Thursday, September 19, 2019
Monday, September 16, 2019
Hospital Visit 14/9/2019
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు అనగా 14 9 2019 న శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో, సుల్తాన్ బజార్ లో గల మహిళ ప్రసూతి ఆస్పత్రి నందు, కొత్తగా పుట్టిన పిల్లలకు, బేబీ కిట్, మరియు బాలింతలకు, ఆపిల్ పండ్లను, వితరణ గావిస్తూ, సెల్ ఫోన్ పుట్టిన పిల్లలకు, దూరముగా నుంచాలని , ఎంతో శుభ్రముగా వారి పరిసర ప్రాంతమును, ఉంచుకోవాలని, సూచనలు ఇచ్చారు. ఈనాటి ఈ కార్యక్రమంలో ఒకేషనల్ ట్రైనింగ్ టైలరింగ్ లో శిక్షణ పొందుతున్న మహిళలు, మహిళా ఇంచార్జి, శ్రీమతి విజయలక్ష్మి, కుమారి షా గుప్త, శ్రీమతి , సీతా మహాలక్ష్మి, కుమారి టం కింగ్, శ్రీమతి చిత్రూపిణి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.
హాస్పిటల్ సూపర్డెంట్ శ్రీమతి రాజ్యలక్ష్మి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి వారు చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను కొనియాడారు. మేమంతా వారిని కలిసి స్వామివారి ప్రసాదాన్ని వారికి కూడా అందజేసాము.
ఈ కార్యక్రమంలో మొత్తం 65 , బేబీ కిట్, 85 ఆపిల్స్ వితరణ గావించడం
అయినది. జై సాయిరాం, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించిన స్వామికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరియు సహకరించిన సేవాదళ్ సభ్యులందరికీ స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని మరీ మరీ కోరుకుంటూ , జై సాయిరాం.. సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి...
EYE CAMP 15 9 2019 & PRESS CLIPPINGS
EYE CAMP 15 9 2019 & PRESS CLIPPINGS
ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 15 9 2019 న ఉదయం 9 గంటల 15 నిమిషములకు మంగళ సన్నాయి వాద్యములు, వేద మంత్రముల మధ్య శ్రీ రాందాస్ తేజ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, అసెంబ్లీ విభాగము, మరియు మహంకాళి లక్ష్మీ నరసింహారావు, ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రముఖ కంటి వైద్యులు లిబర్టీ ఆప్షన్స్ ప్రొప్రైటర్ శ్రీ డాక్టర్ ఆదిత్య గారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి, జ్యోతి ప్రకాశనం గావించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాందాస్ తేజ, ACP ASSEMBLY మాట్లాడుతూ, నన్ను ఈనాటి ఈ కార్యక్రమంలో, భాగస్వామిని చేసినందుకు, కోటి సమితి చేస్తున్న వివిధ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, కోటి సమితి సభ్యులకు, సమితి కన్వీనర్ కు, అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, "సర్వేంద్రియానాం నయనం ప్రధానం" కన్ను శరీరములోని అన్ని అంగముల కన్నా, ఎంతో ప్రధానమైంది, అని దాన్ని మనము చాలా అశ్రద్ధ చేస్తున్నామని, దానిని నిరంతరం పనికి వచ్చే విషయాలు పైనే, మనం మన కంటిని జాగ్రత్తగా చూసుకోవాలని , ప్రస్తుతం ఉన్న ఈ మొబైల్ ఫోన్స్ వల్ల, టీవీ, కార్టూన్ చిత్రాల వల్ల పిల్లలు చిన్నప్పటినుంచే, వారికి కళ్ళద్దాల అవసరం ఏర్పడుతుందని, తెలియజేస్తూ, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, వంటి కంటి వైద్య శిబిరాలు ఎంతో అవసరమని, అవసరాన్ని గుర్తించి, కోటి సమితి ఈ సేవను ఎంచుకొని, లబ్ధిదారులను ముందుగానే గుర్తించి వారికి ఐడీ కార్డులను ఇష్యూ చేసి ఎంతో ప్రణాళికతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతోమందికి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నానని అన్నారు, ఈ కార్యక్రమాన్ని భగవాన్ సత్యసాయి బాబా వారి, రానున్న 94వ జన్మ దినోత్సవ సందర్భంగా, నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మొత్తం 91 మంది పేర్లు నమోదు చేసుకొని, పరీక్షలు నిర్వహించుకున్న తరువాత, 66 మందికి, కళ్ళజోళ్ళు ఇచ్చే విధంగా డాక్టర్ గారు వారు నిర్ధారణ చేసినారు, ఇద్దరికీ ఆపరేషన్ అవసరం అని తెలియజేశారు 12 మందికి మందులు రాసి తగిన సూచనలు ఇచ్చారు.
పవిత్ర కార్యక్రమంలో, శ్రీ సత్య సాయి గ్రామ సేవ మహాయజ్ఞం లో భాగంగా, కోటి సమితి దత్తత తీసుకున్న, కట్టెల మండి కి సంబంధించిన గురుమూర్తి దంపతులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు, అదేవిధంగా, కోటి సమితి బాలవికాస్ పిల్లలు కూడా కంటి వైద్య చికిత్స లో పాల్గొన్నారు. ఒకేషనల్ ట్రైనింగ్ టైలరింగ్, శిక్షణ పొందిన వారు శిక్షణ పొందుతున్న వారు వారి బంధువులు అధిక సంఖ్యలో (నిరుపేద వారు) ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. డాక్టర్ కు చూపించుకోవటానికి వేచి వున్నా లబ్దిదాలులకు ఒక అవగాహన కల్పించుటకు, పూర్తి వెలుతురు లో నే చదవ వలెనని, ట్రైన్లో ప్రయాణం చేయు నపుడు, లేక కదులుతున్న వాహనాలలో వున్నపుడు, చదవ కూడదని, కళ్లజోళ్లు తప్పని సరిగా ఉపయోగించాలని, A విటమిన్స్ వున్న పదార్ధములను అంటే అందరికి వీలుఅయ్యే ఆకుకూరలతో ముఖ్యముగా పాలకూర ను ఎక్కువ తీసుకోవాలని,కోటి సమితి, మహిళా యూత్ సభ్యులు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో, కుమారి షాప్ గుప్తా సిద్ధికి, tabassum బేగం, శ్రీమతి చిత్ రూపిని, శ్రీమతి పద్మావతి, సుమతి రాధిక బాల్ కి, శ్రీమతి జ్యోతి తివారి, శ్రీమతి విజయలక్ష్మి, శ్రీ రాము, శ్రీ చక్రధర్, కుమారి ఎం ఆశ్రిత, ప్రమోద్ కుమార్ మహేశ్వరి తదితరులు, ఈ కార్యక్రమంలో తమ అమూల్యమైన సేవలను అందించారు పాల్గొన్నారు.
సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ గావిస్తూ,
12వ బ్యాచ్ కవొకేషన్ మరియు 66 మందికి కళ్లజోళ్లు పంపిణి తేదీ 21-9-2019, వేదిక: అబిడ్స్,జి. పుల్లా రెడ్డి భవనం, 6 వ అంతస్తు, శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్ ప్రాగణంలో. ముఖ్య అతిధిగా MS KRUTHIKA VASIREDDY, LLM BERKELEY SCHOOL OF LAW ( UNIVERSITY OF CALIFORNIA )MEDIA SPEAKER, ACADEMIC WRITER విచ్చేయనున్నారు.
జ్యోతి ప్రకాశనం గావించిన ప్రముఖులు, SRI MAHAKANLI NARASIMHA RAO, SRI RAMDAS TEJA, ASSISTANT COMMISSIONER OF POLICE. DR ADITYA, NARASIMHA RAO.(PREM SAI CALENDERS PROPRITOR. )
ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్న DR. ADITYA
Wednesday, September 11, 2019
IMPORTANT ANNOUNCEMENT. 12-9-2019
ఓం శ్రీ సాయి రామ్
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో, ఈ రోజు మనము మన గురువారం భజనను మన ఇండ్లలోనే జరుపుకోవలసిందిగా సూచన. ఈ రోజు వినాయక నిమజ్జనం సందర్భముగా ఎక్కడి కక్కడ బారికేడ్స కట్టి ఉంటవి, కాన మన మంతా మన మన ఇండ్లలో భజనలు మన కుటుంబ సభ్యులతో సర్రిగా 6 గంటలకు ప్రారంభించి, 7 గంటల వరకు భజనలు పాడు కొని స్వామి అనుగ్రహానికి పాత్రులమవుదాము.
సాయిరాం. 12-9-2019
Saturday, September 7, 2019
FREE EYE CAMP 15-9-2019 @ 8 AM TO 2 PM
ఓం శ్రీ సాయి రామ్, స్వామి దివ్య ఆశీస్సులతో, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి, ఉచిత కంటి వైద్య శిబిరమును, మరియు కంటి అద్దముల బహుకరణ కార్యక్రమాన్ని, సెప్టెంబర్, 15న శిభిరమును, బహుకరణ 21-9-2019 న జరుపనున్నది. కాన మన మంతా ఈ అవకాశమును వినియోగించుకొనుటకు తగిన పాస్ లను ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ లో పొంద ప్రార్ధన.
Aum Sri Sai Ram. With the Divine Blessings of Bhagawan Sri Sri Sathya Sai Baba, Sri Sathya Sai Seva Organisations, Koti Samithi, is organasing Free Eye Camp on Sept 15 at VTC Osman Gunj, and giving spects on 21-9-2019 at the same place. Needy persons are requested to obtain the passes. jai Sai Ram. P V Sastry
Sunday, September 1, 2019
2-9-2019. Vinayaka Chaviti Special Bhajan
2, సెప్టెంబర్ 2019 సంవత్సరం : వికారి సంవత్సరం,ఆయనం : దక్షిణాయణం,మాసం : భాద్రపదమాసం, ఋతువు : వర్ష ఋతువు,కాలము : వర్షాకాలం,వారము :సోమవారం ,పక్షం : శుక్లపక్షం తిథి : చవితి,ఈ రోజు స్వామి దివ్య
ఆశీస్సులతో వినాయక చవితి పండుగ సందర్భముగా ప్రత్యేక భజన శ్రీమతి శైలేశ్వరి నవీన్ కుమార్ గారి నివాసమునందు అత్యంత భక్తి శ్రద్ధలతో, సరిగ్గా ఉదయం 7 గంటలకు,
ఓంకారం తో ప్రారంభమై,
వేదపఠనం, గణపతి గాయత్రీ, గణపతి అధర్వణ శీర్షం, భజనలతో,
కార్యక్రమము
దిగ్విజయముగా జరిపించిన స్వామికి హృదయపూర్వక కృతజ్య్నాతలు తెలియజేసిన
తదనంతరం, శ్రీ నవీన్ కుమార్ మంగళహారతి సమర్పణతో, కార్యక్రమము ముగిసినది. అందరూ ప్రసాదం తీసుకొని వారి వారి గృహములకు చేరిరి. సుమారు మొత్తము పిన్నలు పెద్దలు
కలసి 50 మంది హాజరైనారు.ఈ నాటి భజనలో, చిరంజీవి, హేమాంగ్, చిరంజీవి లీలాధర్, చిరంజీవి గాయత్రీ నాగ, సాయిరాం, సాయి లక్షి గాయత్రీ, శ్రీ రామ్ చందర్, శ్రీ ప్రభాకర్, శ్రీ వెంకటేశ్వర్లు నాయుడు, శ్రీమతి శైలేశ్వరి, శ్రీమతి కల్పనా, శ్రీమతి ఇందిరా, శ్రీమతి జ్యోతి విశ్వకర్మ, శ్రీ నాగేశ్వర రావు విశ్వకర్మ, రతిరావు పాటిల్, సుధాకర్ పాటిల్, శివా, సతీష్, సతీష్ భార్య, పిల్లలు, శ్రీ అరవిండ్, శ్రీమతి అరుణ, శైలేశ్వరి గారి జాయింట్ ఫామిలీ మెంబెర్స్, 10 మెంబెర్స్, అందరు పాల్గొన్నారు. వేదం తో ప్రారంభమై, పాల్గొన్న, భజన వచ్చిన ప్రతిఒక్కరికి, పాడుటకు అవకాశం లభించింది. అందరు స్వామితో భజన పాడుకుంటూ సంభాషించుకొన్నారు. చివరగా వినాయక చవితి సందేశమును సమితి కన్వీనర్ చదివి విపులముగా చిన్న పిల్లలకు కూడా అర్ధమయ్యే రీతిలో అనేక ఉదాహారణలతో, ఈశ్వర కుటుంబము - ఐకమత్యాన్ని ప్రభోదిస్తున్న విశ్వకుటుంబము గూర్చి తెలియ జేసిన అనంతరము స్వామి 94వ జన్మ దినోత్సవం సందర్భముగా మనము పాటించవలసిన దీక్షలను వివరించిన తరువాత సెప్టెంబర్ 2019 లో జరిగే అనేక కార్యక్రమాల గూర్చి తెలియ జేశారు.
ఈ వినాయక చవితి స్పెషల్ భజనలో తీసిన వీడియో చూడాలనుకుంటున్నారా ? ఆలస్యం దేనికి క్రింద నున్న లింక్ ను నొక్కండి.
https://youtu.be/UJShIcytz_A
పి. విశేశ్వర శాస్త్రి.
Subscribe to:
Posts (Atom)
YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:
SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...
-
Report dated 13-10-2019 ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్య సాయ...
-
ఓం శ్రీ సాయిరాం HIGH SCHOOL SUBJECT. "ఇచ్చుట- క్షమించుట" ఓం శ్రీ సాయిరాం ఈ రోజున ( 11-9-2024) శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిర్...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...