Tuesday, June 25, 2019

A SPECIAL THURSDAY BHAJAN ON 27-6-2019

స్వామి దివ్య అనుగ్రహముతో, ఈ రోజు గురువారపు భజనలో 11 మంది పాల్గొన్నారు. వేదము, భజన, కార్యక్రమము - బాలవికాస్, విద్యార్థులు మరియు పెద్దలు కూడా పాల్గొని, ఈ భజనలు పాడారు. మాస్టర్ ప్రనవ్, గణపతి భజన, శ్రీ కృష్ణ రావు గారు గురు భజన,   శ్రీమతి విజయ లక్ష్మి, హరిహర స్మరణ కారో అనే భజనను,  మాస్టర్ హేమాంగ్ , మాత మాత భజనను, కల్పనా, రేణుక, ఆశ్రిత, గాయత్రీ నాగ తదితరులు, మరియు విశ్వేశ్వర శాస్త్రి, నిత్యా నందం, అనే భజనను, ఆలపించారు. స్వామి వారి సందేశము కుమారి ఆశ్రిత చదివి వినిపించారు. ఈ రోజు, మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన సునీల్ కుమార్ నాగ, గారు స్వామి కి హారతి సమర్పించి, వారు మాట్లాడుతూ, కోటి సమితి లో బాలవికాస్, వారు వారి క్రొత్తలో, వారి పిల్లలను, ఏదో పంపిస్తున్నామంటే నామ మాత్రానికి, పంపించానని, ఈ మధ్య కాలంతో పిల్లలు, హేమాంగ్, గాయత్రీ, వార్లలో ఎంతో, మార్పును గమనించానని,  వారు బాలవికాస్ లో  మరియు అనేక, ప్రదేశాలలో వారు నేర్చుకున్న విషయాలను, సునీల్ గారే స్వయంగా తెలుసుకునే వాడినని, తెలుసు కున్న తరువాత, మనస్ఫూర్తిగా, పిల్లలను తానే స్వయంగా, బాలవికాస్ క్లాస్ కి తీసుకొచ్చి, దింపుతున్నానని, తానూ ఏంతో గర్వపడుతున్నాని, తెలుపుతూ, ఈ బాలవికాస్ తరగతుల కు, చుట్టూ ప్రక్కల వున్నా పిల్లలను కూడా తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తానని తెలిపారు. 

నాకు ఈ రోజు నచ్చిన నన్ను హత్తు కున్నవిషయాలు, శ్రీ సునీల్ కుమార్ గారి స్పందన.   

చివరగా అందరూ స్వామి వారి గళంలో -ప్రేమ ముదిత మానస కహా రామ రామ్  అనే భజనకు అందరూ కలసి స్వామి వారితో గొంతు కలిపి,  పాడారు. . 


 బ్రహ్మార్పణం శ్రీ లక్ష్మి నారాయణ, ఉప్పు గూడా నివాసి సాయి భక్తుడు, సాయి సేవకుడు, ప్రసాద వితరణ గావించారు. 
ఈ రోజు సేవలో నున్న వారు :  క్లీన్ అండ్ గ్రీన్ లో కృష్ణ రావు టి వి. గారు సహకరించారు.  
ఈ కొన్ని కారణాల వాళ్ళ రాలేక పోయిన వారు, శ్రీమతి శైలేశ్వరి,  సాయిరూప-   శరణ్య, శ్రావ్య, పవిత్ర, ,మాస్టర్ లీలా ధర్,     కుమారి సాయి లక్ష్మి,   శ్రీమతి శ్యామల గారు,   శ్రీ పాండు గారు మాస్టర్ సాయి కుమార్, మాస్టర్ సాయి గుప్తా, శ్రీమతి సునీత,శ్రీమతి దసా  పద్మావతి ,    శ్రీమతి నీలిమ, కుమారి సాయి వాణి,  శ్రీ వేణు కుమార్ మెట్టు,  శ్రీమతి జ్యోతి, శ్రీమతి సుకన్య, శ్రీమతి సంగీత, కుమారి జయ, శ్రీ శ్రీను,  మాస్టర్, సుకన్య గారి అబ్బాయి... మనము వాద్య సహకారమునకు శ్రీ నాయుడు గారిని, మరియు, వారి అమ్మాయిని అబ్బయిని కూడా ఆహ్వానించ వలెను. 
ఈ రోజు  శ్రీ మల్లికార్జున్ మాన్యావార్  వారి బృందంస్వామి కి నమస్కరించుకుని ,  ప్రసాదము తీసుకొని  వెళ్లారు. వచ్చే వారము వారు హారతి, మరియు, వారి బృందం కూడా హాజరు కాగలరని తెలిపాడు.  జై సాయి రామ్. 


సమితి కన్వీనర్ 
విశ్వేశ్వర శాస్త్రి. పి 





Friday, June 21, 2019

INVITATION FROM KOTI SAMITHI.Aum Sri Sai Ram Naama Japam. 23-6-2019



The  Holy Program Annual  Naama Japam at Begam Bazar, at the Residence of Sri Rati Rao Patil and Sudhakar Patil., has started with Omkaaram(21) Times, Suprabhatham, Veda Chanting  and Nagar Sankeerthana -- The actual program Aum Sri Sai Ram Naama Japam started at 6 AM today i.e. on 23-6-2019, In this program I had an opportunity to chant Omkaram, Suprabhatam, and Veda Chanting. after Completion of my Naama Japam, I went to Balvikas and motivated the students to join Aum Sri Sai Ram Naama Japam.... As advised they have also participated enthustically (11) students, and some elders have also participated in the program at 12 Noon...

please click here to view Video of Naama Japam 

Wednesday, June 19, 2019

THURSDAY SPECIAL BHAJAN DT 20-6-2019




స్వామి దివ్య అనుగ్రహముతో, ఈ రోజు గురువారపు భజనలో18 మంది పాల్గొన్నారు. వేదము, భజన, కార్యక్రమము - బాలవికాస్, విద్యార్థులు మరియు పెద్దలు కూడా పాల్గొని, ఈ భజనలు పాడారు. విశ్వేశ్వర శాస్త్రి గణపతి ఓం జై గణపతి ఓం,  మాస్టర్ హేమాంగ్ , love is my form, మరియు, గోపాల రాధారాల, సాయిరూప- సత్యం, జ్ఞ్యానం, అనంతం  బ్రహ్మ, అనే భజనను చక్కగా ఆలపించింది. శరణ్య, శ్రావ్య, పవిత్ర, జై దుర్గ లక్ష్మి సరస్వతి,మాస్టర్ లీలా ధర్, గోపాలా రాధాలోలా  గాయత్రీ నాగ, కేశవా మాధవా అనే భజనను, రామ్  రామ్ రామ్ అనే భజనను,  కుమారి సాయి లక్ష్మి,  కృష్ణ, కృష్ణ , గోవింద కృష్ణ , గోపాల బాల కృష్ణ, అనే భజనను, చక్కగా ఆలపించారు.  శ్రీమతి శ్యామల గారు, జగదీశ్వరి దయ కారో మా,  శ్రీమతి కల్పన గారు సుబ్రహమణ్య భజనను ఆలపించారు. శ్రీ చల్ల మల్ల వెంకట లక్ష్మ రెడ్డి, జయ సాయి గురు దేవా, జయ సాయి గురు దేవా  అనే భజనను, కుమారి ఆశ్రిత, మానస భజేరే గురు చరణం అనే భజన ని ఆలపించారు. 
నాకు ఈ రోజు నచ్చిన నన్ను హత్తు కున్న భజనలు : జూనియర్స్ లలో - చిరంజీవి సాయి రూప పాడిన సత్యం, జ్ఞ్యానం, అనంతం  బ్రహ్మ  మరియు సీనియర్స్ లలో,  సాయి  లక్ష్మి  పాడిన కృష్ణ, కృష్ణ , గోవింద కృష్ణ , గోపాల బాల కృష్ణ, కుమారి ఆశ్రిత, మానస భజేరే గురు చరణం అనే భజనలను ఏ రకమైన తప్పులు లేకుండా పాడారు. 

చివరగా అందరూ స్వామి వారి గళంలో - రామ కోదండ రామ రమా కల్యాణ రామ  అనే భజనకు అందరూ కలసి స్వామి వారితో గొంతు కలిపి,  ఈ రోజు పుట్టు పండుగ జరుపుకున్న మన భజన ఇంచార్జి, శ్రీమతి కల్పన గారు, వారి కుమార్తె గాయత్రీ, కుమారుడు హేమాంగ్  స్వామి వారికి మంగళ హారతి సమర్పణతో ఈ నాటి గురువారపు భజన ముగిసినది. 


శ్రీమతి సునీత స్వామి వారి సందేశము వినిపించారు. వారితో పాటు కొత్త మహిళను కూడా తీసుకొని వచ్చారు.  బ్రహ్మార్పణం తరువాత అందరూ కలసి మూడు రకాల  ప్రసాదము ను స్వీకరించి,  హాల్ వెడలినారు. 
శ్రీమతి శైలేశ్వరి, 11 వ బ్యాచ్ CONVOCATION  విశేషాలను అందరికి తెలియ జేశారు. ఈ రోజు సేవలో నున్న వారు : శ్రీ లక్ష్మ రెడ్డి,  శ్రీ పాండు గారు క్లీన్ అండ్ గ్రీన్ లో సహకరించారు.  
ఈ కొన్ని కారణాల వాళ్ళ రాలేక పోయిన వారు,
మాస్టర్ సాయి కుమార్, మాస్టర్ సాయి గుప్తా, శ్రీమతి రేణుక ,   శ్రీమతి నీలిమ,మాస్టర్ ప్రాణవెండర్ రెడ్డి, కుమారి సాయి వాణి,   శ్రీమతి విజయ లక్ష్మి, శ్రీమతి జ్యోతి, శ్రీమతి సుకన్య, శ్రీమతి సంగీత, కుమారి జయ, శ్రీ శ్రీను,  మాస్టర్, సుకన్య గారి అబ్బాయి... మనము వాద్య సహకారమునకు శ్రీ నాయుడు గారిని, మరియు, వారి అమ్మాయిని అబ్బయిని కూడా ఆహ్వానించ వలెను. 
ఈ సారి కూడా  జ్యోతి ప్రకాశనమునకు శ్రీ సునీల్ గారిని ఆహ్వానించాము. ఈ సారి కూడా రా లేక పోయారు.  వచ్చే వారం తప్పకుండా విచ్చేస్తామని తెలియ జేశారు.  వచ్చే వారము మళ్ళి ఆహ్వానిద్దాము.   శ్రీ మల్లికార్జున్ మాన్యావారికి ప్రసాదము అందజేశాము.   జై సాయి రామ్. 


సమితి కన్వీనర్ 
విశ్వేశ్వర శాస్త్రి. పి 


Thursday, June 13, 2019

THURSDAY BHAJAN DT 13-6-2019



                  స్వామి దివ్య అనుగ్రహముతో, ఈ గురు వారపు భజనలో 21 మంది పాల్గొన్నారు. వేదము, భజన, కార్యక్రమము - బాలవికాస్, విద్యార్థులు మరియు పెద్దలు కూడా పాల్గొని, ఈ భజనలు పాడారు. మాస్టర్ ప్రణవ్, జై జై గణ నాయక, మాస్టర్ హేమాంగ్ , మాత మాత సాయి మాత, మాస్టర్ సాయి కుమార్, జగదీశ్వరి దయా కరోమా,  మాస్టర్ సాయి గుప్తా, జై సాయి రామ్, జై సాయి రామ్,   మాస్టర్ లీలా ధర్, గోపాలా రాధాలోలా -  కుమారి సాయి లక్ష్మి, రామా అనరాదా , కుమారి సాయి  వాణి పాడిన , సత్యనారాయణ గోవిందా మాధవా, సాయి నారాయణ గోవిందా కేశవా, అనే భజనను,  చిరంజీవులు,  గాయత్రీ నాగ, కేశవా మాధవా అనే భజనను, శరణ్య, శ్రావ్య, పవిత్ర, జై దుర్గ లక్ష్మి సరస్వతి అనే భజనను, సాయి రూప - గోవిందా రామా, గోపాలా రామా, అనే భజనను చక్కగా ఆలపించింది.  శ్రీమతి రేణుక గారు శ్రీమతి కల్పన గారు ఏంతో, ఆర్ద్రతతో గురు భజనను, మరియు కృష్ణ భజనను ఆలపించారు. శ్రీ చల్ల మల్ల వెంకట లక్ష్మ రెడ్డి, సత్య స్వరూపిణిమా, సాయి ప్రేమ స్వరూపిణి మా, అనే భజనను, శ్రీ పి విశ్వేశ్వర శాస్త్రి, నిత్యానందం - సచ్చిదానందం, అనే భజన భజానను పాడి, స్వామి తో మాట్లాడుకున్నారు. 
నాకు ఈ రోజు నచ్చిన నన్ను హత్తు కున్న భజనలు : జూనియర్స్ ల లో - చిరంజీవి సాయి రూప పాడిన గోవిందా రామా, గోపాలా రామా, మరియు సీనియర్స్ లలో,  కుమారి సాయి  వాణి పాడిన , సత్యనారాయణ గోవిందా మాధవా, సాయి నారాయణ గోవిందా కేశవా, అనే భజన ఏ రకమైన తప్పులు లేకుండా పాడారు. 

చివరగా అందరూ స్వామి వారి గళంలో - ప్రేమ ముదిత మానస కహా రామ రామ రామ్ అనే భజనకు అందరూ కలసి స్వామి వారితో గొంతు కలిపి, గుజరాత్ లో సంభవించిన వరద విపత్తు ను ద్రుష్టి లో నుంచుకొని వారు త్వరలో మామూలు పరిస్థులు ఏర్పడి, అంతా బాగుండాలని అందరము ప్రార్ధించి, నాగసానిపల్లి నుండి వచ్చిన, శ్రీ పాండు గారు, మరియు, బాల వికాస్ విద్యార్థులు స్వామి వారికి మంగళ హారతి సమర్పణతో ఈ నాటి గురువారపు భజన ముగిసినది.  శ్రీమతి నీలిమ, శ్రీమతి సునీత స్వామి వారి సందేశము వినిపించిన తదనంతరం రెండు నిమిషములు ధ్యానములో నుండి , బ్రహ్మార్పణం తరువాత అందరూ కలసి ప్రసాదము స్వీకరించి, హాల్ వెడలినారు. 



ఈ రోజు సేవలో నున్న వారు : శ్రీమతి సబితా, ( ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ నుండి పాదుకలు ఫోటో ను మరియు, దీపాల ప్లాస్టిక్ డోమ్ ను తీసుకొని వచ్చినారు. మరియు, శ్రీ పాండు గారు క్లీన్ అండ్ గ్రీన్ లో సహకరించారు. 


ఈ కొన్ని కారణాల వాళ్ళ రాలేక పోయిన వారు, శ్రీమతి శైలేశ్వరి, శ్రీమతి విజయ లక్ష్మి, శ్రీమతి జ్యోతి, శ్రీమతి సుకన్య, శ్రీమతి సంగీత, కుమారి జయ, శ్రీ శ్రీను, కుమారి ఆశ్రిత, మాస్టర్, సుకన్య గారి అబ్బాయి... మనము వాద్య సహకారమునకు శ్రీ నాయుడు గారిని, మరియు, వారి అమ్మాయిని అబ్బయిని కూడా ఆహ్వానించ వలెను. 

ఈ నాటి జ్యోతి ప్రకాశనమునకు శ్రీ సునీల్ గారిని ఆహ్వానించాము.. కానీ కొన్ని కలనాల వాళ్ళ రాలేదు.  వచ్చే వారము మళ్ళి ఆహ్వానిద్దాము.  అదే విధముగా శ్రీ మల్లికార్జున్ మాన్యావారిని కూడా. జై సాయి రామ్. 


సమితి కన్వీనర్ 
విశ్వేశ్వర శాస్త్రి. పి 




Friday, June 7, 2019

AUM SRI SAI RAM NAAMA JAPAM 9-6-2019


గత 25 సంవత్సలుగా ఈ  " ఓం శ్రీ సాయి రామ్  " నామజపం ను శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి నిర్వహింప జేస్తున్నది. కాన ఈ సంవత్సము కూడా దిగ్విజయముగా జరిపించాలని స్వామిని ప్రార్ధిస్తూ, జై సాయి రామ్.
స్వామి దివ్య ఆశీస్సులతో శ్రీమతి కళ్యాణి మరియు శ్రీ దివాకర్, శ్రీ ఎం ఎల్ నరసింహ రావు తదితరులు, జ్యోతి ప్రకాశనం గావించగా, స్వామి వారి ఆష్టోత్తర శత నామాలతో స్వామి పూజ అనంతరం, "ఓం శ్రీ సాయిరాం నామ జప కార్యక్రమము" అత్యంత భక్తి శ్రద్దలతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి సభ్యులు, మరియు బాల వికాస్ విద్యార్థులు, తల్లి తండ్రులు, అందరు కలసి ఉదయం 9 గంటల నుండి, 12 గంటల వరుకు, ఓం శ్రీ సాయి రామ్ నామ జపం ను, మరియు 12 గంటలనుండి, బాల వికాస్ విద్యార్థుల చే 30 నిమిషాలు, పెద్దలు 30 నిముషాలు, మరియు స్వామి వారి కంఠములో వీడియో భజన కు అందరూ కలిపి పాడగా, ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్, భక్తి తరంగాలతో, మారుమోగింది అనుటలో ఏ మాత్రముము అతిశయోక్తి లేదు. శ్రీ సత్య సాయి గ్రామా సేవా మహా యజ్ఞము లో భాగంగా మాకు అనుగ్రహించిన, " మలకుంట మేదర కుటీర వాసుల కార్యదర్శి, శ్రీ శ్రీను, కూడా కార్యక్రమంలో పాల్గొని, స్వామి వారి కంఠము లో భజనను వినిపించే అవకాశము లభించింది.  కార్యక్రమము 1 గంట కల్లా స్వామి వారికీ మంగళ హారతి లో  ముగిసినది. భక్తులంతా స్వామి వారి ప్రసాదమును, స్వీకరించి ఓం శ్రీ సాయి రామ్ నామ తరంగాలతో వారి వారి గృహాలకు చేరుకున్నారు. ఈ పవిత్ర కార్యక్రమములో 60 నుండి 80 మంది భక్తులు పాల్గొన్నారు. 
ఈ కార్యక్రమమును, దిగ్విజయముగా జరిపించిన స్వామికి ధన్యవాదములు.
========================================================================


కోటి సమితి లో మరల  4 వ ఆదివారము, బేగంబజార్ గల శ్రీ రతి రావు పాటిల్ గారి నివాసములో, ఓంకారరం సుప్రభాతం, వేదం, నగర సంకీర్తన, ఉదయం 6 గంటల నుండి,    సాయంత్రము 6 గంటల వరకు ఓం  శ్రీ సాయి రామ్ నామ జపం 6 గంటలనుండి 7-30 గంటల వరకు భజన జరుగును. మన మంతా ఈ కార్యక్రమములో కూడా పాల్గొని స్వామి వారి దివ్య ఆసిస్సులు పొందుదాము. 




YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...