Tuesday, June 25, 2019

A SPECIAL THURSDAY BHAJAN ON 27-6-2019

స్వామి దివ్య అనుగ్రహముతో, ఈ రోజు గురువారపు భజనలో 11 మంది పాల్గొన్నారు. వేదము, భజన, కార్యక్రమము - బాలవికాస్, విద్యార్థులు మరియు పెద్దలు కూడా పాల్గొని, ఈ భజనలు పాడారు. మాస్టర్ ప్రనవ్, గణపతి భజన, శ్రీ కృష్ణ రావు గారు గురు భజన,   శ్రీమతి విజయ లక్ష్మి, హరిహర స్మరణ కారో అనే భజనను,  మాస్టర్ హేమాంగ్ , మాత మాత భజనను, కల్పనా, రేణుక, ఆశ్రిత, గాయత్రీ నాగ తదితరులు, మరియు విశ్వేశ్వర శాస్త్రి, నిత్యా నందం, అనే భజనను, ఆలపించారు. స్వామి వారి సందేశము కుమారి ఆశ్రిత చదివి వినిపించారు. ఈ రోజు, మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన సునీల్ కుమార్ నాగ, గారు స్వామి కి హారతి సమర్పించి, వారు మాట్లాడుతూ, కోటి సమితి లో బాలవికాస్, వారు వారి క్రొత్తలో, వారి పిల్లలను, ఏదో పంపిస్తున్నామంటే నామ మాత్రానికి, పంపించానని, ఈ మధ్య కాలంతో పిల్లలు, హేమాంగ్, గాయత్రీ, వార్లలో ఎంతో, మార్పును గమనించానని,  వారు బాలవికాస్ లో  మరియు అనేక, ప్రదేశాలలో వారు నేర్చుకున్న విషయాలను, సునీల్ గారే స్వయంగా తెలుసుకునే వాడినని, తెలుసు కున్న తరువాత, మనస్ఫూర్తిగా, పిల్లలను తానే స్వయంగా, బాలవికాస్ క్లాస్ కి తీసుకొచ్చి, దింపుతున్నానని, తానూ ఏంతో గర్వపడుతున్నాని, తెలుపుతూ, ఈ బాలవికాస్ తరగతుల కు, చుట్టూ ప్రక్కల వున్నా పిల్లలను కూడా తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తానని తెలిపారు. 

నాకు ఈ రోజు నచ్చిన నన్ను హత్తు కున్నవిషయాలు, శ్రీ సునీల్ కుమార్ గారి స్పందన.   

చివరగా అందరూ స్వామి వారి గళంలో -ప్రేమ ముదిత మానస కహా రామ రామ్  అనే భజనకు అందరూ కలసి స్వామి వారితో గొంతు కలిపి,  పాడారు. . 


 బ్రహ్మార్పణం శ్రీ లక్ష్మి నారాయణ, ఉప్పు గూడా నివాసి సాయి భక్తుడు, సాయి సేవకుడు, ప్రసాద వితరణ గావించారు. 
ఈ రోజు సేవలో నున్న వారు :  క్లీన్ అండ్ గ్రీన్ లో కృష్ణ రావు టి వి. గారు సహకరించారు.  
ఈ కొన్ని కారణాల వాళ్ళ రాలేక పోయిన వారు, శ్రీమతి శైలేశ్వరి,  సాయిరూప-   శరణ్య, శ్రావ్య, పవిత్ర, ,మాస్టర్ లీలా ధర్,     కుమారి సాయి లక్ష్మి,   శ్రీమతి శ్యామల గారు,   శ్రీ పాండు గారు మాస్టర్ సాయి కుమార్, మాస్టర్ సాయి గుప్తా, శ్రీమతి సునీత,శ్రీమతి దసా  పద్మావతి ,    శ్రీమతి నీలిమ, కుమారి సాయి వాణి,  శ్రీ వేణు కుమార్ మెట్టు,  శ్రీమతి జ్యోతి, శ్రీమతి సుకన్య, శ్రీమతి సంగీత, కుమారి జయ, శ్రీ శ్రీను,  మాస్టర్, సుకన్య గారి అబ్బాయి... మనము వాద్య సహకారమునకు శ్రీ నాయుడు గారిని, మరియు, వారి అమ్మాయిని అబ్బయిని కూడా ఆహ్వానించ వలెను. 
ఈ రోజు  శ్రీ మల్లికార్జున్ మాన్యావార్  వారి బృందంస్వామి కి నమస్కరించుకుని ,  ప్రసాదము తీసుకొని  వెళ్లారు. వచ్చే వారము వారు హారతి, మరియు, వారి బృందం కూడా హాజరు కాగలరని తెలిపాడు.  జై సాయి రామ్. 


సమితి కన్వీనర్ 
విశ్వేశ్వర శాస్త్రి. పి 





1 comment:

SRI SATHYA SAI AVATARA PRAKATANA DINOSTAVAM CELEBRATIONS - 20-10-2025

  SRI SATHYA SAI AVATARA PRAKATANA DINOSTAVAM CELEBRATIONS - 20-10-2025  🎻 “వాయులీన లహరి” – వయోలిన్ సింఫనీ ప్రముఖ వాయులీన కళాకారుడు శ్రీ ...