Tuesday, November 16, 2021

96th Birthday Celebrations, Press Clippings: and matter.




మార్కండేయ చరిత్ర

పూర్వకాలంలో మృకండుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణయందు ఆయన, ఆయన భార్యయైన మరుద్వతి ఇద్దరూ కూడా బహుశ్రద్ధ, పూనిక ఉన్నవారు. వీళ్ళిద్దరూ హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక ఆశ్రమమును నిర్మించుకుని తల్లిదండ్రులతో, శిష్యులతో అక్కడ నివసిస్తున్నారు. ఆవులనన్నిటినీ చేరదీసి కాపాడుతూ ఆ ఆవుపాలతో శివార్చన చేస్తూ ఆయన ఈలోకమునందు ప్రకాశిస్తున్నాడు. మరుద్వతి ఎంతో సంతోషంతో అత్తమామలకు సేవ చేసేది. భర్తను సేవించేది. శిష్యులను తల్లిలా కాపాడేది. వాళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో తమ జీవితమును పండించుకుని అందరికీ కామధేనువై, కల్పవృక్షమై తమ జీవితమును నడుపుతున్నా వారికి బిడ్డలు కలుగలేదు. వారు శివార్చన మాత్రం మానలేదు. ఈశ్వరుడిస్తాడని పూనికతో వారు శివార్చన చేస్తున్నారు.
ఒకరోజు మృకండుడు బ్రహ్మ ఉండే అంతఃపుర ప్రదేశమునకు వెళ్ళి బ్రహ్మగారి సభలోనికి ప్రవేశించడం కోసం మిగిలిన ఋషులతో పాటుగా లోపలికి వెడుతున్నాడు. ఆయనను ద్వారపాలకులు మీరు వెళ్ళకూడదని అడ్డుపెట్టారు. ఆయన ఆశ్చర్యపోయి ‘నేను ఎందుకు వెళ్ళకూడదు?” అని ప్రశ్నించారు. ‘మీకు సంతానం లేదు. అందువల్ల మీకు బ్రహ్మ సభా ప్రవేశార్హత లేదు’ అన్నారు. మృకండుని అవమానించడం వారి ఉద్దేశం కాదు. శాస్త్రవాక్కు ఒకటి ఉన్నది. సంతానం లేకపోతే పితృ ఋణం తీరదు. ఎవరయినా వివాహం చేసుకోక బ్రహ్మచర్యంలోనే ఉండిపోతే ఇలాంటి బిడ్డలను కన్నారు కాబట్టి అని ఆ బిడ్డల తల్లిదండ్రులను తిరగేసి చెట్లకు కట్టేస్తారు. దేవీ భాగవతంలో దీనికి సంబంధించి ఒక కథ ఉన్నది. అందుకే నేను పెళ్లి చేసుకోను అనరాదు. చేసుకుని తీరాలి. మృకండునికి పితృఋణం తీరలేదు అది దోషం. మృకండు మహర్షి ధర్మ సూక్ష్మం తెలిసిన ఉన్నవాడు. ‘నాకు అనపత్య దోషం ఉన్నది’ అని మనస్సులో కొంచెం బాధపడుతూ ‘ నన్ను ఎందుకు ఈశ్వరుడు పితృ ఋణం నుంచి విముక్తుడిని చేయలేదు’ అని బెంగ పెట్టుకుని తిరిగి వచ్చేస్తున్నాడు. అదే సమయంలో వేరొక ప్రదేశంలో ఉండే మహర్షుల భార్యలు అక్కడి ప్రదేశంలో ఉండే తపోవనములను దర్శించడం కోసమని వచ్చారు. వారు మరుద్వతిని చూసి చాలా సంతసించి ‘అమ్మా! మేము చాలా దూర ప్రాంతంనుంచి ఇక్కడ ప్రదేశములను చూడడానికి వచ్చాము. మాకు కొంచెం దేవతార్చనకు అవకాశం ఇవ్వగలవా’ అని అడిగితే ఆవిడ మీరందరూ తప్పకుండా రండి’ అని వారందరినీ పిలిచి పంచభక్ష్య పరమాన్నాలతో చక్కటి భోజనం తయారుచేసి వాళ్ళకి భోజనం వడ్డించింది. వాళ్ళు ‘అమ్మా! అలా మేము ఒక్కళ్ళం భోజనం చేయము. మేమూ తల్లులమే కదా! నీ బిడ్డలను పిలు. నీ బిడ్డలు కూడా ఇక్కడ కూర్చుంటే మేము నివేదన చేసుకుని స్వీకరిస్తూ తత్ప్రసాదమును వారి చేతిలో కూడా ఉంచుతాము. ఆ పిల్లలతో కలిసి తినాలని మాకు కోరికగా ఉన్నది. నీ బిడ్డలను పిలువవలసినది’ అన్నారు. మరుద్వతి ‘అమ్మా! నేను తక్కువ నోములు నోచాను. నా నోములు ఫలించలేదు. నాకు బిడ్డలు లేరు. మీవంటి తపస్వినులు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో అన్నం తిన్న పుణ్యం చేత నాకడుపు పండుతుందని అనుకుంటున్నాను. దయచేసి స్వీకరించండి’ అన్నది. వాళ్ళు ‘అమ్మా! ఏమీ అనుకోవద్దు. పురుషుడు పితృ ఋణం తీరడం కోసమే సంతానమును అపేక్షించే క్షేత్రముగా భార్యను స్వీకరిస్తున్నాడు. మీరు గృహస్థాశ్రమంలో ఎందుకు ప్రవేశించారో తత్ఫలాన్ని ఇప్పటికీ పొందలేక పోయారు. అలా బిడ్డలు లేని ఇంట మేము భోజనం చేయము’ అని చెప్పి వారు వెళ్ళిపోయారు. మరుద్వతి ఎంతో బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంది. ఆసమయంలో మృకండు మహర్షి కూడా బాధపడుతూ ఇంటికి వచ్చాడు. ఆయన భార్యను నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అని అడిగితే జరిగిన విషయం చెప్పింది. ఆయన కన్నుల కూడా నీరు కారింది. సంతానం కలుగకుండా గల దోషం పరిహరింప బడడం ఈశ్వరానుగ్రహంగా ఉంటుంది. ప్రత్యేకించి సుబ్రహ్మణ్యుని అనుగ్రహం మీదనే వంశవృద్ధి ఆధారపడి ఉంటుందని శాస్త్రవాక్కు. అందుకే సుబ్రహ్మణ్యారాదన అంత గొప్పది. ఆయన పూజ తద్దోషమును పరిహరిస్తుంది. మృకండుడు “ మరుద్వతీ, ఏక కారణమునకు ఇద్దరమూ గురయ్యాము. నువ్వు బాధపడకు. ఈశ్వరుడు ఉన్నాడు. నేను ఆయన గూర్చి తపస్సు చేస్తాను బయలుదేరుతున్నాను” అని నీ తపస్సు చేసుకోవడం కోసమని బయలుదేరి ఒక మారేడు వనమునందు శివలింగమును ప్రతిష్ఠించి దానికి రోజూ అర్చన చేస్తూ తపస్సు చేస్తున్నాడు. మరుద్వతి తపస్సు చేస్తున్న భర్త గారికి అన్నీ అందిస్తూ ఆయన క్షేమమును విచారిస్తూ తాను కూడా ఖాళీ సమయంలో పరమేశ్వరారాధన చేస్తోంది. వీరిద్దరూ ఇలా తపస్సు చేస్తున్నా శంకరుడు ప్రత్యక్షం అవలేదు.
నారదమహర్షి కైలాసమునకు వెళ్ళి శంకరుని చూసి ‘తండ్రీ! నిన్ను నమ్మి ఆ దంపతులిద్దరూ తపస్సు చేస్తున్నారు. ఇలా పిలిస్తే పలికేవాడివి. వారినింకా ఎన్నాళ్ళు పరీక్షిస్తారు’ అన్నాడు. శంకరుడు మహర్షికి ప్రత్యక్షమై నీకు పదహారేళ్ళ వయసు ఉండే కుమారుడు జన్మిస్తాడని వరమిచ్చాడు. కుమారుడు పుట్టాడు. మార్కండేయుడని పేరు. ఆ దంపతులు, కుమారుడు కూడా పరమేశ్వర భక్తితో కాలం గడుపుతున్నారు. ఇలా గడిపేస్తుండగా ఒకరోజు నారదమహర్షి అక్కడికి వచ్చారు. మృకండు దంపతులు మహర్షికి అర్ఘ్యపాద్యాదులు సమర్పించారు. నారదుడు మృకండునితో ‘మృకండా! నీకు ఒక్క విషయం జ్ఞాపకం ఉందా? ఈ పిల్లవానికి పదిహేనవ సంవత్సరం వెళ్లి పదహారవ సంవత్సరం వచ్చింది. అది కూడా కొద్ది రోజులలో అయిపోబోతోంది. ఆనాడే ఉపద్రవం కూడా వచ్చేస్తుంది. ఇలాంటి పిల్లవాడికి ఏదయినా జరగరానిది జరిగితే మీరు తట్టుకోగలరా! ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపోతోంది కదా’ అన్నాడు. నారదుడు ఈమాటలు చెప్పగానే మరుద్వతి ఏడుస్తోంది. ఇంత తపో నిష్ఠా గరిష్టుడయిన మృకండుడు కూడా దుఃఖమును ఓర్చుకోలేక క్రిందపడి దొర్లి ఏడుస్తున్నాడు. ఇంతలో మార్కండేయుడు గబగబా లోపలికి వచ్ఛి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు. వాళ్ళు ఉన్న సత్యమును ఎరుకలో పెట్టారు. పిల్లవాడు మాత్రం ఏ విచారము లేకుండా నవ్వుతూ నిలబడి ఉన్నాడు. నారదుడు వాడి భక్తి, విశ్వాసం, ధృతి, ధైర్యం చూసారా! మీరు ఏ తపస్సు చేస్తే వాడు పుట్టాడో ఇప్పుడు వాడే తపించగల శక్తితో ఉన్నాడు. శివుడున్నాడు, రక్షించి తీరుతాడనే పూనికతో ఉన్నాడు. మీరు కూడా శివార్చనను పెంచండి. తపస్సు మొదలుపెట్టండి. మొట్టమొదట వీనిని హిమాలయ పర్వత ప్రాంతములకు పంపించి వీనిని అక్కడ కూర్చోపెట్టి తపస్సు చేయమని చెప్పండి. ఏ శంకరుడు వీనిని ఇచ్చాడో ఆ శంకరుడు వీడిని రక్షిస్తాడో రక్షించడో తేలిపోతుంది. పిల్లాడిని పంపండి’ అన్నాడు. మార్కండేయుడు “నన్ను అనుమతించండి. నేను దీర్ఘాయుష్మంతుడిని అవ్వాలని ఆశీర్వచనం చేయండి. శంకరుని గూర్చి తపస్సు చేస్తాను. నాకు ఆ మహానుభావుడు సిద్ధిని ఇస్తాడు. మీరేమీ బెంగ పెట్టుకోకండి’ అని చెప్పి పిల్లవాడు వెళ్ళిపోయాడు. అలా వెళ్లి హిమాలయ ప్రాంతమందు ఒక శివలింగమును తయారు చేసి దానికి చిన్న దేవాలయం లాంటిది నిర్మించి అక్కడ కూర్చుని తపస్సు మొదలు పెట్టాడు.
సమయం ఆసన్నమయింది. యమలోకంలో యమ ధర్మరాజు దూతలను పిలిచి మార్కండేయుడిని పాశములచేత బంధించి ఈ లోకమును చేర్చండి’ అని చెప్పాడు. యమదూతలు వెళ్లి పాశం వెయ్యడానికి భయం వేసి యమలోకానికి తిరిగి వెళ్ళిపోయారు. యమధర్మరాజుకు ఎక్కడలేని కోపం వచ్చి నేను బయలుదేరి వెడతాను. నాకు ఏ మగాడు అడ్డు వస్తాడో చూస్తాను’ అని బయలుదేరుతుండగా నారదుడు ఎదురు వచ్చాడు. మహర్షిని చూసి యమధర్మరాజు నమస్కారం చేశాడు. నారదుడు ‘ఎందుకయ్యా పంతాలు పట్టింపులు. వాళ్లకి ఉన్నది ఒక్క పిల్లాడు. మహర్షి కదా! పుత్రభిక్ష పెట్టిన వాడవు అవుతావు కదా! అన్నాడు. నారదుడు ఇలా అనేసరికి యమధర్మరాజుకి కోపం వచ్చేసింది. ప్రాణములు తీసి తీరతాను అని దేవాలయం దగ్గరకు వెళ్ళాడు. అతనిని బహిర్ముఖుని చేస్తే సరిపోతుంది అనుకుని బయటకు రా నేను యమధర్మరాజుని నీ ప్రాణములు తీయడానికి వచ్చాను. అదే నీకు మోక్షము. బయటకు రా’ అంటే మార్కండేయుడు ‘ఓరి పిచ్చివాడా! నీకుకూడా ప్రభువెవడో వానిని నేను ఆరాధన చేస్తున్నాను. నేను ఈ శరీరంతో ఉండిపోవాలని కాదు. నా తల్లిదండ్రుల కోర్కె తీర్చడానికి ఈ శరీరంలో ఉండాలనుకుంటున్నాను. అలా ఉండేటట్లు చేయమని పరమశివుని ప్రార్థిస్తున్నాను. నేను ఆయనను ఆరాధన చేస్తుండగా ఫలితం ఆయన ఇవ్వాలి తప్ప ఇవ్వడానికి నువ్వెవరు? నీకు చేతనయితే ప్రాణాలు తియ్యి’ అన్నాడు. యమధర్మరాజు గారికి ఎక్కడలేని కోపం వచ్చి చేతిలో మెరిసిపోతున్న యమపాశమును విసిరి లాగుతున్నాడు. పిల్లవాడు భయపడకుండా శివలింగమును కౌగలించుకుని చంద్రశేఖరునిపై అష్టకం చదువుతున్నాడు. అలా కౌగలించుకోవడంలో కంఠమునకు పడిన పాశం శివలింగమునకు తగిలింది. అంతే ఒక్కసారి శివలింగం ఫెటిల్లున పేలి, వామార్ధ భాగమునందు పార్వతీ దేవితో శంకరుడు ఆవిర్భవించి తన ఎడమకాలి పాదంతో యమధర్మరాజు వక్షస్థలం పై ఒక్క తన్ను తన్నేటప్పటికి యమధర్మరాజు నేలపై విరుచుకు పడిపోయాడు. శివుడు తన చేతిలోని త్రిశూలంతో ఒక పోటు పొడిస్తే యముడు మరణించాడు. పిమ్మట మార్కండేయుని వంక ప్రసన్నుడై చూశాడు. ఒక్కవరం కోరుకో అన్నాడు.
మార్కండేయుడు ఇరువురికీ నమస్కరించి నేను ఏ కోరిక కోరను? పాపం యముడు తెలియక పొరపాటు చేశాడు. ఆయనను బ్రతికించండి’ అన్నాడు. శంకరుడు ప్రసన్నుడై చూడగా యమధర్మరాజు మళ్ళీ లేచి నమస్కరించి “స్వామీ! నువ్వు వరం ఇచ్చినప్పుడు ఈ బాలుడికి పదహారు సంవత్సరములు ఆయుర్దాయం మాత్రమే ఉంటుందని చెప్పావు. నేను చేసిన దోషం ఏమిటి? చెప్పవలసింది’ అన్నాడు. శివుడు మందహాసం చేసి నా హృదయం నీకు అర్థం కాకపోవడమే నీ దోషం. ఎప్పుడూ పదహారేళ్ళు వయస్సు ఉండే పిల్లవాడిని నేను వాళ్లకి ఇచ్చాను. నువ్వు పదహారేళ్ళే అర్థం చేసుకున్నావు. అందుకని ఇలా జరిగింది ఏమీ బెంగలేదు. వెళ్ళు’ అన్నాడు. మార్కండేయుడిని చూసి పార్వతీదేవి పొంగిపోయి భర్తకి వీడికి మంచి వరమును ఇవ్వవలసిందని చెప్పింది. పరమేశ్వరుడు ‘ఈ లోకములు అన్నీ ఎప్పుడు ప్రళయ సముద్రంలో మునిగిపోతాయో, ఎప్పుడు వటపత్రశాయి తన బొటనవేలిని నోటిలో పెటుకుని చీకుతూ ఒక మర్రి ఆకుమీద పడుకుంటాడో అప్పటి వరకు చిరంజీవివై ఉండి మార్కండేయాయుష్షు అనే కొత్త ఆయుష్షును సృష్టించి నీకు ఇస్తున్నాను అన్నాడు. పూర్వం పిల్లలకు నీళ్ళు పోస్తే నాన్నా! నీకు మార్కండేయ ఆయుష్షురా’ అనేవారు. అలా రోజూ అంటూ నీళ్ళు పోస్తే ఆ ఆశీర్వచనం నిజమౌతుందని వారి ఉద్దేశం. పరమేశ్వరుడు
ఎక్కడైనా సరే శివాలయంలో కూర్చుని ఒంట్లో బాగుండని వారు చంద్రశేఖర అష్టకమును నామీద నమ్మకంతో చదివితే వాళ్లకి అపమృత్యుదోషం రాకుండా నేను పరిహరిస్తాను. వారిని నేను రక్షించి తీరుతాను అంటాడు. చంద్రశేఖరాష్టకం అంత గొప్పది. ఎవరయితే ఈ చంద్రశేఖరాష్టకమును నమ్ముకుని ప్రతిరోజూ ఇంట్లో చదువుకుంటారో అలాంటి వాళ్ళ ఇళ్ళలోంచి అకారణంగా, సమయం కాకుండా అపమృత్యు దోషం వలన బయటికి శరీరములు వెళ్ళవలసిన అవసరం లేకుండా నేను వాళ్ళని వాళ్ళ వంశములను కాపాడతాను. ఇది చదివిన వారికి దీనిని విన్న వారికి అపారమయిన కీర్తిని తేజస్సుని ఆయుర్దాయం నేను కృప చేస్తున్నాను. ఈ అష్టకం ఎక్కడ చదువుతున్నారో అక్కడ అంతా శుభం జరుగుతుంది అన్నాడు. ఎవరు నమ్మకంతో రోజూ శివుని సన్నిధానమునందు మృత్యు భీతితో ఈ అష్టకమును పూనికతో చదువుతున్నారో అటువంటి వారికి మృత్యు భయం ఉండదు. ఆపదలు రాకుండా పూర్ణమయిన ఆయుర్దాయం వాళ్ళు పొందుతారు. దానితో బాటుగా అఖిలమయిన అర్థములు, యశస్సు, సంపత్తి అన్నీ చేకూరుతాయి. వీరి ప్రయత్నం లేకుండా చిట్టచివరి రోజున చంద్రశేఖరాష్టకం చదివిన ఫలితం చేత ఊపిరి జారిపోతున్నప్పుడు శంకరుని నామం జ్ఞాపకమునకు వచ్చి చంద్రశేఖరా అంటూ ప్రాణం విడిచి ఆయన చేతనే మోక్షం ఇవ్వబడి ఆయనలోనే కలిసిపోతాడు. అంత గొప్ప అష్టకంతో కూడిన ఈ మార్కండేయ మహర్షి జీవితమును ప్రత్యేకించి మాఘమాసంలో ఎవరు చదువుతున్నారో/వింటున్నారో వారికి పరిపూర్ణమయిన శివకటాక్షం కలుగుతుందని శివపురాణాంతర్గతమయిన వాక్కు.











21ST NOVEMBER 4TH DAY PRESS CLIPPINGS 











96TH BIRTHDAY CELEBRATIONS OF BHAGAVAN SRI SATHYA SAI BABA,  SIVAM, HYDERABAD DT 20-11-2021 -  3RD DAY. DOCTORS DAY 

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి  దివ్య ఆశీస్సులతో   “ శ్రీ సత్యసాయి భగవానుని  96వ జన్మ దిన వేడుకలలో భాగంగా  ”  20  నవంబర్, 2021   హైదరాబాద్ విద్యానగర్  లో గల  శివమ్ మందిరంలో  ఈ నాటి  3వ రోజు  డాక్టర్స్ డే  వేడుకల్లో భాగంగా, ఉదయం ఓంకారం, సుప్రభాతం, నారాయణసేవ, ఎంతో భక్తి శ్రద్ధలతో, జరిగినది. 

ఈనాటి డాక్టర్స్ డే, 3వ రోజు  కార్యక్రమానికి, జ్యోతి ప్రకాశం గావించిన వారుస్టేట్ మెడికల్ కో-ఆర్డినేటర్జి భాస్కరరావు, హైదరాబాద్ జిల్లామెడికల్ కో-ఆర్డినేటర్  డాక్టర్ కే రాంబాబు, స్వామి చిర కాల భక్తులు  డాక్టర్ M అనిల్ కుమార్, డాక్టర్ అనురాధ గారు, స్టేట్ మొబైల్ మెడికల్ కో-ఆర్డినేటర్  శ్రీ దత్త ప్రసాద్, జ్యోతి ప్రకాశం అనంతరం,

హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, A మల్లేశ్వరరావు, స్వాగత వచనాలు పలుకుతూ, ప్రపంచవ్యాప్తంగా, మానవాళికి  సేవలందిస్తున్న, ఈ డాక్టర్స్, ధన్వంతరి స్వరూపులుగా, అభివర్ణిస్తూ, కోవిద్ క్లిష్ట సమయాల్లో, వీరు అందించిన సేవలు, ఎంతో అమూల్యమైన అని, వారి, సంక్షేమాన్ని, వారికి గౌరవార్ధం, మరియు పారామెడికల్ స్టాప్ కు, మరియు హైదరాబాద్ లో వివిధ సమితులలో క్లీనిక్ లలో సేవలందిస్తున్న డాక్టర్లుకు,  స్వామివారి జన్మ దినోత్సవ వేడుకల్లో భాగంగా, ఈ రోజును, 20 11 2021 వీరికి, అంకితం ఇవ్వాలని, ఈ కార్యక్రమాన్ని రూపొందించామని తెలియజేశారు.

కోవిద్ క్లిష్ట సమయాల్లో టెలిమెడిసిన్ ద్వారా వైద్య సేవలను అందించే సౌకర్యము కలుగ జేయు నిమిత్తముశ్రీ  సత్య సాయి ప్రాణ మిత్రపేరిట 29-8-2020 శ్రీకారం చుట్టి, 60  మంది డాక్టర్స్ బృందంగా ఏర్పడి, అనేక మంది భక్తులకు వైద్య సేవలు అందించి, వారికీ, వైద్యము తో పాటు, ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, పెంపొందించే దిశగా, ఈ డాక్టర్స్ బృందం, ఎంతగానో, కృషి చేస్తున్నారని, ఈ రోజు వరకు 3000 మందికి పైగా వైద్య సేవలను అందించారన్నారు 

హైదరాబాద్ జిల్లా శ్రీ సత్య సాయి  మెడికల్  సర్వీసెస్, వార్షిక రిపోర్ట్ వీడియో ప్రెసెంటేషన్ ద్వారా వివరించిన తదుపరి,

ఈ నాటి సంగీత విభావరి కార్యక్రమాన్ని కూడా, “ వైద్య నాదంఅని నామకరణం  చేసి, ముఖ్య గాయకులంతా డాక్టర్స్ కావడం విశేషం.

డాక్టర్  బంటీ, డాక్టర్ జి వి సుబ్రహ్మణ్యం గానం రచించిన ముంగిలి లో నిలిచితివా, ముసి ముసి నవ్వుల స్వామి, డాక్టర్ సుజాత, ఆలపించిన శ్రీ కృష్ణ గోవిందా హరే మురారి, డాక్టర్ రాచర్ల రాధాకృష్ణ ఆలపించిన అన్నమాచర్య సంకీర్తనబ్రహ్మ మొక్కటే పరబ్రహ మొక్కటేడాక్టర్ శ్రీకాంత్, ఆలపించిన హర హర శంకర అనే పాటలు భగవానుడు నడయాడిన శివమ్ మందిర ప్రాంగణంలో  అందరిని, మంత్రముగ్దులను గావించారు. 

సంగీత విభావరి కొనసాగుతుండగా,బిగ్ స్క్రీన్ పై బాబా వారి, పాటకు సేరిపోయే ఫొటోస్  వీడియోస్ చూసి మరింత భక్తి లో లీనమైనారు.

చివరగా డాక్టర్  బంటీ బృందం  స్వామి ని ప్రార్ధిస్తూ, సమస్తలోకా సుఖినోభవంతు అనే ప్రార్ధనతో, సత్య సాయి భగవానునికి  ఇష్టమైన, పాట, గతంలో   ప్రఖ్యాత గాయకుడు 1955 లో సీమ  అనే చిత్రానికి గానం చేసిన  “టు ప్యారాక సాగర్ హై తేరి ఏ బూంద్ కె ప్యాసే హమ్ అనే పాటతో, వైద్య నాదం సంగీత విభావరిని  సంపూర్ణ మైనది. 

గంటన్నర సేపు సాగిన  డాక్టర్  బంటీ బృందం కచేరీకి, టాబ్లపై  వెంకట శ్రీనివాస్,   కీ బోర్డు పై శ్రీ గురుప్రసాద్ O , ఫ్లూట్ పై శ్రీ ప్రమోద్ శర్మ , పాడ్స్ పై సతీష్,   వాద్య సహకారాన్ని అత్యాద్భుతముగా, అందించారు. 

వైద్య నాదం బృందం  కళాకారులందరిని, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, శివమ్, హైదరాబాద్ కార్య వర్గ సభ్యులు స్వామి వారి ప్రేమను జ్ఞ్యాపికల ద్వారా ఘనంగా బహకరించారు. 

వందన సమర్పణ గావిస్తూ, ఈ నాటి డాక్టర్స్ డే  కార్యక్రమాన్ని దిగ్విజయం జరిపించిన స్వామి హృదయ పూర్వక కృతజ్య్నాతలు తెలియజేసికుంటూ

రేపటి రోజును బాలవికాస్ డే గా  పరిగణిస్తున్నామని, శ్రీ పృథ్వీ రాజ్ & బృందం శ్రీ సత్య సాయి మిర్పూరి కాలేజీ అఫ్ మ్యూజిక్ వారి సంగీత సమర్పణ ఉంటుందని తెలియజేయగా,

స్వామి వారికి  హైదరాబాద్ జిల్లామెడికల్ కో-ఆర్డినేటర్  డాక్టర్ కే రాంబాబు,  మంగళ హారతి తో ఈ నాటి మూడవ  రోజు డాక్టర్స్ డే కార్యక్రమము దిగ్విజయముగా సంపూర్ణమైనది. 



19TH PRESS CLIPPINGS 






96TH BIRTHDAY CELEBRATIONS OF BHAGAVAN SRI SATHYA SAI BABA,  SIVAM, HYDERABAD DT 19-11-2021 

2ND DAY. 

 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి  దివ్య ఆశీస్సులతో   “ శ్రీ సత్యసాయి భగవానుని  96వ జన్మ దిన వేడుకలలో భాగంగా  ”  19  నవంబర్, 2021   హైదరాబాద్ విద్యానగర్  లో గల  శివమ్ మందిరంలో  ఈ నాటి రెండవ  రోజు.  మహిళాదినోత్సవ  వేడుకల్లో భాగంగా, ఉదయం ఓంకారం, సుప్రభాతం, లలిత సహస్రనామ పారాయణం నారాయణసేవ, ఎంతో భక్తి శ్రద్ధలతో, జరిగినది. 

ఈ నాటి కార్యక్రమములో అందరు మహిళలే కావడం విశేషం. 

 సాయంత్రం కార్యక్రమములో భాగంగా, జ్యోతి ప్రకాశనంతరంహైదరాబాద్   జిల్లా లో నిర్వహించిన  మహిళా విభాగంలో నిర్వహించిన అనేక సేవ కార్యక్రమాలను వార్షిక రిపోర్ట్ వీడియో ప్రెసెంటేషన్ ద్వారా వివరించగా

 ఈ నాటి సంగీత విభావరి కార్యక్రమములో, పూర్వ ఉప కులపతి,తెలుగు యూనివర్సిటీ, డాక్టర్ జి వి సుబ్రహమణ్యం  మనుమరాలు, ప్రఖ్యాత గాయని శ్రీమతి సౌమ్య వారణాసి మరియు వారి బృందం సంగీత విభావరి లో హంసధ్వని రాగం ఆదితాళం లో తుంగ తరంగ, తులసి దాస్ రచనతో, ప్రారంభిచారు. త్యాగరాజ స్వామి కీర్తనలను, మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు స్వరపరిచిన హనుమ అనుమా సరసాంగి రాగంలో ఆది తాళంలొ, శ్రావ్యమైన గళంలో పాడి మరియు సత్యసాయి భజనలను  , అందరి మన్నలను పొందినారు. 

 చివరగా ఉయ్యాలా లూగుమా శ్రీ సత్య సాయి అనే పాటతో,సంగీత విభావరి ని  ముగించారు. 

 గంటన్నర సేపు సాగిన  శ్రీ సౌమ్య గాత్ర కచేరీకి, టాబ్లపై  శ్రీ జై కుమార్ ఆచార్య, కీ బోర్డు పై శ్రీ గురుప్రసాద్ ఓ, ఫ్లూట్ పై శ్రీ ప్రమోద్ ఉమాపతి, తంబురా పై శ్రీ సంజన శ్రీనివాసన్ వాద్య సహకారాన్ని అత్యాద్భుతముగా, అందించారు. 

 కళాకారులందరిని, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, శివమ్, హైదరాబాద్ కార్య వర్గ సభ్యులు స్వామి వారి ప్రేమను జ్ఞ్యాపికల ద్వారా ఘనంగా బహకరించారు. 

 కుమారి  జాహ్నవి  వందన సమర్పణ గావిస్తూ, ఈ నాటి మహిళా దినోత్సవంలో ప్రతి కార్యక్రమాన్ని మహిళలే నిర్వహించారని తెలుగజేస్తూ, రేపటి రోజును డాక్టర్స్ డే గా పరిగణిస్తున్నామని, వైద్య నాదం పేరిట - డాక్టర్ బంటీ మరియు వారి బృందం సంగీత సమర్పణ ఉంటుందని తెలియజేస్తూ, స్వామి వారికి మంగళ హారతి తో ఈ నాటి రెండవ రోజు మహిళాదినోత్సవ కార్యక్రమము దిగ్విజయముగా సంపూర్ణమైనది. 






 18-11-2021 REPORT

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి  దివ్య ఆశిస్సులతో  “ సత్యసాయి భగవానుని  96వ జన్మ దిన వేడుకలలో భాగంగా  ”  18 నవంబర్, 2021   హైదరాబాద్ విద్యానగర్  లో గల  శివమ్ మందిరంలో  ఈ నాటి మొదటి రోజు.  యువజనోత్సవం  వేడుకల్లో భాగంగా, 16 సమితులు, పల్లకి ఊరేగింపు శివమ్ నుండి ప్రారంభమై, అయ్యప్ప స్వామి మందిరం, రెడ్ బిల్డింగ్, నుండి షిరిడి సాయి బాబా మందిరం చేరుతూ, సాయి నామము తో మారు మ్రోగింది. ప్రతి పల్లకిని, ఆయా సమితి సభ్యులు  ఎంతో, అందంగా, రంగు రంగుల పుష్పాలతో అలంకరించించుకొని స్వామి పై గల భక్తిని ప్రకటించుకున్నారు. 

16 సమితులు యూత్ మహిళలు స్వామి పల్లకి ఊరేగింపు కుప్రశాంతి పతకంతో  పైలెట్ గా 50 మంది ద్విచక్ర వాహనములపై స్వామి వారి వాక్య విభూతి ప్లై కార్డ్స్, అందరిని ఆకర్షించాయి. సభ్యులంతా శ్వేత వస్త్రములు ధరించి, స్ట్రాప్స్ ధరించి,16 సమితులు సభ్యులు , సేవాదళ్ సుభభ్యులు యూత్ పాల్గొన్నారు. సమితి  భజన బృందం, భజనలు పాడుకుంటూ, ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడ్డ వాహనములో ఆసీనులై భజనలను ఎంతో శ్రావ్యముగా ఆలపించారు. 

హైదరాబాద్ జిల్లా  అధ్యక్షులు శ్రీ ఏ మల్లేశ్వర రావు, బర్త్డే వేడుకలను ప్రారంభ సూచనగా పల్లకీల ఊరేగింపు అనంతరం, అనంతపూర్ పూర్వ  మహిళా కళాశాల విద్యార్థులు ట్రంపెట్ వాయిదాయంతో వందన సమర్పణ గావించారు. 

ఈ సందర్భంలో ప్రశాంతి పతాకం ఎగురవేస్తున్న వేళ, ప్రశాంతి పతాక విశిష్ట ను తెలియ చేసే పాటను, అదిగదిగో ఎగురుతోంది సత్యసాయి పతాకం పంచ మత పతాకం, అనే పాటను హైదరాబాద్ జిల్లా స్పిరిట్యుయల్ కో-ఆర్డినేటర్ పాడుతూ అందరి తో పాడిస్తూవుండగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు   పతాకావిష్కరణ గావించారు. 

హైదరాబాద్ జిల్లా  అధ్యక్షులు, స్వామివారికి మంగళ హారతితో కార్యక్రమము ఉదయపు కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. 

వేదం, భజన, అనంతరం, హైదరాబాద్ జిల్లా   అధ్యక్షులు శ్రీ ఏ మల్లేశ్వర రావు, స్వాగత వచనాలు, పలుకుతూ, జరిగిన, జరుగబోయే కార్యక్రామాలు విశదీకరించారు.  

అనంతరం SRI H J DORA గారు మాట్లాడుతూ, కోవిద్ పాండమిక్  రోజులలో, చేసిన యూత్ విభాగ యువత చేసిన సేవలను కొనియాడారు. 

హైదరాబాద్ డిస్ట్రిక్ట్ యూత్ కో-ఆర్డినేటర్  శ్రీ సంతోష్ రిపోర్ట్ పవర్పాయింట్ ద్వారా టేకుయజేసారు. 

ఈనాటి సాయంత్ర కార్యక్రమము లో భాగంగాప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ముత్తు కుమార్ మరియు వారి బృందం, కార్తీకమణి - డ్రమ్స్, అమీత్ నాదిగ్ కీ బోర్డు, ఫ్లూట్ మరియు తబలా పై ముత్తుకుమార్  వివేక్ సంతోష్.  అద్భుతముగా వారి సంగీత వాదములలో వారికున్న ప్రతిభను కనబరిచి,వారు స్వర పరచిన సాంగ్స్, ను కొన్ని సత్య సాయి భజనలను వారి వాయిద్యములపై వాయించగాభక్తులు   యెంత గానో ఆనందపరవాసులైనారు. 

సాయంత్రపు కార్యక్రమము మంగళ హారతి తో పరిపూర్ణమైనది.

 

SD//--

HYDERABAD DISTRICT PRESIDENT 






SRI SATHYA SAI SEVA ORGANISATION, SIVAM,

HYDERABAD

PRESS RELEASE dt 17-11-2021

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో, ఈ నెల నవంబర్, 18వ తేది నుండి  నవంబర్, 23 వ తేదీ వరకు శ్రీ సత్య సాయి భగవానుని 96 వ జన్మ దినోత్సవ వేడుకలలో భాగంగాభగవానుడు నడయాడిన  హైదరాబాద్, విద్యానగర్ లో గల శివమ్ మందిర ప్రాగణంలో  ప్రఖ్యాత కళాకారులచే సాంసృతిక కార్యక్రమాలు, అంగరంగ వైభముగా  నిర్వహించబడుచున్నవి.

నవంబర్ 18న యువజనోత్సవంలో భాగంగా, స్వామి పూర్వ  విద్యార్థులచే శ్రీ ముత్తు కుమార్ మరియు వారి బృందంచే  “మిస్టిక్ వైబ్స్సంగీత వాద్య కార్యక్రమము 

నవంబర్ 19 న మహిళాదినోత్సవ వేడుకలలో భాగంగా శ్రీమతి శ్రీ సౌమ్య వారణాసి మరియు బృందం చే  సంగీత విభవారి,  

నవంబర్ 20 , డాక్టర్స్ డే ఉత్సవంలో  భాగంగావైద్య నాదం డాక్టర్ బంటీ బృందంచే సంగీత కార్యక్రమం. 

నవంబర్ 21 , బాలవికాస్ డే ఉత్సవంలో భాగంగా, బాలవికాస్ విద్యార్థులు, మరియు బాలవికాస్ గురువులచే  భజన మెడ్లే, భక్తి సంగీత కార్యక్రమం

శ్రీ సత్య సాయి సంగీత కళాశాల పూర్వ  విద్యార్థులచే సంగీత విభావరి - శ్రీ పృథ్వీ రాజ్ మరియు వారి బృందం. 

నవంబర్, 22 , ఉపాధ్యాయుల ఉత్సవంలో భాగంగా, హరికథా  చూడమణి  శ్రీమతి పురాణం విజయ లక్ష్మి భగవతారిణి గారిచేభక్త మార్కండేయహరికథ కార్యక్రమం

నవంబర్ 23 న శివమ్ భజన బృందం వారిచే, వందనం సత్య సాయీశమ్ సంగీత కార్యక్రమాలు నిర్వహించబడు చున్నవి.

 ఈ రోజు వారి కార్యక్రమములలో వివిధ రంగాల ప్రముఖులు, ముఖ్య అతిధులుగా పాల్గొంటున్నారు.

ప్రతి రోజు ఉదయం 5 గంటలకు నగర సంకీర్తన, అభిషేకం, నారాయణ సేవలు నిర్వహించబడును.  

నవంబర్ 18 న ఉదయం 16 సమితిలచే పల్లకిసేవా, రధోత్సవమును, నవంబర్, 23 న మహానగర సంకీర్తనను నిర్వహించబడును. 

 ప్రతి రోజు సాయంత్రము  కార్యక్రమము 5-30 గంటలకే ప్రారంభము.

మనమంతా అన్ని కార్యక్రమాలలో పాల్గొని, 23న ప్రసాదమును తీసుకొని శ్రీ  సత్య సాయి భగవానుని దివ్య ఆశీస్సులను పొందుదాము.

అందరికి ప్రేమ పూర్వక ఆహ్వానము పలుకుచున్నది కన్వీనర్, శ్రీ సత్య సాయి స్టేట్ ట్రస్ట్, మరియు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులుశ్రీ సత్య సాయి సేవ సంస్థలు, హైదరాబాద్.

 Sd/-

A.M. Rao, Hyderabad District President, Sri Sathya Sai Seva Organisations, Hyderabad.

Invitation attached. 

No comments:

Post a Comment

YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...