Wednesday, October 9, 2024

శ్రీ సత్యసాయి ఆశ్రిత కల్ప ఆశ్రమంలో బతుకమ్మ సంబరాలు 9-10-2024


శ్రీ సత్యసాయి ఆశ్రిత కల్ప ఆశ్రమంలో బతుకమ్మ సంబరాలు

 ఓం శ్రీ సాయిరాం

భగవాన్ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు అనగా 9 10 2024న, రెడ్ హిల్స్ లో గల శ్రీ సత్యసాయి ఆశ్రిత కల్ప ఆశ్రమంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం జ్యోతి ప్రకాశంతో ప్రారంభమై సుమారు ఐదు గంటలకు, ఆశ్రమ వాసులు, ఆశ్రమం ఇన్చార్జులు, ఖైరతాబాద్ యూత్ మహిళలు, ముఖ్యంగా ఈరోజు, కోటి సమితి సేవా సభ్యులకు, ఆశ్రితకల్పలో సేవ కనక, మహిళా సేవాదళ్ సభ్యులు, కోటి సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, కొంతమంది శ్రేయోభిలాషులు, సుమారు 100 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొని, స్వామి అనుగ్రహానికి పాత్రులు అయినారు. ముఖ్యంగా కోటి సమితి కన్వీనర్, ఈ కార్యక్రమానికి, సంబంధించిన, బతుకమ్మ పాటలను, బ్లూటూత్ స్పీకర్ ద్వారా ప్లే చేయటం వల్ల, మహిళలంతా, ఎంతో  ఉత్సాహ భరితులై, ముందుగా జనకు జనకు నింట్ల ఉయ్యాలో- సత్యజనకు నింట్ల ఉయ్యాలో- సీత పూట్టినాది ఉయ్యాలో- పుట్తుతా ఆ సీత ఉయ్యాలో - పురుడే గోరింది ఉయ్యాలో - పెరుగుతా ఆ సీత ఉయ్యాలో-  పెండ్లే గోరింది అంటూ -  రామ రామ రామ ఉయ్యాలో - రామనే శ్రీరామ ఉయ్యాలో - రామ రామానంది ఉయ్యాలో - రాగమెత్తరాదు ఉయ్యాలో - హరిహరియా రామ ఉయ్యాలో - హరియా బ్రహ్మదేవ ఉయ్యాలో - హరి అన్నవారికి ఉయ్యాలో - ఆపదలూ రావు ఉయ్యాలో- , అంటూ ఎంతో తన్మయత్నం తో పాల్గొన్నారు  అనుటలో ఏమాత్రం  అతిశయోక్తి లేదు.

 

ఈ బతుకమ్మ సంబరాలు ఆశ్రమ వాసులకు ఎంతో ఆవేదనలో ఉన్నవారికి, ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ కార్యక్రమంలో కోటి సమితి సభ్యులు స్కిల్ డెవలప్మెంట్ సభ్యులు, పాల్గొనడం స్వామి యొక్క దివ్య అనుగ్రహం అయిన భావిస్తూ, మరిన్ని కార్యక్రమాలు చేసే విధంగా స్వామి అనుగ్రహించాలని కోరుకుంటూ సాయిరాం. ఈ రోజు ఈ  కార్యక్రమంలో, స్కిల్ డెవలప్మెంట్ సభ్యులు, శ్రీమతి వాణి, శ్రీమతి లక్ష్మమ్మ, శ్రీమతి రమ్య, శ్రీమతి సంధ్య, శ్రీమతి విజయలక్ష్మి,శ్రీమతి నీలిమ, శ్రీమతి సురేఖమాస్టర్ సాయి గుప్తా, శ్రీ రాందాస్, కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి పాల్గొన్నారు.






video link. 



No comments:

Post a Comment

YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...