Friday, February 3, 2023

శ్రీ సత్య సాయి నిలయం, గృహప్రవేశo

                                                                     ఓం శ్రీ సాయిరాం, 





గత రెండున్నర దశాబ్దములుగా, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి, ఆధ్యాత్మిక, సేవా, బాలవికాస్, కార్యక్రమాలను, అబిడ్స్ లో గల జి పుల్లారెడ్డి భవనం లో, ఎంతో వైభవంగా కార్యక్రమాలు నిర్వహించింది. కొన్ని కారణాలవల్ల, గత సంవత్సరం, జనవరి మాసంలో, పుల్లారెడ్డి భవనం ఖాళీ చేయడం జరిగింది. ప్రస్తుత పరిస్థితిలలో, గుబ్బ ఈశ్వరయ్య మరియు ,గుబ్బాసాగర్ సోదరులు, స్వామి వారి మీద, ఉన్న అపార ప్రేమ భక్తి, విశ్వాసములతో, స్వామి వారి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, హైదరాబాద్ లో గల   గౌలిగూడ చమన్, పాత బస్ డిపో కామన్, సమీపంలో,( రామ్ మందిర్ సమీపములో)  వారు నూతనంగా నిర్మించిన, నాలుగు అంతస్తుల భవనంలో, 4వ అంతస్తుని, స్వామి భజనలకు, సత్సంగములకు, బాలవికాస్ కార్యక్రమానికి, రికార్డింగ్స్ సెంటర్కు, ఉపయోగపడే విధంగా, ఒక హాలును కేటాయించారు. ఈ సందర్భంగా, ఈ మాఘ పౌర్ణిమ, ఫిబ్రవరి 5వ తేదీన, ఆదివారం, బ్రహ్మ ముహూర్తంలో, నాలుగు 4.38 నిమిషాలకు శ్రీ సత్య సాయి నిలయం, గృహప్రవేశ కార్యక్రమాన్ని, ఉదయం 6 గంటలకు వాస్తు పూజ 7 గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ వాస్తు కల్యాణం 8:30 వాస్తు నవగ్రహ మరియు శ్రీ సాయి గాయత్రి హోమం 11:30 భగవాన్ సత్యసాయి బాబా వారి వ్రతం ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ భవనంలో, 10-30 గంటలకు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు,  కోటి సమితి ఆధ్వర్యంలో, తండులార్చన పేరిట, 108 సార్లు సాయి గాయత్రి మంత్రాన్ని తండులార్చన  కార్యక్రమము, అందరు కలసి  " ఓం సాయీశ్వరాయ విద్మహే, సత్య దేవాయ ధీమహి తన్న: స్సర్వ ప్రచోదయాత్ " మంత్రమును జపిస్తూ, తండులార్చనతో బాలవికాస్ విద్యార్థులు, మహిళలు, గురువులు, అందరూ పాల్గొని,పూజలు నిర్వహించి, స్వామి వారికీ మంగళ హారతి సమర్పించి, స్వామి  దివ్య అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. 


పి విశ్వేశ్వర శాస్త్రి





ఓం శ్రీ సాయిరాం
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి, హైద్రాబాద్ ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీ సత్య సాయి నిలయం గృహప్రవేశం అనంతరం, గుబ్బాసాగర్ మరియు గుబ్బ ఈశ్వరయ్య గారు , స్వామి వారి మీద, ఉన్న అపార ప్రేమ భక్తి, విశ్వాసములతో, స్వామి వారి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, హైదరాబాద్ లో గల గౌలిగూడ చమన్, పాత బస్ డిపో కమాన్, సమీపంలో,( రామ్ మందిర్ సమీపములో) వారు నూతనంగా నిర్మించిన, నాలుగవ వ అంతస్తులో 10-30 గంటలకు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి ఆధ్వర్యంలో, నూతన భవనంలో తండులార్చన పేరిట, 108 సార్లు సాయి గాయత్రి మంత్రాన్ని అందరు కలసి 108 సార్లు "ఓం సాయీశ్వరాయ విద్మహే, సత్య దేవాయ ధీమహి తన్న: స్సర్వ ప్రచోదయాత్ " మంత్రమును జపిస్తూ, తండులార్చన ఏంతొ భక్తి శ్రద్దలతో బాలవికాస్ విద్యార్థులు, మహిళలు, గురువులు, అందరూ పాల్గొని,పూజలు నిర్వహించారు.

తొలుతగా, శ్రీమతి శైలేశ్వరి, శ్రీమతి రేణుక బాలవికాస్ గురువులు జ్యోతి ప్రకాశం గావించి, పూజ విధానమును విపులముగా వివరించారు. కన్వీనర్ పి. విశ్వేశ్వర శాస్త్రి మాట్లాడుతూ, సాధన వలన మాత్రమే మానవుడు భావంతుని చేరగలడని, భావంతుని పూజించడము కూడా ఓక సాధనే అని, పూజ చేయడము అంటే అర్చించడము అని, నవ విధ భక్తి మార్గాలలో అర్చన 5 వది అని, పోతన చెప్పిన విషమును, వివరించారు. - పొతన గారు చెప్పారు “ చేతులారంగా శివుని పూజింపఁడేని, నోరు నొవ్వంగ హరి కీర్తి నుడువఁడేని “ అని. స్వామి కూడా మన బాలవికాస్ పిల్లలకు చెప్పారు కదా, చేతులు నిచ్చినదేందుకో తెలుసా? మూతికి ముద్దదండించుటకా, కాదు కాదు పతిత పావడునైన శివుని పూజ చేసేందుకు. అని స్వామి చెప్పిన విషయములు చెప్తూ, తండులము అనగా బియ్యము. తణ్డులార్చన అనగా బియ్యముతో అర్చన, అంటే పూజ చేయడం. బియ్యమే ఎందుకు? అంటే బియ్యాన్ని ధవళ అక్షితలు అంటారు అని, అక్షితలు అంటే క్షయము కానిది దని, అంటే దేని నుండి క్షయము ( కట్ ) చేయలేనటువంటిది అని వివరించారు. బియ్యాన్ని వడ్లలోనుంచి తీస్తారు. . వడ్లగింజ భూమిలో పెడితే మొలకెత్తుతుంది. కానీ బియ్యం గింజలు మొలకెత్తవు. అవి ఎప్పటికి మార్పు చెందవు. “ అన్నం బహు కుర్వీత” అనగా ఓ భగవంతుడా ఈ అన్నాన్ని నీవే సృస్టించావు. సృటించే వాటిని పెంపొందించావు. అందువలన అన్నం పరబ్రహ్మ స్వరూపం అయినది. ఈ అన్నం బియ్యం నుంచి వస్తుంది కాబట్టి బియ్యాన్ని మాత్రమే ఈ అర్చనలో వాడుతాము. అని స్వామి వారు తెలియజేసిన విషయమును అందరికి తెలియజేసారు. ఈ తండులార్చన కార్యక్రమములో బాలవికాస్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, బాలవికాస్ పిల్లల, తల్లి తండ్రులు, గురువులు, మహిళలు, పాల్గొన్నారు. శ్రీ నరసింహారావు గారు, కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి స్వామి వారికి మంగళ హారతి సమర్పణతో, కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.
పి విశ్వేశ్వర శాస్త్రి. కన్వీనర్


Sairam, Koti samithi Tandularchana program Girls -15, Boys-12, Ledies -10, Gent's -10. Total members 47.




FOR THURSDAY BHAJANS: INVITE 9-2-2023

1) BALAJI
2) VARSHINI
3) VAISHNVI
4) AKHILA
5) CHENNA KESAVA
6) ANIL
7) SURENDER PATEL
8) PRABHAKAR
9) KESHAV
10) VIJAYALAKSHMI
11) SHAILESWARI
12) KALPANA
13) RENUKA
14) SHIREESHA
15) PADMAVATHY
16) VANI
17) GUBBA SAGAR
18) 6) BALVIKAS STUDENTS (10)
19) Saidass
20) Venugopal Jammikunta
21) Zia Guda Nageswara Rao
22) Zia Guda.Jyothi
23) Suresh Family
24) Vinay Kumar & Family.

===============================================

No comments:

Post a Comment

YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...