులను, త్వరలో ఏర్పాటు, చేస్తున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment

SIVAM SECURITY DUTIES - KOTI SAMITHI.. DECEMBER 4,   2025 THURSDAY 2 GENTS EVENING  5 PM TO 8 PM  DECEMBER,24 WEDNESDAY 2 GENTS EVENING 5 PM...