రిపోర్ట్ డేటెడ్: 27-09-2022
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో , శ్రీ సాయి శరన్నవ రాత్రి సంబరాల లొ రెండవ రోజు ఉదయం కార్యక్రమం లో భాగంగా
ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, మధ్యాహ్నం మహిళల చే కుంకుమ పూజ ఘనంగా జరిగాయి. శ్రీ బాల త్రిపురసుందరి దేవి అలంకారమును ఏంతో సుందరం గ అలంకరించారు
సాయంత్రం కార్యక్రమం లో భాగంగా కుమారి సంజన గారి చే కర్ణాటక గాత్ర కచేరి రస రమ్యం గ కొనసాగింది మృదంగం పై శ్రీ గుణ రంజన్ గారు, వయోలిన్ పై కే. వి . ఎల్. ఎన్ మూర్తి గారు ఏంతో అద్భుతం గ సహకరించారు. మంగళ హారతి తొ కార్యక్రమం దిగ్విజయం గ ముగిసింది.
VIJAYA DASAMI CELEBRATIONS - 26TH SEP TO 5-10-2022
దీక్ష అంటే నియమాల సమాహారం. పట్టుదల అని కూడా అంటారు.ఒక ఆచారాన్ని లేదా నియమాన్ని పాటించాలని సంకల్పించడం,దాన్ని పట్టుదలగా కొనసాగించడం దీక్ష అని అంటారు. దీక్ష అంటే
- దీయతే జ్ఞానం విజ్ఞానం
- క్షీయంతే పాప నాశనం
- తేన దీక్షా ఇతి ప్రోక్తా
- ప్రాప్తాచ్చేత్ సద్గురోర్ముఖః.
జ్ఞానాన్ని ఇచ్చి పాపాన్ని పోగొట్టేది ఏదో అది దీక్ష.బ్రహ్మానందం, సంపద,సమృద్ధి,
పరమాత్మని ఇచ్చేది దీక్ష. దీక్ష అంటే నియమబద్ధ వృత్తి.మనస్సు,శరీరం,వాక్కుతో సహా అన్ని అవయవాలు, అన్ని ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకుని పరమాత్మ ఆరాధనకు అనుగుణంగా ప్రవర్తించటాన్ని దీక్ష అంటారు. ఈ దీక్షా కాలంలో చేయవలసినది /చేయకూడనివి. అతి ముఖ్యమైనది. రోజంతా సాయిమాత ధ్యానములో ఉండి ఆశీస్సులను పొందడం.
1).రోజూ ఉదయం పూట పూజ చేయాలి. లేదా సాయి గాయత్రి 108 సార్లు పఠనం. చేసుకోవచ్చును.
2).మితాహారం భుజించుట మరియు నేలమీద చాప వేసుకుని పడుకోవడం. కష్టమైన వారు మంచాలపైన రోజూ దుప్పట్లు (Bed Sheets) మార్చుకుని పడుకోవాలి.
3).బ్రహ్మచర్యము పాటించాలి మరియు మాంసాహారము తినకూడదు.
4).నవసూత్ర నియమావళి పాటించాలి.
దసరా పది రోజులూ పై నియమములు పాటించి,విజయదశమి నాడు శివంలో జరుగు చండీహోమములో పాల్గొని ఆ సాయి రాజరాజేశ్వరి అనుగ్రహం పొందాలని ప్రార్థన చేయుచూ
=================================================================
భగవానుడు నడయాడిన శివమ్ మందిరంలో, కంకణ ధారణ, మరియు దీక్ష వస్త్రముల బహుకరణ, - ప్రసాదం ( ప్రతి సమితి నుండి 5 జంటలకు, అనుగ్రహం: మరియు పైన పేర్కొన్న నియమ నిబంధలు పాటించాలి-
26-9-2022 - శ్రీ స్వర్ణ కవచ అలంకారం. పులిహోర ప్రసాదం. సేవలు - భజన - ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన పూజ, సాంసృతిక కార్యక్రమములు హిమాయత్ నగర్ మరియు గాంధీనగర్ సమితుల సభ్యులు నిర్వహించెదరు.
27-9-2022 శ్రీ బాల త్రిపురసుందరి దేవి - ప్రసాదం - పాయసం. సేవలు - భజన ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన పూజ, సాంసృతిక కార్యక్రమములు కోటి, మరియు కాచిగూడ సమితి సభ్యులు నిర్వహించెదరు. (పింక్)
28-9-2022 శ్రీ గాయత్రీ దేవి అలంకారం- ప్రసాదం కదంబం. సేవలు - భజన ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన పూజ, సాంసృతిక కార్యక్రమములు దిల్ సుఖ్ నగర్ , మరియు తార్నాక సమితి సభ్యులు నిర్వహించెదరు. (ఆరంజ్ )
29-9-2022: శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం ప్రసాదం - పాయసం. సేవలు - భజన ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన పూజ, సాంసృతిక కార్యక్రమములు ఖైరతాబాద్ , మరియు అమీర్ పెట్ సమితి సభ్యులు నిర్వహించెదరు.(ఆరంజ్ )
30-9-2022: శ్రీ లలిత త్రిపురసుందరి దేవి అలంకారం ప్రసాదం కట్టెపొంగళి. సేవలు - భజన ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన పూజ, సాంసృతిక కార్యక్రమములు విద్యానగర్ మరియు సీతాఫలమంది సమితి సభ్యులు నిర్వహించెదరు. ( వైట్ )
1-10-2022: శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం. ప్రసాదం చక్కర పొంగలి. సేవలు - భజన ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన పూజ, సాంసృతిక కార్యక్రమములు హైదరాబాద్ యూత్ సభ్యులు నిర్వహించెదరు. ( గంధపు పసుపు )
2-10-2022: శ్రీ సరస్వతి దేవి అలంకారం. ప్రసాదం దద్దోజనం. సేవలు - భజన ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన పూజ, సాంసృతిక కార్యక్రమములు అంబర్పేట్ బాలవికాస్ సభ్యులు నిర్వహించెదరు. ( బ్రైట్ పింక్)
3-10-2022: శ్రీ దుర్గా దేవి అలంకారం. ప్రసాదం పులిహోర. సేవలు - భజన ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన పూజ, సాంసృతిక కార్యక్రమములు ఎస్ ఆర్ నగర్ మరియు వి ఆర్ నగర్ సభ్యులు నిర్వహించెదరు. ( బ్రైట్ రెడ్ )
4-10-2022: శ్రీ మహిసాసుర మర్దని అలంకారం. ప్రసాదం మినప గారెలు. సేవలు - భజన ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన పూజ, సాంసృతిక కార్యక్రమములు ప్రశాంత్ నగర్ మారేడ్పల్లి సభ్యులు నిర్వహించెదరు. ( బ్రౌన్ రెడ్ మిక్స్ )
5-10-2022: శ్రీ రాజ రాజేశ్వరి అలంకారం. ప్రసాదం పరమాన్నం - నిమ్మ పులిహోర. సేవలు - భజన ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన పూజ, సాంసృతిక కార్యక్రమములు అంబర్పేట్ మరియు మెహదీపట్నం సభ్యులు నిర్వహించెదరు. ( గ్రీన్ )
ప్రతిరోజూ ఓంకారం సుప్రభాతం, వేదం, అభిషేఖం, పూజ - మహా ప్రసాదం, సాయంత్ర కార్యక్రమానికి 4-30 గంటలకు సమాయత్తం.ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు కార్యక్రమం. వేదం, వెల్కమ్ -జ్యోతి ప్రకాశనం, ఆ రోజు ప్రాముఖ్యత వివరణ. సాంసృతిక కార్యక్రమం. భజన జరుగు సమయంలోనే కళాకారుల సన్మానం. స్వామి వారి దివ్య ప్రసంగం. హారతి - ప్రసాద వితరణ
దీక్ష తీసుకున్న వారే చండీ హోమము నాకు అర్హులు:
26-9-2022 నుండి -5-10-2022
కోటి సమితి భక్తులు :
- 1. శ్రీ విశ్వకర్మ నాగేశ్వర రావు మరియు జ్యోతి
- 2. శ్రీ శ్రీనివాస్ మరియు భువనేశ్వరి
- 3. శ్రీ చక్రధర్ మరియు నీలిమ
- 4. శ్రీ ప్రకాష్ మరియు శ్రీమతి రమాదేవి.
- 5. శ్రీ మహంకాళి నరసింహారావు
No comments:
Post a Comment