Wednesday, January 12, 2022

GAYATRI MANTRA CHANTING FROM 13-1-2022 ONWARD TILL 21ST FEB 2022.

 


హైదరాబాద్ జిల్లాలోని 16 సమితులలో ఉన్న శ్రీ సత్యసాయి సేవా సంస్థల భక్తులు,సాయి కుటుంబ సభ్యులు అందరికీ సాయిరాం.ప్రస్తుతము ఉన్నటువంటి విపత్కర పరిస్థితులలో,లోకక్షేమంకోసం, సామూహికంగా గాయత్రి మంత్రము ఒకే సమయములో జపించిన ఆ మంత్ర ప్రభావం వలన,ఉత్పన్నమయ్యే శక్తి తరంగాలవలన ప్రజల జీవితాలకి శాంతి,సంతోషం,మానసిక ప్రశాంతత లభిస్తుంది. మహా మహిమాన్వితమైన గాయత్రి మంత్ర సామూహిక జపము ఒకే సమయంలో చేసిన,ఆసాధకుల భౌతిక, మానసిక,ఆధ్యాత్మిక, మేధాశక్తులను,ఉత్తేజ పరుస్తుంది.ప్రాపంచిక విషయముల నుండి విముక్తడిని చేసి, దైవానికి సన్నిహితుల్ని చేస్తుంది.

భగవాన్ మనకు అందరికీ ఈ విధంగా ఆదేశించారు,తెల్లవారగట్ల ఒకే సమయంలో ఓంకారము,సుప్రభాతము చేయుట,మరియు సాయంత్రం ఒకే సమయంలో భజన చేయుట,ఈ విధంగా ఒకే సమయంలో గాయత్రి మంత్ర జపము చేయడం వలన ప్రతి కుటుంబ సభ్యులలో ఐకమత్యము మరింత బలపడుతుంది.

గత సంవత్సరం సామూహికంగా,ఒకే సమయంలో చేసిన ప్రార్థనా ఫలితం మన సంస్థలో ఇప్పటికే అందరూ రుచి చూసి ఉన్నారు.మరొక్కసారి ఆ ఫలాన్ని అందుకుందాము. ప్రజా క్షేమమునకు,దేశ సౌభగ్యమునకు,లోక కల్యాణం కోసం స్వామివారి ఆశీస్సులతో సంకల్పించుకున్న గాయత్రీ మంత్ర జపము 108 సార్లు,40 రోజులు,ప్రతీ రోజు ఉదయం 7 గం|| లకు చేద్దాము. ఈ బ్రహత్తర కార్యమును జనవరి 13వ తారీకు,‌గురువారము,వైకుంఠ ఏకాదశి పర్వదినమున మొదలుపెట్టి,ఫిబ్రవరి 21వ తారీకు సోమవారమున పూర్ణాహుతి తో సుసంపూర్ణం‌ చేసుకుందాము. 

ఈ పుణ్య కార్యక్రమం రేపటిరోజు ముక్కోటి ఏకాదశి,ఉదయం 7 గం లకు శివం మందిరంలో జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా కార్యవర్గ బృంద సభ్యులు 108 సార్లు గాయత్రి మంత్ర జపము చేసి ప్రారంభం చేస్తారు. ఆసక్తి కలిగిన వారు శివంలో జరిగే గాయత్రి మంత్ర జపంలో పాల్గొనడానికి ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాను.

(కొవిడ్ నియమ నిబంధనలను పాటిస్తూ.) మరుసటి రోజు నుండి సాయి కుటుంబ సభ్యులు,భక్తులు అందరూ ఎవరి‌ ఇళ్ళల్లో‌ వారు అంత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతీ రోజు ఉదయం 7 గం|| లకు ఈ గాయత్రీ మంత్ర జపము చేద్దాము. ఆ సాయిగాయత్రీమాత అనుగ్రహ ఆశీస్సులతో త్వరితగతిని ప్రపంచవ్యాప్తంగా,ఆరోగ్యకర పరిస్థితులు చక్కబడాలని కోరుతూ... జై సాయిరామ్. మీ సోదరుడు, A MALLESWARA RAO HYDERABAD DISTRICT PRESIDENT 

No comments:

Post a Comment

99TH BIRTHDAY CELEBRATIONS AT SIVAM STARTING FROM 17TH NOVEMBER, 2024:

  భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి  దివ్య ఆశిస్సులతో   “  సత్యసాయి భగవానుని   99 వ జన్మ దిన వేడుకలలో భాగంగా   ” 17  నవంబర్ , 2024  న   హైదరాబ...