Friday, October 18, 2019

Mahila Day 19-10-2019



Click here to  view Mahila Day Invitation Video


మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొన్న మహిళలు 





ఓం శ్రీ సాయిరాం 

ప్రతీ  నెల, 19 వ తారీకు న జరిగే మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా, ఈరోజు, శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో, మహిళా దినోత్సవ వేడుకలను, ఘనంగా  జరుపుకున్నాం. ఈరోజు, ఈ శిక్షణా శిబిరం, లో శిక్షణ పొందిన వారు, పొందుతున్న వారు, మొత్తం తొమ్మిది మంది, ఈ కార్యక్రమంలో, వారి వారి, అభిప్రాయాలను తెలియజేశారు, ముందుగా, ఈ శిక్షణా కేంద్రం, టీచర్, గారైన, శ్రీమతి దాస పద్మావతి గారు , పంచ మాత గురించి, సవివరంగా తెలియ జేసారు. పంచమాతలు భారతీయులకు ఆరాధనీయులు  వేదమాత - గోమాత భూమాత - దేశమాత - దేహమాత. ఈ పంచ మాతల  గురించి, స్వామి వారు తెలియజేసిన, అనేక విషయాలను, తెలియజేసారు.
శ్రీమతి సమీనా సుల్తానా మాట్లాడుతూ, తాను, వారి అమ్మగారికి, చిన్నతనంలో జరిగిన ఒక ప్రమాద సన్నివేశాన్ని గుర్తుచేసుకుంటూ, ఆ ప్రమాదం వల్ల, తన తల్లికి, కుడి చేతికి పెద్ద గాయం అయిందని, తర్వాత ఆ చేతిని కూడా తీసి వేశారని చెపుతూ, తనకు పెళ్లి అయి ఇద్దరు పిల్లలతో, ఇప్పుడు కూడా, తన తల్లి దగ్గరే ఉంటూ, తన తల్లికి, సేవలు చేస్తూ, తన జీవితాన్ని గడుపుతూ ఉన్నట్లుగా, తెలియజేస్తూ, ఒంటిచేత్తో, తన కూతురైన సమీనా సుల్తాన్ కు, మరి వారి ఇద్దరు పిల్లలు కూడా, ఎంతో రుచి కరంగా, పదార్థాలను వండి పెట్టి, ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నా, తన తల్లికి, హృదయ పూర్వకమైన, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తన తల్లికి, తను సదా, కృతజ్ఞతలు, తెలియజేసుకుంటూ, నా తల్లికి, నా జీవితాంతము తోడుగా ఉండి, సేవలు చేసుకునే భాగ్యం ప్రసాదించమని కోరుకుంటూ, తన ప్రసంగాన్ని ముగించింది.
శ్రీమతి డింపుల్ పండిత్ మాట్లాడుతూ, కుట్టు కేంద్రంలో, తను, తొమ్మిదో బ్యాచ్ లో శిక్షణ పొందినట్లు తెలియజేస్తూ, ఎన్నో విషయాలను నేర్చుకున్నానని, మీరు కూడా, పదమూడో బ్యాచ్లో వారందరూ కూడా, మహిళ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటు, అనేక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొని, స్వామి వారి  కృపకు, పాత్రులు కావాలన్నారు.

కుమారి రాజనందిని పండిత్, మాట్లాడుతూ, తాను, తన పెద్దతల్లి  గారికి, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తను, ఈ కుట్టు శిక్షణ కేంద్రం లో ఎంతో, క్రమశిక్షణతో, తాను, కుట్టు నేర్చుకుంటానని తెలియజేశారు.



కుమారి  అక్షిత రాణి  మాట్లాడుతూ, తాను తన పదవ యేటనే, తన తల్లిని కోల్పోయానని, తన నాయనమ్మ, తనను ఎంతో, జాగ్రత్తగా చూసుకుంటుందని, ఎంతో మంచి వంటకాలను, తయారుచేసి, పడుతుందని, చెప్తూ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తాను ఒక ఫాషన్ డిజైర్ గా కావాలని, కోరుకుంటూ, తన ప్రసంగాన్ని ముగించింది.



కుమారి tabassum, మాట్లాడుతూ, తాను, ఈ కుట్టు శిక్షణ లోనే, క్రమశిక్షణ, సమయపాలన, గురించి, నేర్చుకున్నానని, గతంలో, తాను, ఏ సమయంలో పెడితే ఆ సమయంలో నిద్రపోయేదాన్ని, ఏ సమయం అంటే ఆ సమయంలో నిద్ర చేదానినని, ఆ రకంగా ఉండేదని, ప్రస్తుతం, ఆ అలవాట్లకు స్వస్తి చెప్పి, మంచి అలవాట్లు నేర్పింది, నాకు ఈ సెంటరు అని తెలియజేసింది. ఇంకా tabassum మాట్లాడుతూ, మా ఇంట్లో వారు, నా ట్రైనింగ్, పూర్తి కాకమునుపే, నా మీద ఎంతో ప్రేమతో, నాకు, కుట్టుమిషన్ కొని ఉంచారని, దానితో, నీవు ప్రావీణ్యత సంపాదించాలని, tabassum పై ఉన్న ప్రేమను, ప్రేమ పడుతున్న వాళ్లను, మరొక్కసారి తాను కూడా, వారి ప్రేమను, చూసుకుంటూ, తాను, ఇంత మంది ప్రేమకు నోచు కున్నందుకు,  తను కూడా, వారి పైన ఉన్న ప్రేమను, విడిపోకుండా, ఉండాలంటే తాను కూడా వివాహం చేసుకోకుండా, ఉండాలని కోరుకుంటూ ఉన్నానని, తెలియజేసుకుంటూ, తన ప్రసంగాన్ని, ముగించింది. 
చివరగా, నూర్జహాన్, మాట్లాడుతూ, తల్లి యొక్క, గొప్పదనం గురించి, అనేక, అనేక కోణాల్లో, తెలియజేసారు.. అందరూ స్వామివారి ప్రసాదాన్ని , స్వీకరించిన తదనంతరం, కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది, జై సాయి రామ్.

సాయిరాం 

విశ్వేశ్వర శాస్త్రి పి 



    

Sunday, October 13, 2019

Report and Photos. press clippings etc., statistical data also dt 13-10-2019


Report dated 13-10-2019

ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో  భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 94 వ జన్మదినోత్సవాలలో భాగంగా, ఈరోజు 13 10 2019 న సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి, ఆధ్వర్యంలోఉదయం 10 గంటలకు abids లో గల ఇస్కాన్, హరే రామ హరే కృష్ణ, గుడి నుండి, శ్రీ సత్య సాయి వ్రతములో పాల్గొంటున్నవారు, సేవాదళ్ సభ్యులు, మహిళలు అందాలు సాంప్రదాయ దుస్తులలోపట్టు వస్త్రములు ధరించి, ఊరేగింపుగా, సాయి గాయత్రి మంత్రం నామస్మరణతో, 10-30 గంటలకి, పుల్లారెడ్డి భవనము నందు ఉన్న, శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్ ప్రాంగణంలో శ్రీమతి ఆలూరి కళ్యాణి, WONDERBOOK OF RECORDS, అవార్డు గ్రహీత, శ్రీ సత్య సాయి భక్తురాలు, శ్రీ సత్య సాయి వ్రతమును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి, DE ts  ఎలక్ట్రిసిటీ, మరియు శ్రీమతి అన్నపూర్ణ, శ్రీ దివాకర్, శ్రీమతి కళ్యాణి, సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి,పి. జ్యోతి ప్రకాశం గావించిన అనంతరం, విఘ్నేశ్వర పూజ, షోడశోపచార పూజ, శ్రీ సత్య సాయి వ్రతములో, మొదటి అధ్యాయములో భగవాన్ శ్రీ సత్య సాయి లీలను తెలిపే లీలాకాండ, మహిమకాండ, రక్షకాండ, ఆధ్యాతిక శిక్షాకాండ, చివరగా పంచమ కాండ బోధ కాండ, తో వ్రతము పరిసమాప్తి అయినడి. శ్రీమతి ఆలూరి కళ్యాణి, వారి సుమధుర గళంలో వ్రత నిర్వహణలో, అనేక పాటలు, పద్యాలు వినిపిస్తూ, భక్తులను ఆనందపరవాసులను గావించారు. 
 స్వామి వారికి మంగళ హారతి తో ఈ నాటి కార్యక్రమము ముగిసినది.      ఈ నాటి కార్యక్రమములో, సేవాదళ్ సభ్యులు, మహిళలు, ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్, సభ్యులు, తదితలులు పాల్గొన్నారు.      శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి పక్షాన శ్రీమతి అక్కపెద్ది అన్నపూర్ణ, శ్రీ సత్య వ్రతమును  ఏంతో భక్తి ప్రపత్తులతో, వ్రతమును నిర్వహించిన శ్రీ ఆలూరి కళ్యాణి గారిని, స్వామి ప్రేమను ఒక జ్ఞ్యాపిక ను బహుకరించారు.  అందరు , విభూతి ప్రసాదాన్నిస్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామి నామాన్ని నెమరువేసుకుంటూ వారి వారి గృహములకు తరలినారు. 
ఫొటోస్ జత చేయడమైనది. సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి. పి 


रिपोर्ट दिनांक 13.10.2019
ऊं श्री साईराम
भगवान श्री श्री श्री सत्यसाईबाबा जी के दिव्य आशीर्वादों से भगवान श्री सत्यसाईबाबा के 94 वें जन्मदिन के समारोहों के सिलसिले में आज दि. 13.10.2019 को सत्यसाई सेवा संगठन, कोठी समिति के द्वारा सुबह 10 बजे आबिड्स में स्थित इस्कान हरेराम- हरे कृष्ण मंदिर से श्री सत्यसाई व्रत में भाग लेनेवाले,सेवादल सदस्य,महिलाएं सुंदर संप्रदाय वस्त्र पहनकर, जुलूस से साई गायत्री मंत्र जप करते हुए,10.30 बजे पुल्लरेड्डी भवन स्थित श्री सत्यसाई स्टडी सर्किल के प्रांगण में वंडर बुक आफ रिकार्ड्स के पुरस्कार ग्रहीता, श्री सत्यसाई के भक्त श्रीमती आलूरि कल्याणी द्वारा श्री सत्यसाई व्रत का आयोजन किया गया । 
इस कार्यक्रम तेलंगाना राज्य के डी.इ. विद्युत शाखा, श्रीमती अन्नपूर्णा,श्री दिवाकर,श्रीमती कल्याणी, श्री पी विश्वेश्वर शास्त्री, समिति के संयोजक द्वारा ज्योती प्रकाशन के बाद श्री गणेश पूजा, शोडसोपचार पूजा, श्री सत्यसाई व्रत के पांच कांडों में लीला कांड, महिमाकांड, रक्षा कांड, आध्यात्मिक शिक्षा कांड और अंतिम कांड बोधकांड से व्रत सुसंपन्न हुआ । इस व्रत के आयोजन में श्रीमती आलूरि कल्याणी अपने सुमधुर स्वर से कई गाने, पद्य सुनाते हुए भक्त जनों का मन आनंद से भराये ।

स्वामी को मंगल हारती से आज का कार्यक्रम संपन्न हुआ ।  
   आज के इस कार्यक्रम में सेवादल के सदस्य, महिलाएं, ऒकेशनल प्रशिक्षण केंद्र के सदस्यगण आदि ने भाग लिया ।

    श्री सत्यसाई संगठन, कोठी समिति की तरफ से श्रीमती अक्किपेद्दि अन्नपूर्णा द्वारा श्री सत्यसाई व्रत भक्ति-श्रद्धा से आयोजित करने वाले श्रीमती आलूरि कल्याणी को स्वामी के प्रेम को एक ज्ञापिका के रूप में दिया गया । 

सभी भक्त जन  विभूति प्रसाद और स्वामी के प्रसाद का ग्रहण कर स्वामी का नम स्मरण करते हुए अपने घर वापस लौटे ।

फोटो संलग्नित हैं. 
समिति के संयोजक
पी विश्वेश्वर शास्त्री


















press clippings


Friday, October 11, 2019

Saamookhi Sri Sathya Sai Vratam 13-10-2019



ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 13 102019 న సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి, ఆధ్వర్యంలో, ఉదయం 9.30. అబిడ్స్ లో గల , హరే రామ హరే కృష్ణ, గుడి నుండి, వ్రతములో  పాల్గొనే వారందరూ, పట్టు వస్త్రములు ధరించి, ఊరేగింపుగా, సాయి గాయత్రి మంత్రం నామస్మరణతో, పది గంటలకి, పుల్లారెడ్డి భవనము నందు ఉన్న, స్టడీ సర్కిల్ ప్రాంగణం మనకు చేరుట, తరువాత, అందరూ వారికి కేటాయించిన స్థానములలో, వారు కూర్చుండుట. తర్వాత కార్యక్రమం ప్రారంభం. సామూహిక శ్రీ సత్యసాయి నిర్వహణ, శ్రీమతి ఆలూరి కళ్యాణి గారిచే, ఈ కార్యక్రమంలో పాల్గొను  వారు, కోటి సమితి సభ్యులు, మరియు, గ్రామ సేవ మహాయజ్ఞం లో భాగంగా, మనము భజనలు నిర్వహించిన, వారు, అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, మన సంకల్పం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టకు, ఇప్పటివరకు, పేర్లు నమోదు చేసుకున్న వారు, శ్రీమతి శ్రీ పెనుగొండ ప్రకాష్, మహంకాళి నరసింహారావు, శ్రీ చక్రధర్, శ్రీమతి పద్మావతి అండ్ ఫ్యామిలీ, శ్రీమతి అనిత అండ్ ఫ్యామిలీ,, శ్రీ పాండు అండ్ ఫ్యామిలీ, శ్రీ నాగేశ్వర రావు విశ్వకర్మ అండ్ ఫ్యామిలీ, శ్రీమతి రచన గుప్తా అండ్ ఫ్యామిలీ, శ్రీ శ్రీనివాస రావు అండ్ ఫ్యామిలీ, శ్రీ లక్ష్మీ నారాయణ అండ్ ఫ్యామిలీ, ఇంతవరకు మొత్తం 11 మంది, జంటలు, పేర్లు నమోదు చేసుకోవడం అయినది. జై సాయి రామ్


Saturday, October 5, 2019

IST SUNDAY 6-10-2019 NAGARA SANKEERTHANA



ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, నెలలో మొదటి ఆదివారం, ఈరోజు అనగా 6 10 2019 , హనుమాన్ టెక్డి లో గల, హనుమాన్ మందిరంలో, ఈరోజు ఉదయం నగర సంకీర్తన కార్యక్రమం, దిగ్విజయంగా జరిపించిన, స్వామికి హృదయ పూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈనాటి కార్యక్రమంలో శ్రీ రామ్ చందర్, సాయి కుమార్, వెంకట చక్రధర్, మహంకాళి లక్ష్మీనరసింహారావు, విశ్వకర్మ నాగేశ్వరరావు, శ్రీ సురేంద్ర పటేల్, సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, శ్రీమతి రేణుక, శ్రీ శరణ్, తదితరులు పాల్గొన్నారు, ఈ నాటి కార్యక్రమంలో శ్రీ సురేంద్ర పటేల్ గారు స్వామివారికి మంగళహారతి సమర్పణతో, కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. ఓం శ్రీ సాయి రామ్





99TH BIRTHDAY CELEBRATIONS AT SIVAM STARTING FROM 17TH NOVEMBER, 2024:

  భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి  దివ్య ఆశిస్సులతో   “  సత్యసాయి భగవానుని   99 వ జన్మ దిన వేడుకలలో భాగంగా   ” 17  నవంబర్ , 2024  న   హైదరాబ...