Friday, May 5, 2023

మాతృశ్రీ ఈశ్వరమ్మ ఆరాధనోత్సవం. 6-5-2023

 


PL CLICK HERE TO VIEW U TUBE OF THE PROGRAM  














ఘనంగా మాతృశ్రీ ఈశ్వరమ్మ ఆరాధనోత్సవం.

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, కోటి సమితి ఆధ్వర్యంలో, గౌలిగూడసి బి ఎస్ ప్రాంగణంలో  చలివేంద్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసినదే. మాతృశ్రీ ఈశ్వరమ్మ ఆరాధన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు అనగా 6 5 2023న, మంచినీరుతో పాటు మజ్జిగ, వితరణ గావించడమైనది. తొలుతగా శ్రీ గుబ్బా సాగర్ మాతృశ్రీ ఈశ్వరమ్మ చిత్రపటానికి  గారికి పూలు పుల మాలలు సమర్పించగా, కన్వీనర్ శ్రీ పి విశ్వేశ్వర శాస్త్రి దీపారాధన గావించి, వేదం, భజన తో కార్యక్రమం ప్రారంభమైనది.

 కన్వీనర్, శ్రీ విశ్వేశ్వర శాస్త్రి ఈ  రోజు న మాతృశ్రీ ఈశ్వరమ్మ గారిని స్మరించుకుంటూ వారి గూర్చి, మాట్లాడుతూ, "మాతృదేవోభవ" అను వేదవాణిని ఆచరణాత్మకముగా నిరూపించే నిమిత్తము స్వామి - మే 6 వ తేదీన మాతృశ్రీ శ్రీమతి ఈశ్వరమ్మ దినోత్సవమును పాటిస్తూ వచ్చారు. ఈశ్వరమ్మకు పిల్లలపట్ల గల అవ్యాజమైన వాత్సల్యమును దృష్టిలో వుంచుకుని ఆమె వర్ధంతిని బాలల దినోత్సవముగా కూడా జరుపుకొనుమని ఆదేశించారుఅని తెలిపారు. 

       ఈ లోకానికి యుగయుగాల నుండి అవతార పురుషులను అందించి నటువంటి ఆ మహాతల్లులు ఎంత గొప్పవారో యోచన చేయవలిసిన రోజు ఈ రోజు. ఈ రోజు మదర్స్ డే అనడంలో అంతరార్థం ఏమిటి? అటువంటి తల్లులుగా తయారు కావాలి అని. ​​ఈ రోజు బాలబాలికల దినముగా కూడా పాటిస్తున్నారు. ఎందుకుబాలబాలికలు తమ తల్లిదండ్రుల పట్ల ప్రేమానురాగాలను ఏ విధంగా ప్రకటించి వారిని సంతృప్తి పరచాలో తెలుసుకో వలసిన రోజు ఈ రోజు కనుక అని స్వామి తెలిపిన విషయములను తెలిపారు.

 ఈశ్వరమ్మ గారు శ్రీ సత్య సాయి బాబా వారిని  కోరిన మూడు కోరికలు గూర్చి చెబుతూఆ రోజుల కాల పరిస్థితుల కను గుణముగా, మహిళల  కోసము కోరిన ఒక ప్రసూతి ఆసుపత్రి, చిన్నపిల్లల కోసము ఒక చిన్న పాఠశాల, ఒక చిన్న బావి, ఏర్పాటు చేసిన విధానము గూర్చి చెబుతూఅవి, ఈ రోజు, ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా రూపుదిద్దుకొని వేల  మందికి సేవలందిస్తున్న విధానమునుఆ నాటి  బావి, నేడు  700 గ్రామాలకు, పైగాశ్రీ సత్య సాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుగా మారిన  విధానమును, నాటి చిన్న బడిఈ నాటి, k.g. To p.g. వరకు ఉచిత విద్యా  రూపతరము చెందిన విధానమును, మహిళల కోసము ప్రత్యేకముగా, మహిళా యూనివర్సిటీని అనంతపూర్ లో నిర్మాణము గావించి, ఆనాటి, భారత రాష్ట్రపతి శ్రీ వి.వి.గిరి గారి చేతులమీదుగాప్రారంభోత్సవం జరిగిందనితెలుపుతూ,   శ్రీ సత్య సాయి సూపర్ స్పెషలిటీ ఆసుపత్రిలో  లో ఎక్కడ బిల్ కౌంటర్లు కనపడవని, అంత ఉచిత మే నని, తెలియ జేశారు. తల్లికి ఇచ్చిన మాట ప్రకారము స్వామి విదేశములకు వెళ్లలేదని, 170 దేశాల వారిని తన ప్రేమ ద్వారా ఆకట్టుకొన్నారని తెలియ జేశారు. 

 శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి, ఈశ్వరమ్మ ఆరాధన దినోత్సవ వేడుకలలో భాగంగా, మహిళా ఆర్టీసీ సిబ్బందికి, స్వీపర్లకు మరియు, చలివేంద్రం ఏర్పాట్లలో, సహకరించిన, శ్రీమతి  ఎస్ విజయలక్ష్మి కి, శ్రీదేవి కిప్రభావతి కిఎం సంగీత కి, కె పోచమ్మకు, మరియుసురేఖకి,    తదితరులకు, మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి ప్రేమను స్వామివారి ప్రేమను, చీర రూపంలో, అందజేయడమైనది.  ఈ కార్యక్రమంలో. శ్రీమతి విజయలక్ష్మి , ప్రభాకర్ , శ్రీరామదాసు,శ్రీ ఎం ఆంజనేయులుశ్రీ రతి రావు పాటిల్,దాస పద్మావతి, దాస వాణి, గుబ్బ  సాగర్, కామేష్ గాంధీ, స్కిల్ డెవలప్మెంట్ టైలోరింగ్  టైనీస్కన్వీనర్, శ్రీ విశ్వేశ్వర శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

 శ్రీమతి విజయలక్ష్మి స్వామి వారికి  మంగళ హారతి సమర్పణతో కార్యక్రమము ముగిసినది.


No comments:

Post a Comment

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం  - 2025  GOOGLE FORM: LINK:  TOTAL NO OF CANDIDATES LINK:  ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వా...