రిపోర్ట్ ఆన్ మహిళా డే ప్రోగ్రాం. DT 20-2-2023
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి ఆధ్వర్యములో, ఉస్మాన్ గంజ్, తోప్ ఖానా లో గల, శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్, (టైలోరింగ్) ఈ రోజు మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత భక్తిశ్రద్దలతో, నిర్వహించడమైనది.
యూత్ మహిళా మాన్సి తదితరులు జ్యోతి ప్రకాశం గావించగా, శ్రీమతి శిరీష స్వాగత వచనాల అనంతరం, వేదం లో భాగంగా గణపతి ప్రార్ధన, రుద్రం, మొదటి అనువాకం, శాంతి మంత్రాల తరువాత సుస్వరమైన భజనలు ఆలపించడమైనది.
ముందుగా మాన్సీ మాట్లాడుతూ, అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసికుంటూ, 16 వ బ్యాచ్ ఎన్నో విషయములు తెలుసుకున్నానని, డబ్బు సంపాదనలో పడలేదని అన్నారు.
ప్రమీల గారు మాట్లాడుతూ, వారి పతిదేవుల ఆదేశము ప్రకారం నడుచుకుంటూ ముందడుగు వేస్తున్న నన్నారు.
నజియా గారు, హీనా, మీనాక్షి, మౌలాన్, అర్చన, సమ్రీన్, అందరు తాము ఇంతవరకు టైలోరింగ్ క్లాస్ లో నేర్చు కున్న అన్ని ఐటమ్స్ ని వివరించారు
శిరీన్ మాట్లాడుతూ, గత 16 వ బ్యాచ్ లో తాను ఎంతో ప్రావీణ్యతను సంపాదించని, ఏ ఒక్క రోజు కూడా క్లాస్ కి హాజరు కాకుండా లేనని, మీరు కూడా ప్రతి ఒక్క క్లాస్ కు హాజరై వుండి, మీకు సెంటర్ కి పేరు తేవాలన్నారు.
శ్రీమతి దాస పద్మావతి మరియు శ్రీమతి వాణి, తైలాయింగ్ కోచ్ వాళ్లకు వచ్చిన అన్ని ఐటమ్స్ ని తోటి వారికీ ఎంతో ప్రావీణ్యతతో నేర్పి స్వామి ఆనందించే విధంగా ఉంటామన్నారు.
చివరగా శ్రీమతి దాస పద్మావతి మరియు శ్రీమతి వాణి స్వామి వారికీ మంగళ హారతి సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.
ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్, పి విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ గావిస్తూ, స్వామికి కృతజ్ఞ్యతలు తెలియ జెసికుంటూ, సహకరించిన వారి కందరికి స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని ప్రార్ధించి, అందరిని 25 వ తేదీ ఆశ్రిత కల్ప లో సేవలో పాల్గొనుటకు ఆహ్వానించారు.
No comments:
Post a Comment