Sunday, November 24, 2019

శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ కి 4 సంవత్సరములు.పూర్తి చేసుకున్న సందర్భములో


మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చేఎందుకు ఏర్పడిన శ్రీ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ( టైలరింగ్ ) 4 సంవత్సరములు పూర్తిచేసుకున్నది. గృహిణులు, సాధికారతఃను, సాధించేందుకు, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి,హైద్రాబాద్, ఆద్యర్యంములో, 4 సంవత్సరముల క్రింద ఉస్మాన్ గూంజ్ లో గల తోప్ ఖనా లో ప్రారంభమై, 12 బ్యాచేలలో కుట్టు శిక్షణ, మరియు ఒక బ్యాట్ వారికీ మెహందీ, బ్యూటిషన్, కోర్సులలో శిక్షణ నిచ్చారు.
ఈ శిక్షణా తరగతులు, డిసెంబర్, 5, 2015 ప్రారంభమై, ఇంతవరకు 12 బ్యాచ్లు పూర్తి చేసుకున్నది. ప్రస్తుతము 13 వ బ్యాచ్ కొనసాగుతున్నది.

ఇంతవరకు కుట్టు శిక్షణ పొందిన వారు, దాదాపు 220 మంది, వారిలో 50 శాతం మంది, వారి వారి కాళ్లపై వారు నిలబడే విధంగా, నెలకు, ఐదు వేల నుండి, ఆరు వేల రూపాయల వరకు, సంపాదించుకుంటున్న ట్లుగా, తెలియజేశారు, మరి కొందరు వారి వారి ఇండ్లలో నున్న వారి గుడ్డలు కుట్టి ఆనందామును వ్యక్త పరిచారు. వీరిలో పురానాపూల్ కు చెందిన అశ్విని మన దగ్గర పదో బ్యాచ్లో, టైలరింగ్ లో, శిక్షణ పొంది, ఈ మధ్యనే, ఒక అడ్వాన్స్డ్ ఎలక్ట్రికల్ కుట్టు యంత్ర ము కొని తాను నెలకు 12 వేల నుండి 13 వేల రూపాయల వరకు కూడా సంపాదించుకుంటున్న ట్లు, తెలియజేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

సత్య సాయి వోకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో, 2015లో , మూడు కుట్టు యంత్రం లతో, ప్రారంభమైన ఈ కేంద్రం ఇప్పుడు, 10 మిషన్ లతో, మరియు ఒక పికో మిషన్ తో నున్నది, 

ఈ పికో మిషన్, ఈ కుట్టు కేంద్రంలో , గతంలో నేర్చుకున్నవారు, ప్రస్తుతం నేర్చుకుంటున్న వారు, అందరూ ఉపయోగించుకునే విధంగా నెలకొల్పడం అయినది,

ఈ కేంద్రంలో మూడో వ బ్యాచ్లో, ట్రైనింగ్ అయిన శ్రీమతి పద్మావతి గారు, ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు,

ఈ ట్రైనింగ్ సెంటర్లో, ప్రతి 19వ తేదీన మహిళా దినోత్సవ వేడుకలను కూడా , జరుపుకొనుట విశేషం. 

ఈ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న వారితో, ప్రత్యేకంగా , బొంతలు, లంగోటాలు, చిన్నపిల్లలకు కుల్లాలు  కుట్టించి, వారితోనే, సుల్తాన్ బజార్  ప్రసూతి గృహమునందు , వారిచే ఇప్పించబడి వారిలో సేవా భావమును పెంపెందింప జేయడమైనది.  ఈ కార్యక్రమం ప్రతి మూడు నెలలకు ఒక సారి జరుగుతున్నది. 


ఈ ట్రైనింగ్ సెంటర్లో, ప్రతి 19వ తేదీన మహిళా దినోత్సవ వేడుకలను కూడా , జరుపుకొనుట విశేషం. 

వీటితో బాటుగా, ప్రతి గురువారం, భజన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. 

మరియు ఈ నెల 18 వ తేదీన స్వామి వారి 94 వ జన్మ దినోత్సవ వేడుకలలో కూడా ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ నుండి అధిక సంఖ్య లో పాల్గొన్నారు. 


ఇంతవరకు 12 బ్యాచులు పూర్తి అయినవి. ఒక్క  బ్యాచ్లో 20 మందిని తీసుకుంటున్నాము. ప్రతిరోజు తరగతి 11  గంటలకు ప్రారంభమై 2 గంటల వరకు కొనసాగును. రోజూ 3  గంటలు, మొత్తము 100 రోజులు. 

దీనితోపాటు, శిక్షణ పొందుతున్న వారికి, కుట్టు యంత్రం మెకానిజం తరగతులను,  కూడా నిర్వహింపబడుతుంది. ఈ తరగతిలో శిక్షణ ఇచ్చేవారు శ్రీశైలం మాస్టర్.

ఈ శిక్షణలో క్రొత్తగా, ప్రతి ఒక్కరూ, నేర్చుకోవటానికి వీలుగా, స్కూల్ యూనిఫామ్ లో, ప్రావీణ్యత, పొందే విధంగా శ్రీ పెంటయ్య మాస్టర్  గారు, వచ్చి , నిక్కరు, చొక్కా, అంటే షర్టు నేర్పుతున్నారు.



ఈ సెంటర్లో, మగ్గం తరగతులను కూడా, ప్రవేశపెట్టాలని అనుకొని చున్నాము.


ఇంతవరకు జరిగిన సర్టిఫికెట్స్ బహుకరణ కార్యక్రమాలలో, శ్రీ సత్య సాయి సేవ సంస్థల , హైదరాబాద్ జిల్లా అద్ధ్యఖులు,, శ్రీ ఏ మల్లేశ్వర రావు గారు, మహిళా కో-ఆర్డినేటర్, శ్రీమతి సుధా గారు, అల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీ నిమేష్ పాండ్యా, రాష్ట్ర అధ్యఖులు శ్రీ పి వెంకట్ రావు, స్వామి వారి అనువాదకులు, proff. కామరాజు అనిల్ కుమార్, రాష్ట్ర ఉపాధ్ఖులు, డాక్టర్ కృష్ణ కుమార్, పూర్వ అధ్యఖులు, శ్రీ ఎం వి. ఆర్ శేష సాయి, అన్నమాచార్య భావన వాహిని ఫౌండర్ ప్రెసిడెంట్ పద్మశ్రీ డాక్టర్ శోభా రాజు గారు, బర్కలీ స్కూల్ అఫ్ లా యూనివర్సిటీ అఫ్ కాలిఫోర్నియా లోపట్టాభూద్రులై, మీడియా స్పీకర్, గా అకాడమిక్ రైటర్ గా నున్న శ్రీమతి కృత్తిక వాసిరెడ్డి గార్లు పాల్గొన్నారు.

10th Batch Convocation - held on 17-2-2019 






11th batch Convocation 


12 th batch 










No comments:

Post a Comment

Sri Sathya Sai Prema Pravahini Radha Yatra. 22-12-2025

PL click here Hans india press clipping link.  Aruna Chandaraju This programme was all about taking music to the people. On a delightfully w...