Monday, October 28, 2024

99 రోజుల పాటు సాగిన ఆధ్యాత్మిక ప్రయాణం అక్టోబర్ 27, 2024న సంపూర్ణమైనది.

















99 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం సమాప్తం

భగవాన్  శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో  99 రోజుల పాటు సాగిన ఆధ్యాత్మిక ప్రయాణం అక్టోబర్ 27, 2024న సంపూర్ణమైనది. 

భక్తి పరవశమైన ఊరేగింపు

ఈ రోజు గౌళిగుడా రామ మందిరం నుండి శ్రీ సత్య సాయి భజన మందిరం వరకు ఘనమైన ఊరేగింపుతో ప్రారంభమైంది. భక్తులు పవిత్రమైన సాయి గాయత్రీ మంత్రాన్ని జపించుకుంటూ, భక్తి మరియు ఆధ్యాత్మికత యొక్క సామరస్యమైన మేళవింపుతో కొనసాగినది. 

ఆధ్యాత్మికత యొక్క మార్గాన్ని ప్రకాశింపజేయడం

శ్రీ గుబ్బ సాగర్ మరియు శ్రీమతి రేణుకలు జ్యోతి వెలిగించారు, 

ఆధ్యాత్మిక సాధనల నేపథ్యం

ఈ కార్యక్రమం శ్రేణి ఆధ్యాత్మిక సాధనలతో వెలిగింది:

వేద పారాయణం: ప్రాచీన వేద మంత్రాల మధుర పఠనం ప్రశాంతమైన మరియు పవిత్రమైన వాతావరణాన్ని సృష్టించింది. అష్టోత్ర పూజ: దివ్యత్వం యొక్క 108 నామాలకు హృదయపూర్వకమైన ప్రసాదం. భజనలు: ఆత్మను కదిలించే భక్తిపూర్వక భజనలు భక్తుల హృదయాలను దివ్య ప్రేమతో నింపాయి. దివ్య ప్రసంగం: ఆధ్యాత్మిక సత్యాల లోతైన అన్వేషణ, ప్రేక్షకులను ఉన్నత చైతన్యం కోసం ప్రేరేపించింది.

 శివమ్ లో భగవాన్  శ్రీ సత్య సాయి బాబా వారి జన్మదిన వేడుకలు

హైదరాబాద్ జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీ దేవేందర్, నవంబర్ 17 నుండి 23 వరకు హైదరాబాద్ లోని శివంలో జరగనున్న భగవంతులైన శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి 99వ జన్మదిన వేడుకల గురించి వివరణాత్మక సమాచారాన్ని పంచుకున్నారు. నవంబర్ 2024. అతను నవంబర్ 30 మరియు డిసెంబర్ 1 న ప్రశాంతి నిలయంలో జరిగే పర్తి  యాత్రలో పాల్గొనడానికి అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించాడు. దేవేందర్ హాజరైన వారిని తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను ఆహ్వానించి, ఉత్సవాలలో పాల్గొని దివ్యమైన ఆనందాన్ని అనుభవించాలని కోరారు. ప్రేమ, శాంతి మరియు ఆధ్యాత్మికత సందేశాన్ని ప్రచారం చేయడం ఎంత ముఖ్యమో ఆయన నొక్కి చెప్పారు.

 

దేవేందర్ కేక్ కటింగ్ కార్యక్రమములో  పాల్గొన్నారు, ఇది దివ్యత్వంతో ఆనందం మరియు కృతజ్ఞతను పంచుకోవడం యొక్క చిహ్నం. కేక్‌ను భగవంతులైన శ్రీ సత్య సాయి బాబాకు భక్తి మరియు గౌరవం యొక్క చిహ్నంగా సమర్పించారు. కార్యక్రమం భగవంతునికి హారతితో ముగిసింది.

ఈ నాటి కార్యక్రమములో   5 కిలోల బియ్యం, 1 కిలో నూనె మరియు 1 కిలో దాల్ కలిగి ఉన్న 5 నారాయణ సేవా ప్యాకెట్లు 5 నారాయణలకు పంపిణీ చేయబడ్డాయి, ఇది సంస్థ యొక్క అవసరమైన  వారికి సేవ చేయాలనే నిబద్ధతను ప్రదర్శిస్తుంది.

కృతజ్ఞతలు

కన్వీనర్ పి. విశ్వేశ్వర శాస్త్రి భగవంతులైన శ్రీ సత్య సాయి బాబా వారు, శ్రీ దేవేందర్ హైదరాబాద్ జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ మరియు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీ ఎ. మల్లేశ్వర రావులకు పార్టీ యాత్రను నిర్వహించడంలో వారి అవిరళ మద్దతు మరియు ప్రోత్సాహానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


 





Saturday, October 19, 2024

3rd FRIDAY CLEAN & GREEN AND BHAJAN. AT SIVAM DT 18-10-2024

 








7-30 HAARATHI 








భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతోప్రతి మాసంలోమూడవ శుక్రవారం మరియు నాలుగువ శుక్రవారంశివం మందిర ప్రాంగణాన్ని శుభ్రపరచడానికికోటి సమితి మహిళలకు కేటాయించబడింది. ఈ సందర్భంగా ఈ మాసంలో మూడవ శుక్రవారం 18-10-2024  ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీమతి చాంద్ బి,  శ్రీమతి విజయలక్ష్మిశ్రీమతి సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొంటున్నారు. 

6 నుంచి 6-30  వరకు జరిగే భజన కార్యక్రమంలో, బాలవికాస్ విద్యార్థులు, కుమారి జాహ్నవి, కుమారి వైష్ణవి, మాస్టర్ కార్తీక్, మాస్టర్ బలేశ్వర్, మాస్టర్ అఖిలేశ్వరి, కుమారి నిహారిక, తదితరులు పాల్గొన్నారు. 

అందరు ఒక భజన మరియు బాలవికాస్ విద్యార్థులు 2 భజనలు పాడారు . 

7-30 గంటల హారతి లో శ్రీ జి వి న్ రాజు గారు స్వామి వారికీ హారతి నిచ్చారు. 


Thursday, October 10, 2024

SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES - AT BHAVAN'S NEW SCIENCE COLLEGE DT 18-10-2024

 SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  - AT BHAVAN'S NEW SCIENCE COLLEGE DT  18-10-2024 @ 11 am 





2) BHAVAN'S NEW SCIENCE  DEGREE COLLEGE 

Sri Perala Krishna Rao, Principal. 9000513572  Point of Contact. Sri Surender Lecturer. 9393008967 - Smt Shalini Garu. 


శ్రీ సత్య సాయి బాబా వారి పాదపద్మాలకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ, ఈనాటి కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొన్న భవన్స్ న్యూ సైన్స్ కాలేజ్ యూత్ కు అందరికీ స్వాగతం సుస్వాగతం.

శ్రీ ఆర్జీ రత్నాకర్, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్  మేనేజింగ్ ట్రస్టీ, మార్చి 4 2024న హైదరాబాద్ గచ్చిబౌలి లో గల బాలయోగి స్టేడియంలో, లాంచనంగా శ్రీ సత్యసాయి యూత్ ఎంపవర్మెంట్ సీరియస్ ను ప్రారంభించిన విషయం తెలిసినదే. ఈ కార్యక్రమంలో దాదాపు 6000 మంది, పాల్గొన్నారు.

మన కాలేజీ నుంచి కూడా 50 మంది విద్యార్థులు వారితోపాటు, NSS  ఆఫీసర్స్ లెక్చరర్స్ పాల్గొనడం విశేషం.

ఈ సందర్భంగా, కాలేజీ ప్రిన్సిపాల్ కృష్ణారావు గారికి మరియు సురేంద్ర భవాని గారికి శ్రీమతి షాలిని గారికి ధన్యవాదాలు.

జాతీయ సేవా పథకం నేషనల్ సర్వీస్ స్కీమ్ భారత ప్రభుత్వం చేత 1969 సంవత్సరంలో ప్రారంభించబడిన యువజన కార్యక్రమం. ఈ పథకాన్ని ప్రారంభించి నేటికి 55 సంవత్సరాలు అయిన తరుణంలో ఈ కార్యక్రమాన్ని కోటి సమితి ద్వారా  ఈరోజు ఇక్కడ మన కాలేజీ ప్రాంగణంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది.  గత మాసంలో NSS  డే సంబరాల దినోత్సవాల్లో భాగంగా, హైదరాబాద్, పాతపట్నంలో గల, సిటీ కాలేజీలో, కోటి సమితి ఎంతో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఒక మనిషి మరొక మనిషికి సహకరించడం మానవతాలక్షణం అదేవిధంగా మనం పదిమందిలో ఉన్నప్పుడు మన వల్ల ఆ పదిమందికి ప్రయోజనం కలిగి ఉండాలి. ఈ విధంగా పరస్పర సహకారంతో పరోపకారంగా మంచిగా మెలగటమే సంఘ సేవ.

భారతీయ విద్యా భవన్‌ యొక్క భవన్‌ నూతన సైన్స్ కాలేజ్‌ 1956లో స్థాపించబడింది. ఇది కళ్లలో కలలు, గుండెల్లో మిషనరీ ఉత్సాహంతో కూడిన యువ ఉపాధ్యాయుల బృందాన్ని కలిగి ఉన్న సంఘం. దాని స్థాపన నుండి, కళాశాల అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి సైన్స్, కామర్స్, ఆర్ట్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి ఆర్గానిక్ కెమిస్ట్రీ మరియు జియాలజీలను బోధించడానికి ఆధునిక విధానాన్ని అభివృద్ధి చేయడంలో వేగవంతమైన పురోగతి సాధిస్తోంది.

భవన్‌ నూతన సైన్స్ కాలేజ్‌ ఉన్నత విద్య రంగంలో ఆవిష్కరణ ప్రయత్నాలకు నిబద్ధత కలిగి ఉంది. కళాశాల పునర్వ్యవస్థీకరించబడిన కోర్సులను విజయవంతంగా అవలంబించగలిగింది. ఈ దిశలో నిరంతర ప్రయత్నాలు ప్రోత్సాహక ఫలితాలను ఇచ్చేలా చేయడమే కాకుండా, కళాశాలకు గౌరవం మరియు ప్రతిష్టను కూడా సంపాదించి పెట్టాయి. కళాశాల ప్రముఖ అభ్యర్థన / బోధనా సంస్థగా గుర్తింపబడింది.

భారతీయ విద్యా భవన్‌ యొక్క భవన్‌ నూతన సైన్స్ కాలేజ్‌ ఒక ప్రతిష్టాత్మక విద్యా సంస్థ. భారతీయ విద్యా భవన్‌ యొక్క నాయకత్వంలో నైతిక, సామాజిక, సాంస్కృతిక మరియు పరోపకార విలువలకు ప్రసిద్ధి చెందింది. అది దాని అకాడమిక్ ఉత్తమత్వాన్ని మరియు అడ్మినిస్ట్రేటివ్ వృద్ధిని కొనసాగిస్తుంది.సుమారు 70 సంవత్సరాల, చరిత్ర కలిగిన ఈ భవన్స్ న్యూ సైన్స్ కాలేజీ లో ఈ కార్యక్రమం నిర్వహించడం స్వామి యొక్క దివ్య అనుగ్రహంగా భావిస్తున్నాం.

మా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు స్వామి పూర్వ విద్యార్థి వారు హైకోర్టు లీడింగ్ అడ్వకేట్ గా ఉన్నారు.స్వామివారి విద్యార్థులంతా సంస్థలలో ప్రధాన పాత్ర పోషించాలని స్వామి కోరిక. వారి కోరిక మేరకే న్యాయమూర్తి చేపట్టి సంస్థలో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా ఉంటూ వారి దిశా నిర్దేశంలో అనేక సామాజిక, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో, ఎంతో ముందుకు దూసుకెళ్తున్నాం ఏమాత్రం అనుటలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ శ్రీ సత్య సాయి యూత్ ఎంపవర్మెంట్ కార్యక్రమం  కూడా  మా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుల వారికి వచ్చిన సంకల్పమే.  ఇక ఆలస్యం లేకుండా మా డిస్టిక్ ప్రెసిడెంట్  శ్రీ మల్లేశ్వరరావు గారిని  వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. 

 


Wednesday, October 9, 2024

శ్రీ సత్యసాయి ఆశ్రిత కల్ప ఆశ్రమంలో బతుకమ్మ సంబరాలు 9-10-2024


శ్రీ సత్యసాయి ఆశ్రిత కల్ప ఆశ్రమంలో బతుకమ్మ సంబరాలు

 ఓం శ్రీ సాయిరాం

భగవాన్ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు అనగా 9 10 2024న, రెడ్ హిల్స్ లో గల శ్రీ సత్యసాయి ఆశ్రిత కల్ప ఆశ్రమంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం జ్యోతి ప్రకాశంతో ప్రారంభమై సుమారు ఐదు గంటలకు, ఆశ్రమ వాసులు, ఆశ్రమం ఇన్చార్జులు, ఖైరతాబాద్ యూత్ మహిళలు, ముఖ్యంగా ఈరోజు, కోటి సమితి సేవా సభ్యులకు, ఆశ్రితకల్పలో సేవ కనక, మహిళా సేవాదళ్ సభ్యులు, కోటి సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, కొంతమంది శ్రేయోభిలాషులు, సుమారు 100 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొని, స్వామి అనుగ్రహానికి పాత్రులు అయినారు. ముఖ్యంగా కోటి సమితి కన్వీనర్, ఈ కార్యక్రమానికి, సంబంధించిన, బతుకమ్మ పాటలను, బ్లూటూత్ స్పీకర్ ద్వారా ప్లే చేయటం వల్ల, మహిళలంతా, ఎంతో  ఉత్సాహ భరితులై, ముందుగా జనకు జనకు నింట్ల ఉయ్యాలో- సత్యజనకు నింట్ల ఉయ్యాలో- సీత పూట్టినాది ఉయ్యాలో- పుట్తుతా ఆ సీత ఉయ్యాలో - పురుడే గోరింది ఉయ్యాలో - పెరుగుతా ఆ సీత ఉయ్యాలో-  పెండ్లే గోరింది అంటూ -  రామ రామ రామ ఉయ్యాలో - రామనే శ్రీరామ ఉయ్యాలో - రామ రామానంది ఉయ్యాలో - రాగమెత్తరాదు ఉయ్యాలో - హరిహరియా రామ ఉయ్యాలో - హరియా బ్రహ్మదేవ ఉయ్యాలో - హరి అన్నవారికి ఉయ్యాలో - ఆపదలూ రావు ఉయ్యాలో- , అంటూ ఎంతో తన్మయత్నం తో పాల్గొన్నారు  అనుటలో ఏమాత్రం  అతిశయోక్తి లేదు.

 

ఈ బతుకమ్మ సంబరాలు ఆశ్రమ వాసులకు ఎంతో ఆవేదనలో ఉన్నవారికి, ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ కార్యక్రమంలో కోటి సమితి సభ్యులు స్కిల్ డెవలప్మెంట్ సభ్యులు, పాల్గొనడం స్వామి యొక్క దివ్య అనుగ్రహం అయిన భావిస్తూ, మరిన్ని కార్యక్రమాలు చేసే విధంగా స్వామి అనుగ్రహించాలని కోరుకుంటూ సాయిరాం. ఈ రోజు ఈ  కార్యక్రమంలో, స్కిల్ డెవలప్మెంట్ సభ్యులు, శ్రీమతి వాణి, శ్రీమతి లక్ష్మమ్మ, శ్రీమతి రమ్య, శ్రీమతి సంధ్య, శ్రీమతి విజయలక్ష్మి,శ్రీమతి నీలిమ, శ్రీమతి సురేఖమాస్టర్ సాయి గుప్తా, శ్రీ రాందాస్, కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి పాల్గొన్నారు.






video link. 



Wednesday, October 2, 2024

DASARA CELEBRATIONS AT SIVAM. FROM 3-10-2024 TO 12-10-2024 - KOTI SAMITHI SAMITHI DATES. 6TH, 7TH, 12TH,

 



ఓం శ్రీ సాయిరాం

 ఆదివారము 6-10-2024 న రోజున మహాలక్ష్మి అలంకరణ.  ఉదయం 7 గంటల నుండి, 1 గంట వరకు శివమ్ మందిరంలో సేవ మన కోటి సమితికి కేటాయించబడినది. కాన మనము 6-45 నిమిషములకే రిపోర్ట్ చేయవలెను. 

శ్రీ చక్రధర్, శ్రీ హరి ముత్యం నాయుడు, శ్రీ కే యాదగిరి, శ్రీ రాంరెడ్డి గారు, శ్రీ రమేష్ గారు, శ్రీ అఖిలేశ్వర్, శ్రీ రతి రావు పాటిల్,  శ్రీ యోగేష్ పాటిల్, శ్రీ Ch రవీందర్ రెడ్డి , శ్రీ రామ్ దాస్, శ్రీ రాము, 

Morning Seva opportunities – We need 6 gents and 6 mahila sevadal 

  • 1. Assist the kitchen team for breakfast and lunch prasadam preparation. 
  • 2. Breakfast and Lunch prasadam serving. 
  • 3. Bhajan hall cleaning after the pooja. 
  • 4. Sevadal security points main mandir entrance and other gates. 

7-10-2024 న పూజ మహిళలచే, కోటి సమితి వారికి, 

సాయిమాత అనుగ్రహ ఆశీస్సులతో 12/10/2024 విజయదశమి నాడు చండీహోమము, పూర్ణాహుతి నాడుశివం మందిరం ఎదురుగా ఉన్న ఆవరణలో హోమములు జరుగుతున్న సమయములో మన 16 సమితుల నుండి ఒక్కొక్క సమితికి 10 మంది దంపతులు ‌వచ్చి,కుంకుమపూజలో పాల్గొనాలి. 

శ్రీమతి వేణి గారు దంపతుల‌ పేర్లు సెల్ నెంబర్ పంపగలరు. 

 కుంకుమ పూజ విశిష్టత:-

అమ్మవారికి కుంకుమపూజ చేయడంద్వారా జీవితంలో అన్నిరకాల పురుషార్ధాలు అంటే ధర్మ,అర్ధ,కామ మోక్ణములు లభిస్తాయి.

12-10-2024 న  160 మంది దంపతులు కూర్చుని ఆ సాయిమాతకి కుంకుమ పూజ చేసి మనమంతా అమ్మ కృపకు పాత్రులు కావలెను. పూజలో పాల్గొను వారు వైట్ ప్యాంటు,  వైట్ షర్ట్,  మహిళలు పట్టు వస్త్రములు ధరించ వలెను. 

----- 



 

99TH BIRTHDAY CELEBRATIONS AT SIVAM STARTING FROM 17TH NOVEMBER, 2024:

  భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి  దివ్య ఆశిస్సులతో   “  సత్యసాయి భగవానుని   99 వ జన్మ దిన వేడుకలలో భాగంగా   ” 17  నవంబర్ , 2024  న   హైదరాబ...