REPORT:
Report dated 19-3-2019
శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి హైదరాబాద్, ప్రతి నెల 19 వ తేదీన నిర్వహించే మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల కూడా అబిడ్స్, లో గల జి పుల్ల రెడ్డి భవన్ 6 వ అంతస్తులో గల శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్ ప్రాంగణంలో అత్యంత భక్తి శ్రద్దలతో ఉదయం 11-30 తో 1 గంట వరకు జరిగినది.
ఈ నాటి విశేష మహిళా దినోత్సవ కార్యక్రమమునకు, ముఖ్య అతిధి గా విచ్చేసిన శ్రీమతి కళ్యాణి గారు, వేదం పండితులైన బ్రహ్మశ్రీ శ్రీధర శర్మ, శ్రీ దివాకర్ గారు జ్యోతి ప్రకాశనం గావించగా, కార్యక్రమము ప్రారంభించబడినది.
10 వ బ్యాచ్ టైలారింగ్ లో శిక్షణ పొందిన, శ్రీమతి ప్రియా సాహు, మహాసాధ్వి సుమతి, గూర్చి, 11 వ బ్యాచ్ లో శిక్షణ పొందుతున్న శ్రీమతి అశ్విని, ఝాన్సీ రాణి గారి గూర్చి, మాట్లడి, అందరి మన్నలను పొందినది.
10-3-2019 న శ్రీ తాగరాయ గాన సభలో, ఆరు గంటల నిర్విరామ గానంతో, అశేష శ్రోతల్ని మంత్రముగ్దుల్ని చేసి విశేష ప్రజ్ఞను ప్రదర్శించి విశిష్ఠ “ అంతర్జాతీయ వండర్ బుక్ “ రికార్డు సాధించిన శ్రీమతి ఆలూరు కళ్యాణి, ఈ నాటి విశేష మహిళా దినోత్సవ కార్యక్రమమునకు, ముఖ్య అతిధిగా విచ్చేసి వారు మాట్లాడుతూ, వారి స్వానుభవాలను విపులంగా తెలియజెసి, కేవలము ఈ ప్రజ్ఞ సంగీత కార్యక్రమాలలోనే కాకుండా, మీరు కూడా అంటే ఒకేషనల్ ట్రైనింగ్ శిక్షణ పొందుతున్నవారికి స్ఫూర్తినిచ్చే విధంగా, అనేక ఉదా హరణములతో, వండర్ బుక్ అఫ్ రికార్డ్స్ సాధించిన సందర్భములో పాడిన కొన్ని పాటలను కూడా పాడి అందరి ప్రశంసలు పొందినారు.
స్వామి చిరకాల భక్తులు, గేయ రచయిత్రి, స్వరకత్రి , గాయని, ఆలూరు కళ్యాణి, శాస్త్రీయ, లలిత, సంగీత పద్దతులలో రచించి, స్వర పరచిన, పలు భక్తి గీతాలను, ఆరు గంటల పాటు నిర్విరామంగా మధురంగా గానం చేసి, అంతర్జాతీయ వండర్ బుక్ అఫ్ రికార్డ్స్లోలో స్తానం సంపాదించుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజు, శ్రీమతి కళ్యాణి గారికి, ఒక ప్రత్యేక మొమెంట, శాలువ, కోటి సమితి పక్షాన శ్రీమతి పద్మావతి, శ్రీమతి సునీత, శ్రీమతి ప్రియా సాహు, శ్రీమతి శిరీష బహుకరించారు.
కోటి సమితి కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి, స్వాగత వచనాలు, మరియు వందన సమర్పణ గావించిన తదనంతరము స్వామివారికి మంగళ హారతితో, కార్యక్రమము ముగిసినది.
ఫోటో జతచేయడమైనది.
Samithi Convenor
P Visweswara Sastry.
PL CLICK HERE TO VIEW VEDA ASEERVACHANAM TO SMT KALYANI BY SRI S SREEDHARA SHARMA.
PL CLICK HERE TO VIEW SRI V S R MOORTHY'S SANDESHAM TO SMT KALYANI.
No comments:
Post a Comment