అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుల సర్క్యులర్ 46 ( ప్రపంచ వ్యాప్త అఖండ గాయత్రి మంత్ర పఠనం, జూన్ 13-14, 2020)
ఆత్మీయ సాయి సోదర సోదరీ మణులకు,
సాయిరాం.
2020 జూన్ 13 వ తేదీ ఉదయం 8 గంటల నుండి 14 వ తేదీ ఉదయం 8 గంటల వరకు 24 గంటల ప్రపంచ వ్యాప్త అఖండ గాయత్రి మంత్ర పఠనం కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి అంతర్జాతీయ సంస్థ వారు నిర్వహిస్తున్నారు.
ఇట్టి మహత్తరమైన , ముఖ్యమైన అంతర్జాతీయ కార్యక్రమంలో భారత దేశం లోని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కూడా తప్పక పాల్గొంటె బాగుంటుందని భావించిన అంతర్జాతీయ శ్రీ సత్యసాయి సేవా సంస్థల చైర్మన్ డాక్టర్ నరేంద్ర నాథ్ రెడ్డి గారితో నేను ఏకీభవించినాను. పూర్తి వివరములకు డాక్టర్ నరేంద్ర నాథ్ రెడ్డి గారు ఇచ్చిన సర్క్యులర్ జతపరుస్తున్నాను.
ఈ కార్యక్రమంలో భారత దేశం కు ఇచ్చిన సమయం 13 వ జూన్ రాత్రి 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అయినప్పటికీ 24 గంటలూ గాయత్రి మంత్రం జపించ వచ్చు.
సర్క్యులర్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉన్నదని గమనించండి. మన భారతీయులకు ఇది తప్పనిసరి కాదు. మీకు ఆసక్తి ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
మన దేశంలో గాయత్రి మంత్రం యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలిసినదే. మనలో చాలా మందిమి నిత్యం జపిస్తూనే ఉన్నాం. అంతర్జాతీయంగా మన సోదరులు చేస్తున్న ముఖ్య కార్యక్రమంలో, వారి సత్సంకల్పం లో మనం కూడా భాగస్వాములు అవుదాం.
ఆ 24 గంటలలో వీలున్నన్నీ గంటలు గాయత్రి మంత్రాన్ని జపిద్దాం. మనకిచ్చిన 2 గంటల సమయంలో (13 వ తేదీ రాత్రి 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు) తప్పక పాల్గొన్దాం.
ఈ విపత్కర పరిస్థితుల్లో అంతర్జాతీయంగా మన సాయి సోదరుల తో కలిసి అందరం గాయత్రి మంత్రాన్ని జపిస్తే, స్వామి తప్పక ఆనందిస్తారు. ప్రపంచం లో శాంతి, ఆనందం వెల్లివిరుయుటకు సామూహిక గాయత్రి మంత్ర పఠనం తప్పక దోహద పడుతుంది.
సాయి సేవలో,
శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి లో 44 మంది భక్తులు గాయత్రీ మంత్రం ను 14వ తేదీన రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు పాటించారు.
No comments:
Post a Comment