Friday, October 18, 2019

Mahila Day 19-10-2019



Click here to  view Mahila Day Invitation Video


మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొన్న మహిళలు 





ఓం శ్రీ సాయిరాం 

ప్రతీ  నెల, 19 వ తారీకు న జరిగే మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా, ఈరోజు, శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో, మహిళా దినోత్సవ వేడుకలను, ఘనంగా  జరుపుకున్నాం. ఈరోజు, ఈ శిక్షణా శిబిరం, లో శిక్షణ పొందిన వారు, పొందుతున్న వారు, మొత్తం తొమ్మిది మంది, ఈ కార్యక్రమంలో, వారి వారి, అభిప్రాయాలను తెలియజేశారు, ముందుగా, ఈ శిక్షణా కేంద్రం, టీచర్, గారైన, శ్రీమతి దాస పద్మావతి గారు , పంచ మాత గురించి, సవివరంగా తెలియ జేసారు. పంచమాతలు భారతీయులకు ఆరాధనీయులు  వేదమాత - గోమాత భూమాత - దేశమాత - దేహమాత. ఈ పంచ మాతల  గురించి, స్వామి వారు తెలియజేసిన, అనేక విషయాలను, తెలియజేసారు.
శ్రీమతి సమీనా సుల్తానా మాట్లాడుతూ, తాను, వారి అమ్మగారికి, చిన్నతనంలో జరిగిన ఒక ప్రమాద సన్నివేశాన్ని గుర్తుచేసుకుంటూ, ఆ ప్రమాదం వల్ల, తన తల్లికి, కుడి చేతికి పెద్ద గాయం అయిందని, తర్వాత ఆ చేతిని కూడా తీసి వేశారని చెపుతూ, తనకు పెళ్లి అయి ఇద్దరు పిల్లలతో, ఇప్పుడు కూడా, తన తల్లి దగ్గరే ఉంటూ, తన తల్లికి, సేవలు చేస్తూ, తన జీవితాన్ని గడుపుతూ ఉన్నట్లుగా, తెలియజేస్తూ, ఒంటిచేత్తో, తన కూతురైన సమీనా సుల్తాన్ కు, మరి వారి ఇద్దరు పిల్లలు కూడా, ఎంతో రుచి కరంగా, పదార్థాలను వండి పెట్టి, ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నా, తన తల్లికి, హృదయ పూర్వకమైన, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తన తల్లికి, తను సదా, కృతజ్ఞతలు, తెలియజేసుకుంటూ, నా తల్లికి, నా జీవితాంతము తోడుగా ఉండి, సేవలు చేసుకునే భాగ్యం ప్రసాదించమని కోరుకుంటూ, తన ప్రసంగాన్ని ముగించింది.
శ్రీమతి డింపుల్ పండిత్ మాట్లాడుతూ, కుట్టు కేంద్రంలో, తను, తొమ్మిదో బ్యాచ్ లో శిక్షణ పొందినట్లు తెలియజేస్తూ, ఎన్నో విషయాలను నేర్చుకున్నానని, మీరు కూడా, పదమూడో బ్యాచ్లో వారందరూ కూడా, మహిళ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటు, అనేక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొని, స్వామి వారి  కృపకు, పాత్రులు కావాలన్నారు.

కుమారి రాజనందిని పండిత్, మాట్లాడుతూ, తాను, తన పెద్దతల్లి  గారికి, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తను, ఈ కుట్టు శిక్షణ కేంద్రం లో ఎంతో, క్రమశిక్షణతో, తాను, కుట్టు నేర్చుకుంటానని తెలియజేశారు.



కుమారి  అక్షిత రాణి  మాట్లాడుతూ, తాను తన పదవ యేటనే, తన తల్లిని కోల్పోయానని, తన నాయనమ్మ, తనను ఎంతో, జాగ్రత్తగా చూసుకుంటుందని, ఎంతో మంచి వంటకాలను, తయారుచేసి, పడుతుందని, చెప్తూ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తాను ఒక ఫాషన్ డిజైర్ గా కావాలని, కోరుకుంటూ, తన ప్రసంగాన్ని ముగించింది.



కుమారి tabassum, మాట్లాడుతూ, తాను, ఈ కుట్టు శిక్షణ లోనే, క్రమశిక్షణ, సమయపాలన, గురించి, నేర్చుకున్నానని, గతంలో, తాను, ఏ సమయంలో పెడితే ఆ సమయంలో నిద్రపోయేదాన్ని, ఏ సమయం అంటే ఆ సమయంలో నిద్ర చేదానినని, ఆ రకంగా ఉండేదని, ప్రస్తుతం, ఆ అలవాట్లకు స్వస్తి చెప్పి, మంచి అలవాట్లు నేర్పింది, నాకు ఈ సెంటరు అని తెలియజేసింది. ఇంకా tabassum మాట్లాడుతూ, మా ఇంట్లో వారు, నా ట్రైనింగ్, పూర్తి కాకమునుపే, నా మీద ఎంతో ప్రేమతో, నాకు, కుట్టుమిషన్ కొని ఉంచారని, దానితో, నీవు ప్రావీణ్యత సంపాదించాలని, tabassum పై ఉన్న ప్రేమను, ప్రేమ పడుతున్న వాళ్లను, మరొక్కసారి తాను కూడా, వారి ప్రేమను, చూసుకుంటూ, తాను, ఇంత మంది ప్రేమకు నోచు కున్నందుకు,  తను కూడా, వారి పైన ఉన్న ప్రేమను, విడిపోకుండా, ఉండాలంటే తాను కూడా వివాహం చేసుకోకుండా, ఉండాలని కోరుకుంటూ ఉన్నానని, తెలియజేసుకుంటూ, తన ప్రసంగాన్ని, ముగించింది. 
చివరగా, నూర్జహాన్, మాట్లాడుతూ, తల్లి యొక్క, గొప్పదనం గురించి, అనేక, అనేక కోణాల్లో, తెలియజేసారు.. అందరూ స్వామివారి ప్రసాదాన్ని , స్వీకరించిన తదనంతరం, కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది, జై సాయి రామ్.

సాయిరాం 

విశ్వేశ్వర శాస్త్రి పి 



    

No comments:

Post a Comment

UGADI & SRIRAMA NAVAMI CELEBRATIONS AT SIVAM - BY GANDHI NAGR SAMITHI. 30-3-2025 BY GANDHINAGAR SAMTHI, AND MEHDIPATNAM SAMITHI.

 UGADI INVITATION From Convenor Brother Sri B V Madhusudhan  S/o Late Sri B V L Narasimha Rao Garu  Sairam Sir  We invite  you and all your ...