PL CLICK TO VIEW 97 minutes U tube link
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి నాధుని, శత జయంతి ఉత్సవాల సందర్భంగా, వంద నిమిషముల, బాలవికాస్
విద్యార్థుల భజన ప్రోగ్రాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, హనుమాన్ టెకిడి ఆలయంలో, ఎంతో భక్తి శ్రద్దలతో, ఓంకారం, మొదలుపెట్టి, గణేష, గురు, మాతా భజనలతో, ఉదయం 9 గంటల నుంచి 11 గంటలకు సంపూర్ణమైనది. 10-50 నిమిషములకు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి గళంలో, "ప్రేమముదిత మానస కహా రామ్ రామ్" అనే భజనకు అందరు కోరుస్ పలుకగా మందిర ప్రాంగణం స్వామి నామముతో మారుమ్రోగినది. బాలవికాస్ బాలుర విభాగం అందరు, మరియు, బాలికల విభాగం అందరు కలసి స్వామి వారి మంగళ హారతి సమర్పణ కావించబడినది. ఈ కార్యక్రమంలో నూతన బాలవికాస్ కూడా పాల్గొనడం విషయం. ఈ కార్యక్రమంలో కోటి సమితి కన్వీనర్ శ్రీ విశ్వేశ్వర శాస్త్రి గారు, బాల వికాస్ గురువులు, స్పిరిచ్యువల్ కోఆర్డినేటర్ , భజన మండలి కోఆర్డినేటర్, కోటి సమితి భక్తులు, యూత్ కోఆర్డినేటర్లు, సేవాదళ్ కోఆర్డినేటర్స్, సేవాదళ్ , అందరూ పాల్గొని శత జయంతి ఉత్సవాల సందర్భంగా, సమస్త లోకా సుఖినో భవంతు అనే ప్రార్ధనతో, ప్రారంభమైన ఈ కార్యక్రమంలో, కృతజ్య్నాతలు, తెలియజేసుకుంటూ, ఎంతో ఆనందంతో, కార్యక్రమములో పాల్గొన్నారు. తదనంతరం, బాల్ వికాస్ విద్యార్థులు రుద్రం చదువుతుండగా శివ లింగమునకు అభిషేకం అందరూ కలిసి చేసుకోవడమైనది. ఈ కార్యక్రమాన్ని తిలకిస్స్తున్న శ్రీ బసవరాజు, గతంలో అనంతపూర్ లో DEO గా సేవ లందించి, ప్రస్తుతము ఈ ఆలయ ధర్మాధికారిగా సేవలందిస్తూ, మన కార్యక్రమము యెంతో ఆకట్టుకున్నది, ఈ రకమైన కార్యక్రమాలకు, మా వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందుని తెలియజేసారు. విభూతి ప్రసాదం మరియు ప్రసాదాలను, భక్తిశ్రద్ధలతో స్వీకరించి, ఈ అవకాశాన్ని ప్రసాదించిన శ్రీ స్వామికి, కృతజ్ఞతాభివందనాలు తెలుపుకున్నారు. సమితి కన్వినర్ నిత్యా నారాయణ సేవ గురించి, మరియు 13 జులై, న జరుపుకునే గురుపూర్ణిమ వేడుకలు వివరములు తెలియజేసారు. ఈ కార్యక్రమములో మొత్తం 30 పాల్గొన్నారు. ప్రసాదం 50 దాదాపు స్వీకరించి స్వామి,కృపకు పాత్రులైనారు.
No comments:
Post a Comment