Sunday, September 12, 2021

GANESH CHAVITHI CELEBRATIONS FINAL DAY I.E. 12-9-2021.

 ఓం శ్రీ సాయిరాం, 

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, ఈరోజు అనగా, 12 9 2021 న, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, వినాయక చవితి, ఉత్సవాల, మూడవ రోజు ముగింపు కార్యక్రమాన్ని, బాల వికాస్ విద్యార్థులు బాలవికాస్ గురువులు సేవా దళ సభ్యులు, సత్యసాయి విద్య ప్రోత్సాహక అవార్డు గ్రహీతలు, వారి తల్లిదండ్రులు, అందరూ ఈ వినాయక నిమజ్జనం కార్యక్రమంలో, పాల్గొనడం విశేషం. 

బాలవికాస్, విద్యార్థులు, ఎంతో, సుస్వరంగా, గంటసేపు, విభజన అనంతరం, స్వామివారికి, సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, మంగళహారతి సమర్పణ, నైవేద్యం, తదనంతరం, అందరూ కలిసి, స్వామివారి ప్రసాదాన్ని, ఎంతో, భక్తితో, పిల్లలు పెద్దలు అందరూ కలిసి, తీసుకొని, నిమర్జనం కార్యక్రమానికి, ప్రారంభ సూచనగా, శ్రీమతి రేణుక గారు, స్వామివారికి, కొబ్బరికాయ సమర్పించుకున్నారు. అందరూ కలిసి, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. జై జై బోలో గణేష్ మహరాజ్ కి జై, అనే జై జై జై జై కారములతో, హాల్ దద్దరిల్లిపోయింది. పిల్లల్లో, పెద్దల్లో, ఆనంద, ఉత్సాహ వాతావరణం ఏర్పడ్డది. అంతా కలిసి, గణేష్ మహారాజ్ కి జై అంటూ, గణేష్ మహారాజ్ ను, ఒక ఊరేగింపుగా, ఒక వాహనంలో, అలంకరించి, అందరూ, వాహనంలో కూర్చున్నారు, కొందరు వారి వారి వాహనాల్లో, నాంపల్లి, అసెంబ్లీ, రవీంద్ర భారతి, సెక్రటేరియట్, మీదుగా, ట్యాంక్ బండ్, చేరుకున్నాం. అందరం ఎంతో జాగ్రత్తగా, ఆనందంగా, ఉత్సాహంగా, స్వామి వారిని, వాహనం పై నుండి, తీసుకొని వచ్చి, స్వామిని, మళ్ళీ, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, అంటూ, పాటలు, పద్యాలు, పాడుతూ, చివరకి, స్వామి వారిని, ట్యాంక్ బండ్, సాగరంలో, నిమర్జనం గావించాము.  ఈ నిమజ్జనం, ఈ ఆనందం, మాటల్లో వర్ణించలేనిది. శ్రీమతి రేణుక గారు,  శ్రీమతి కల్పన గారు, శ్రీమతి శైలేశ్వరి, శ్రీమతి  కుసుమ , మాస్టర్ హేమాంగ్, సాయి గుప్త, జయ గాయత్రి, లీల ధర్, శివ మనోహర్, అనిల్,  తదితరులు, పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ ప్రాంగణంలో, కూడా, అక్కడ,  పరిశుద్ధ సేవలందిస్తున్న, కొంతమంది కి, స్వామివారి ప్రసాదాన్ని అందించడం అయినది. అందరమూ, మళ్లీ, ఎంతో జాగ్రత్తగా, మన పుల్లారెడ్డి భవనం చేరుకొని, అందరము వారి వారి ఇండ్లకు వారి వారి బంధువులకు ప్రసాదాలు కూడా తీసుకొని అందరూ స్వామివారి, ఆశీస్సులు అందుకుని, ఎంతో ఆనందంగా ఎవరి ఇళ్లకు వారు వెళ్లి ఉన్నారు. జై సాయి రామ్. రానివారికి కొందరికి, కూడా ప్రసాదాన్ని, పంపించడం అయినది. 


ముఖ్యంగా ఈరోజు మనకు, చెన్నకేశవ సహాయంతో, స్వామివారి ఊరేగింపుకు కావలసిన వాహనాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో, వాహనాన్ని శుభ్రపరిచి, తీసుకొని వచ్చి, మన కార్యక్రమానికి సహకరించిన చెన్నకేశవ నాన్న గారికి ప్రత్యేకమైన, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, వారికి కూడా స్వామివారి ప్రసాదాన్ని, మరియు చెన్నకేశవ అమ్మగారికి నాన్నగారికి, స్వామి వారి ప్రేమను,  నూతన వస్త్రముల రూపంలో, అందించడం అయినది. జై సాయి రామ్. 

PHOTOS: DT 12-9-2021 































7 comments:

  1. 🙏🏽Beautiful photographs. Felt very excited. Pictures relating to the Immersion of Ganesh idol were really very beautiful. I could see the happiness, excitement, discipline everything on the faces of our Koti Samithi Balvikas children. Very nice to see Smt. Kalpana, Smt. Shaileswari for being a part of the celebration. Jai Sai Ram. Jai Ganesh Maharaj. Punaragamanayacha🙏🏽

    ReplyDelete
  2. Sairam...I felt as if I participated in the programme..Beautiful ganesha idol n everybody looking extremely and enthusiastic...Super photo covering..Thank you very much for sharing

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయిరాం.🙏 కన్నుల పండుగగా ఉన్నది. గణేశుని పూజ సంబరాలు రంగ రంగ వైభవంగా జరగడం అంతా స్వామి దయ. ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్న వినాయక చవితి ఉత్సవము,, కళ్ళారా చూస్తున్నట్లుగానే ఉన్నది. ధన్యవాదములు. ఆ సాయిగణేశుడు అందరిని చల్లగా కాపాడాలిఅని ప్రార్థిస్తూ,(సరస్వతి ప్రసాద్).

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. ప్రత్యేకంగా రాలేకపోయినా కన్నులతో చూసినంతగా ఆనందం కలిగింది. సాయిరాం 🙏🙏

    ReplyDelete

DASARA CELEBRATIONS AT SIVAM. FROM 3-10-2024 TO 12-10-2024 - KOTI SAMITHI SAMITHI DATES. 6TH, 7TH, 12TH,

  ఓం శ్రీ సాయిరాం  ఆదివారము 6-10-2024 న రోజున మహాలక్ష్మి అలంకరణ.  ఉదయం 7 గంటల నుండి, 1 గంట వరకు శివమ్ మందిరంలో సేవ మన కోటి సమితికి కేటాయించబ...