Friday, February 10, 2023

GOVERNMENT KUNTAROAD SCHOOL, OSMAN GUNJ, TOPKHANANA, HYDERABAD.

 



ఈ రోజు 10-2-2023 న  ఉస్మాన్ గంజ్ తోప్ ఖానా లోగల, కుంటారోడ్డు , గవర్నమెంట్ హై స్కూల్, పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమం, మరియు, 10వ తరగతి విద్యార్థులకు వేడ్కోలు కార్యక్రమము, ఎంతో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా, సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి కన్వీనర్, జ్యోతి ప్రకాశనం  గావించి, వార్షికోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈనాటి ముఖ్య అతిథిలూగా విచ్చేసిన జాంబాగ్ డివిజన్ కార్పొరేటర్, Ward No. 77 - Jambagh Division. రాకేష్ జైస్వాల్ గారిని, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి, కన్వీనర్ ను, మరియు బిజెపి సీనియర్ లీడర్ శ్రీ మయూర్ గారిని, వేదిక అలంకరించవలసిందిగా శ్రీమతి శశికళ గారు ఆహ్వానించారు. 

హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్, శ్రీమతి శశికళ గారు, ప్రారంభ ఉపన్యాసంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి, కుంటారోడ్డు స్కూల్లో, నిర్వహిస్తున్న శ్రీ సత్య సాయి స్కూల్ బాలవికాస్ కార్యక్రమాన్ని, శ్రీ సత్య సాయి బాబా వారి  జన్మదిన సందర్భంగా, నిర్వహించిన నారాయణ సేవ కార్యక్రమాన్ని, స్కూలుకు బహుకరించిన బెంచీలు, డస్కులు, గురించి, మరియు, 10వ తరగతి లో చదువుతున్న 22 మందికి, మధ్యాహ్నం భోజనానంతరం, ప్రతిరోజు సాయంత్రం స్కూల్ తర్వాత నిర్వహించే, ప్రత్యేక తరగతుల ప్రారంభంలో , స్నాక్స్, అందజేస్తున్న విషయాన్ని,  ప్రస్తావిస్తూ, కోటి సమితి, నిర్వహిస్తున్న సేవలను ఎంతగానో కొనియాడారు.  

సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, మాట్లాడుతూ, జ్యోతి ప్రకాశం, గావించుటకు, ఆహ్వానించినందుకు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జ్యోతి గూర్చి తెలుపుతూ, అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృతోర్మ అమృతంగమయ మంత్రానికి అర్ధాన్ని వివరిస్తూ, జ్యోతి మనలో నున్న చీకటిని పోగొట్టునని,ఒక జ్యోతితో మనము అనేక జ్యోతిలు వెలిగించవచ్చని, గురువులు మనలో నున్న చీకటిని, తొలిగించి, వెలుతురూ నింపుతారని, వారిని ఎల్లప్పుడూ గౌరవించాలని, టెన్త్ క్లాస్ లో పిల్లలందరూ, ఉత్తమ శ్రేణిలో, పాస్ కావాలని, కోరారు.

డివిజన్ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్, మాట్లాడుతూ ముందుగా,  ఆహ్వానించినందుకు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శ్రీమతి శశికళ గారు   ఈ పాఠశాలను ఎంతగానో అభివృద్ధి చేసారని,  విద్యార్థులంతా ఎంతో క్రమశిక్షణతో, ఉన్నారని, దానికి కారకులు, స్కూల్ యాజమాన్యం అని, తెలుపుతూ, మీరంతా, సన్మార్గంలో, ఉంటూ, పరీక్షలలో, ఎంతో, మంచి మార్కులు తెచ్చుకొని, ఇటు పాఠశాలకు, మీ తల్లిదండ్రులకు, అందరికీ మంచి పేరు తేవాలని కోరారు.

తర్వాత, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా, ప్రైమరీ స్కూల్ విభాగం విద్యార్థులు, హై స్కూల్ విద్యార్థులు, రికార్డింగ్ ప్లే చేసి  రికార్డు డ్యాన్సులు, నిర్వహించి, అందరి మనలను పొందారు. ముఖ్యఅతిథి రాకేష్ జైస్వాల్ మరియు శ్రీ  సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి, పాఠశాల యాజమాన్య సిబ్బంది. విద్యార్థులు అందరూ కలిసి, ఒక గ్రూప్ ఫోటో తీయించుకున్నారు.


పి విశ్వేశ్వర శాస్త్రి 


No comments:

Post a Comment

MEDICAL CAMP 10th August, 2025:

 LIST OF NSS STUDENTS FOR MEDICAL CAMP LINK   https://forms.gle/YYpntg2osbtzFfrv6   With the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Bab...