Friday, August 20, 2021

KOTI SAMITHI VARALAKSHMI POOJA AT SIVAM - 20-8-2021 ( FRIDAY )







ఓం శ్రీ సాయిరాం

భగవాన్ దివ్య అనుగ్రహంతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి, మహిళలకు, భగవానుడు, నడయాడిన శివ మందిర ప్రాంగణంలో, లో ఈరోజు అనగా, స్వస్తిశ్రీ నీ చాంద్రమానేన శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్షరుతువు, శ్రావణమాసం  త్రయోదశి, శుక్రవారం, నాడు, కోటి సమితి మహిళలు, 

శ్రీమతి శైలేశ్వరి, శ్రీమతి రేణుక, శ్రీమతి కల్పన, శ్రీమతి జ్యోతి, శ్రీమతి విజయలక్ష్మి, శ్రీమతి భువనేశ్వరి, సీతా మహాలక్ష్మి, శివ మందిరం లో జరిగిన వరలక్ష్మి పూజ, ఇతర, 4 సమితి మహిళలతోపాటు, ఎంతో ఘనంగా, వరలక్ష్మి పూజ లో పాల్గొని, స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు, పొంది, స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి, ఉన్నారు. సాయిరాం. 

VARALAKSHMI VRATAM - VIDHANAM 


మన తెలుగు క్యాలెండర్‌లో 12 నెలలున్నాయి. వాటిలో శ్రావణ మాసం ఐదోది. ఇది ఎంతో పవిత్రమైన నెలగా హిందువులు భావిస్తారు. ముఖ్యంగా మహిళలకు ఇది అత్యంత ముఖ్యమైన నెలగా భావిస్తారు. ఈ సంవత్సరం శ్రావణమాసం ఆగస్టు 9న మొదలై, సెప్టెంబర్ 7న ముగుస్తుంది. శ్రావణ మాసం రావడంతోనే... తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం మొదలవుతుంది

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైంది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని మహిళలు అధికంగా ఆచరిస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు.

అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీ దేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి. ఈ విషయాన్ని స్వయంగా శివుడు పార్వతీదేవికి చెప్పినట్లు స్కాంద పురాణంలో ఉంది.


అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము జీవంచాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే.


పసుపు, కుంకుమ, తమల పాకులు, వక్కలు, అరటి పండ్లు, వంటి అన్ని పూజలకు ఉపయోగించే పూజా సామాగ్రి వరలక్ష్మి వ్రతానికి కూడా ఉపయోగిస్తారు. అయితే ఈ రోజున స్పెషాలిటీ ఏమిటంటే.. నవ సూత్రంతో కూడిన తోరం. అంటే పూజ చేసే మహిళలందరూ తెల్లని దారములు తీసుకొని తొమ్మిది ముడులు వేసి కుంకుమ అద్దాలి.


మొదట పసుపుతో గణపతిని పూజించి అనంతరం కలశంలోనికి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తరువాత అథాంగ పూజచేయవలెను. అష్టోత్తరశతనామ పూజతో నామాలను చదివి, దూప, దీప, నైవేద్యాలను తాబూలాలని సమర్పించాలి. అనంతరం కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకొనవలెను. నవకాయ పిండివంటలూ, పండ్లూ మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి. చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మీగా భావించి వాయనమీయవలెను


తోరగ్రంథి పూజ చేసి.. తోరం ధరించిన అనంతరం వరలక్ష్మి వ్రత కథ చెప్పుకుని లక్ష్మీదేవిని పూజించాలి. అనంతరం నవకాయ పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. వాయినంగా నానబెట్టిన శనగలు పంచిపెట్టాలి. అయితే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వీలుకాకపోతే.. తరువాత వచ్చే శ్రావణ శుక్రవారాల్లో కూడా ఈవ్రతాన్ని చేయవచ్చును. అయితే శ్రావణ రెండవ శుక్రవారానికి ప్రాశస్త్యం ఎక్కువ. 

The Varalakshmi vrata is a boon for all women. Women always strive hard for the welfare of their family. They always aspire for samata, samagrata, samaikyata and sowbhratrutwa (equality, integrity, unity and fraternity). Their speech is truthful, their hearts are full of peace and their actions are righteous. Women, being the recipients of eight forms of wealth, confer prosperity and auspiciousness on the family, society and the world at large. You might have heard the story of Savitri, who, with the power of her character, overcame many obstacles to bring her dead husband back to life. Even in this Age of Kali, it is the prayer of wives that protects their husbands in times of danger. Many women in the past performed Varalakshmi vrata with devotion and sincerity, and became the recipients of the grace of Goddess Lakshmi (consort of Vishnu and goddess of wealth).

శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు స్త్రీమూర్తులందరూ శ్రద్ధా భక్తులతో అమ్మవారిని ఆరాధించి పూజించే ఒక దివ్యమైన వ్రతం వరలక్ష్మీ వ్రతం. సత్య సాయి మాత ఈ వరలక్ష్మీ వ్రతం విశిష్టతను వివరిస్తూ ఇచ్చిన ఒక అమృత గుళికను స్వామి ఉపన్యాసంలోంచి మీకోసం అందిస్తున్నాం


LINK 


- Divine Discourse, Aug 11, 2000


1 comment:

YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...