EYE CAMP 15 9 2019 & PRESS CLIPPINGS
ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 15 9 2019 న ఉదయం 9 గంటల 15 నిమిషములకు మంగళ సన్నాయి వాద్యములు, వేద మంత్రముల మధ్య శ్రీ రాందాస్ తేజ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, అసెంబ్లీ విభాగము, మరియు మహంకాళి లక్ష్మీ నరసింహారావు, ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రముఖ కంటి వైద్యులు లిబర్టీ ఆప్షన్స్ ప్రొప్రైటర్ శ్రీ డాక్టర్ ఆదిత్య గారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి, జ్యోతి ప్రకాశనం గావించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాందాస్ తేజ, ACP ASSEMBLY మాట్లాడుతూ, నన్ను ఈనాటి ఈ కార్యక్రమంలో, భాగస్వామిని చేసినందుకు, కోటి సమితి చేస్తున్న వివిధ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, కోటి సమితి సభ్యులకు, సమితి కన్వీనర్ కు, అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, "సర్వేంద్రియానాం నయనం ప్రధానం" కన్ను శరీరములోని అన్ని అంగముల కన్నా, ఎంతో ప్రధానమైంది, అని దాన్ని మనము చాలా అశ్రద్ధ చేస్తున్నామని, దానిని నిరంతరం పనికి వచ్చే విషయాలు పైనే, మనం మన కంటిని జాగ్రత్తగా చూసుకోవాలని , ప్రస్తుతం ఉన్న ఈ మొబైల్ ఫోన్స్ వల్ల, టీవీ, కార్టూన్ చిత్రాల వల్ల పిల్లలు చిన్నప్పటినుంచే, వారికి కళ్ళద్దాల అవసరం ఏర్పడుతుందని, తెలియజేస్తూ, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, వంటి కంటి వైద్య శిబిరాలు ఎంతో అవసరమని, అవసరాన్ని గుర్తించి, కోటి సమితి ఈ సేవను ఎంచుకొని, లబ్ధిదారులను ముందుగానే గుర్తించి వారికి ఐడీ కార్డులను ఇష్యూ చేసి ఎంతో ప్రణాళికతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతోమందికి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నానని అన్నారు, ఈ కార్యక్రమాన్ని భగవాన్ సత్యసాయి బాబా వారి, రానున్న 94వ జన్మ దినోత్సవ సందర్భంగా, నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మొత్తం 91 మంది పేర్లు నమోదు చేసుకొని, పరీక్షలు నిర్వహించుకున్న తరువాత, 66 మందికి, కళ్ళజోళ్ళు ఇచ్చే విధంగా డాక్టర్ గారు వారు నిర్ధారణ చేసినారు, ఇద్దరికీ ఆపరేషన్ అవసరం అని తెలియజేశారు 12 మందికి మందులు రాసి తగిన సూచనలు ఇచ్చారు.
పవిత్ర కార్యక్రమంలో, శ్రీ సత్య సాయి గ్రామ సేవ మహాయజ్ఞం లో భాగంగా, కోటి సమితి దత్తత తీసుకున్న, కట్టెల మండి కి సంబంధించిన గురుమూర్తి దంపతులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు, అదేవిధంగా, కోటి సమితి బాలవికాస్ పిల్లలు కూడా కంటి వైద్య చికిత్స లో పాల్గొన్నారు. ఒకేషనల్ ట్రైనింగ్ టైలరింగ్, శిక్షణ పొందిన వారు శిక్షణ పొందుతున్న వారు వారి బంధువులు అధిక సంఖ్యలో (నిరుపేద వారు) ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. డాక్టర్ కు చూపించుకోవటానికి వేచి వున్నా లబ్దిదాలులకు ఒక అవగాహన కల్పించుటకు, పూర్తి వెలుతురు లో నే చదవ వలెనని, ట్రైన్లో ప్రయాణం చేయు నపుడు, లేక కదులుతున్న వాహనాలలో వున్నపుడు, చదవ కూడదని, కళ్లజోళ్లు తప్పని సరిగా ఉపయోగించాలని, A విటమిన్స్ వున్న పదార్ధములను అంటే అందరికి వీలుఅయ్యే ఆకుకూరలతో ముఖ్యముగా పాలకూర ను ఎక్కువ తీసుకోవాలని,కోటి సమితి, మహిళా యూత్ సభ్యులు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో, కుమారి షాప్ గుప్తా సిద్ధికి, tabassum బేగం, శ్రీమతి చిత్ రూపిని, శ్రీమతి పద్మావతి, సుమతి రాధిక బాల్ కి, శ్రీమతి జ్యోతి తివారి, శ్రీమతి విజయలక్ష్మి, శ్రీ రాము, శ్రీ చక్రధర్, కుమారి ఎం ఆశ్రిత, ప్రమోద్ కుమార్ మహేశ్వరి తదితరులు, ఈ కార్యక్రమంలో తమ అమూల్యమైన సేవలను అందించారు పాల్గొన్నారు.
సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ గావిస్తూ,
Thank you so much swami by giving an opportunity to serve again.I have literally seen that so many people have benifitted from this eye camp.sai ram🙏
ReplyDeleteSairam.
ReplyDelete
ReplyDeleteAnyone can be a hero ..you can too. Learn CPR Save Lives! #WorldHeartDay2019 #KamineniHospitals
Click Here to Learn CPR