Monday, February 21, 2022

KOTI SAMITHI, HYD PRESENTS 2022 మహా శివరాత్రి పర్వదినోత్సవం సందర్భంగా ప్రత్యేక నాటిక - "కిరాతార్జునీయం " - SIVAM MAHASIVA RATRI CELEBRATIONS:

 "కిరాతార్జునీయం " U TUBE LINK 

RADIO LINK LINK. 

Today a U Tube was Prepared on Shankaaravam and the importance of Shanku.

Link  

2AM  to 3 AM: AKHANDA BHAJANA SLOT FOR KOTI SAMITHI. SUCCESSFULLY COMPLETED WITH SWAMY'S BLESSINGS. AND WITH THE CO-OPERATION OF ALL. 

With the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Baba varu  the following members of Koti Samithi have participated in the Bhajana Slot. 

1) Sri V Srinivas, 2) Sri Venkat Rajanna, 3) Smt Bhuvaneswari, 4) Chi. Bhadra Devi, 5) Smt Kalpana, 6) Smt V Vijaya Laksmi  7) Smt Jyothi of Zia Guda, 8) Smt Malathi of Central Warehousing Corporation, 9) Sri Surendra Patel, 10) Sri Rati Rao Patil, 11) Sri Manik Prabhu, 12) Sri Manik Prabhu's Son, 13) Sri M Anjaneyulu, 14) Sri A Vinay Kumar,  15) Sri Ch. Lakshma Reddy Garu. and 16) Convenor P.Visweswara Sastry. 

Balvikas Children: Master Hemang, Chi Bhadra, Master Leeladhar have participated in their particular Slot at 5 PM to 5-30 PM. 

Gurus: 




Mr Srinivas of Koti Samithi is performing Vibhuti Abhisekham at midnight of 1st March 2022. 















2022 మహా శివరాత్రి పర్వదినోత్సవం సందర్భంగా ప్రత్యేక నాటిక - "కిరాతార్జునీయం " 

ఈ నాటిక సమర్పణ -  

 శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి, హైదరాబాద్.  

ఈ నాటికలోని  పాత్రలు, పాత్రధారులు

అర్జునుడుగా శ్రీ వాచస్పతి అంబడి పూడి మురళీకృష్ణ

కృష్ణుడిగా  - శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్,

శివుడిగా - శ్రీ K  శివ కళాధర్ 

పార్వతి గా - శ్రీమతి పూర్ణిమ సుమన్,

నందిగా - శ్రీ అనుమంచి విశ్వమోహన్

బృంగి గా శ్రీ కె  వి ఎస్ కె గణేష్,

 శృంగి గా - తుమ్మలపల్లి వెంకట సుబ్రహ్మణ్యం

ద్రౌపదిగా డాక్టర్ ఎం మీనా కుమారి,

నారదుడిగా శ్రీ బి సాయి ప్రభాకర్,

ధర్మరాజుగా - శ్రీ రేగేళ్ల అనిల్ కుమార్,

భీముడు, శ్రీ శరత్ కృష్ణ పరాయితం

వ్యాసుడిగా శ్రీ జి వి ఎన్ రాజు

ఇంద్రుడిగా శ్రీ మదన్ గుప్తా,

నకులుడుగా శ్రీ వి. వెంకట రాజన్న 

మరియు సహదేవుడుగా, మూకాసురుగా శ్రీ పి. విశ్వేశ్వర శాస్త్రి పాల్గొన్నారు.


 కిరాతార్జునీయం 6వ శతాబ్దంలో మహాకవి భారవి చే రచింపబడిన సంస్కృత పద్య కావ్యం. ఈ కావ్యం అర్జునుడు మరియు మారు వేషంలో ఉన్న శివుని మధ్య జరిగిన యుద్దాన్ని తెలుపుతూ రాయబడింది. సంస్కృతంలోని ఆరు మహా కావ్యాలలో ఒకటిగా కిరాతార్జునీయం కొనియాడబడింది. ఈ కావ్య రచనా శైలి పద ఎన్నిక మరియు అద్భుత వర్ణన, సంస్కృత పండితుల ప్రశంసలు పొందింది. ఈ కావ్యంలో ఎక్కువగా వీర రసం బాగా వర్ణించబడింది. ఇందులో కవి మహాభారతంలో వనపర్వంలోని ఒక చిన్న భాగాన్ని తీసుకుని వర్ణించాడు.

పాండవులు వనవాసానికి వెళ్ళినపుడు ద్రౌపది, మరియు భీముడు కౌరవులతో యుద్ధం ప్రకటించమని ధర్మరాజును బలవంతం చేస్తారు. కానీ ఆయన అందుకు అంగీకరించడు. చివరగా ఇంద్రుడి సలహాతో అర్జునుడు అడవిలో తపస్సు చేసి శివుణ్ణి మెప్పిస్తాడు. శివుడు అందుకు ప్రీతి చెంది ఏమైనా వరం ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు.


కిరాతుడు - శివుడితో యుద్ధం చేస్తున్న అర్జునుడు:

అదే అరణ్యం ప్రాంతంలో మూకాసురుడు అనే రాక్షసుడు ఎలుగుబంటి రూపంలో తిరుగుతుంటాడు. అది ఒకసారి అర్జునుణ్ణి చూసి మీదకు దూసుకురాబోతుంది. అప్పుడు శివుడు కిరాతుడి రూపంలో అక్కడికి వస్తాడు. ఇద్దరూ కలిసి దానివైపు ఒకేసారి బాణం వేస్తారు. అది చనిపోతుంది. అయితే ఎవరు బాణం ముందు వేశారో సందిగ్ధం మొదలౌతుంది. చివరకు వివాదంగా మారి యుద్ధానికి దారితీస్తుంది. ఆ యుద్ధంలో ఎంతసేపైనా అర్జునుడు కిరాతుని ఓడించలేక పోతాడు. చివరకు తప్పు తెలుసుకుని శివుణ్ణి శరణు వేడుకుంటాడు. శివుడు అతని పరాక్రమానికి మెచ్చి చాలా శక్తివంతమైన పాశుపతాస్త్రం ప్రసాదిస్తాడు. ఆ ఆయుధమే అర్జునుడు *మహాభారత యుద్ధ* సమయంలో కర్ణుని సంహరించడానికి వాడాడు.


అందరికీ సాయి శివోహం.

మౌళిగుళ్కెడు చంద్ర మర్ఖండ కళ తోడ,

బెడదారు గుంపెడు జడల తోడ,

జడలలొ ప్రవహించు చడలేటి జిగు తోడ,

డంబైన ఫాల నేత్రంబు తోడ,

నల్ల నేరెడు వంటి నల్లని మెడ తోడ,

కరమున నాగ కంకణము తోడ,

నడుమున చుట్టిన నాగ చర్మంబు తోడ,

మైనిండ నలదు భస్మంబు తోడ,

కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టు తోడ,

తాంబుల రాగదరంబు తోడ,

తట హేమ మయ వజ్ర తాటంకముల తోడ,

విక్షస్య  వర్ధయా వృష్ఠి తోడ,

నల్ల కలవలు దునుమాడి కొల్లలాడు,

నేడి చామనఛాయల మేని తోడ...!

భావం 

సిగపై దీపస్తంభము వలె ప్రజ్వరిల్లు చంద్రుని చల్లని కాంతి పుంజములు నలుదిశలా వ్యాపించు చుండగా,

శిరస్సునిండా గుంపులు గుంపులు గల జటాజూటములతో,

ఆ జటాజూటములనుండి నదీనదాలు జలధారలగా ప్రవహించు చుండగా,

 నొసటి మధ్యన ప్రజ్వరిల్లే మూడొకన్నుతో ఈ జగత్తును లయం చేసే ముక్కంటి,

 అల్ల నేరుడుపండువలె నిగనిగలాడే నల్లని మెడ కల్గి,

చేతికి వంకీలుగా నాగరాజును ఆభరణంగా తొడిగి, 

నడుముకు నాగ చర్మము ధరించి, 

వంటినిండా భస్మం పులుముకుని,

నుదుట నిండుగా తీర్చిదిద్దిన చక్కటి కుంకుమబొట్టుతో వెలుగులీనుతూ,

తాంబూలము సేవించిన ఎర్రని పెదవులతోనూ,

వజ్రములు పొదిగిన బంగారు చెవికమ్మలు తోనూ,

చిన్నగా మొదలై హోరున వర్షించే కుంభవృష్టిని తలపించే రూపము నీది,

మేనిచామన ఛాయా శరీరంతో,

కనులుదోచే నీ సొందర్యం నిజంగా చూడగానే అపహరించాలనే బుద్ధిపుట్టే నల్లకలువల చందం,

ఓ ఈశ్వరా..

ప్రకృతిని మించిన నీ సౌందర్యం ఈ జగత్తును పూర్తిగా నీ శాంతి,ప్రేమ,

ఆనందాలతో మానవాళి హృదయలోతుల్ని పూర్తిగా ముంచివేసింది కదా ఈశా,

ఇదియే కదా ఈ సృష్టికి గొప్ప బహుమతి సాయీశా...


శ్లోకం భావ వివరణ:

శ్రీ.కస్తూరి సాయి భాస్కర్.

13 comments:

  1. Whatsapp Message from T V Subrahmanyam to P V Sastry : SAIRAM Beloved Sastry Garu, With the Divine blessings of SWAMY VARU, you are taking up many activities in all the wings in the SSSSO and played a vital role in playing playlets basing on the teachings of BABA VARU and also value oriented that are in the mythology.
    KIRATARJUNEEYAM is an excellent one and blessed to telecast on the Holy day of MAHA SHIVARATRI.
    Fortunate of being a part in the Divine playlet.
    Praying SWAMY VARU to bless you with much more activities in the days a head and to shower HIS gracious blessings on all the participants.
    SAIRAM In SAI service, T V Subrahmanyam

    ReplyDelete
  2. ANNAPURNA GARU - HYD శ్రవ్య నాటిక చాలా అద్భుతం గా ఉన్నది. సాయిరాం

    ReplyDelete
  3. PANDURANGA REDDY SIRIGIPETA : jay saimathaya namaha jay sairama

    ReplyDelete
  4. SMT V BHUVANESWARI: ఓం శ్రీ సాయిరాం🙏🏻
    అత్యద్భుతమైన కిరాతార్జునీయం నాటిక ఈమధ్య కాలంలో వినలేదు అంత హృద్యంగా, ఉన్నది ఈ మహా శివరాత్రి నాడు అందరూ వినదగ్గ నాటిక, శ్రీ సత్య సాయి నాధుని దివ్య పాదారవింద ములకు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోఠీ సమితి సమర్పించిన దివ్యమైన అడవి మల్లె పువ్వు ల మాల, ఈ మాలలోని పాత్రధారులందరూ, శ్రీ స్వామి అనుగ్రహ ఆశీస్సులు. ఎంతో దివ్యంగా పొందారని, శ్రీ స్వామికి ఆనందాన్ని చేకూర్చారని, స్వామి ఆనంద పడితే అందరికీ ఆనందమనే, దివ్య ప్రసాదం లభిస్తుంది. అందరూ కచ్చితంగా వినదగ్గ నాటిక జై సాయిరాం

    ReplyDelete
  5. NARAHARI SABHAPATHI: చాలా బావుంది. అపుడెపుడో రేడియో లో వినేవాళ్ళం. మహాశివరాత్రి రోజున విని ధన్యులమైనాము.

    ReplyDelete
  6. POTTURI SITAMAHALAKSHMI: Om Sri Sai Ram రేడియో సాయి వారు ఈరోజు మహా శివరాత్రి సందర్భంగా Sri Satya Seva Samstalu Koti Samithi vaaru అందించిన ‘కిరాతార్జునీయం ‘ నాటకం అద్భుతం గా ఉంది. ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా అందురూ చాలా బాగా చేశారు. Bhagawan Baba vaari అనుగ్రహ ఆశీస్సులు అందిరికీ ఉంటాయి ఎల్లప్పుడూ 🙏Radio Sai వారు ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపడతారని ఆశిస్తున్నాను. Jai Sai Ram



    ReplyDelete
  7. VARSHINI BHARGAVI: Aum Sri sai ram om nama shivaya

    ReplyDelete
  8. RANI CHAMARTI: మా అదృష్టం. ఈ రోజు ఈ కధ వినడం భగవాన్ శ్రీ సత్యసాయి పాద పద్మములకు శతకోటి ప్రణామాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    ReplyDelete
  9. ANJANI KUMARI: ఈ మహాశివరాత్రి పర్వదినాన ఇంతటి అమోఘమైన శ్రవ్య నాటిక వినడం మా అదృష్టం చాలా రోజుల తర్వాత ఇలాటి sound effects తో కూడిన , పాత్రధారులంతా వారి పాత్రలలో ఇమిడి పోయిన తీరు మనసున చాలా ఆనందం వేసింది ముందు ముందుకు ఇలాటివే మీనుంచి ఆశిస్తూ

    ReplyDelete
  10. SAI KUMAR: Really it's super audio drama. Sriram

    ReplyDelete
  11. P V CHALAM WHATSAPP COMMENTS: At the outset let me congratulate the Sri Satya Sai Seva Samithi,Koti and it’s leader Sri P V Sastry Garu for presenting a beautiful drama Kiraatarjuneeyam for the occasion of Maha Shivarathri.Script & Dialogues are Very good. All Artists performance is good. Especially Sri Muralikrishna & Sri Kaladhar excelled in the Climax. Background Music played a key role in the Success of the Drama. Special Thanks to Radio Sai for broadcasting such a Beautiful Drama. Jai Sairam

    ReplyDelete
  12. SAI PAVAN KALYAN COMMENTS: ఓం నమః శివాయ 🙏🏻❤️ హర హర మహాదేవ 🙏🏻❤️ ఓం శ్రీ సాయి రామ్ 🙏🏻❤️చక్కటి నాటికను, ఈ పర్వదినాన అందించి స్వామి కృపకు పాత్రులను చేశారు.మీ బృందం భక్తితో సమర్పించిన ఈ నాటకం చాలా గొప్పది . అందరూ విని తరించాలనీ , స్వామి మిమ్ములను అనుగ్రించలనీ కోరుకుంటున్నాను.మరిన్ని చేసే అవకాశం మీకు రావాలని ప్రార్థిస్తున్నాను 🙏🏻❤️

    1

    ReplyDelete
  13. H SRINIVASULU : ALL INDIA TECHNO GROUP PRESIDENT.WHATSAPP MESSAGE TO P V SASTRY. ( ME ) Our dear Sastry gaaru How are you... Very happy for you and the team for producing such a wonderful audio programmer...excellent Swami Blessings to all Love Srinivasulu H

    ReplyDelete

DASARA CELEBRATIONS AT SIVAM. FROM 3-10-2024 TO 12-10-2024 - KOTI SAMITHI SAMITHI DATES. 6TH, 7TH, 12TH,

  ఓం శ్రీ సాయిరాం  ఆదివారము 6-10-2024 న రోజున మహాలక్ష్మి అలంకరణ.  ఉదయం 7 గంటల నుండి, 1 గంట వరకు శివమ్ మందిరంలో సేవ మన కోటి సమితికి కేటాయించబ...