Sunday, November 14, 2021

SRI VISHNU SAHASRA NAAMA PARAYANAM STARTING FROM 15-11-2021 - ON EVERY EEKAADASI

                                          దేవుత్తన ఏకాదశి, యోగేశ్వర ద్వాదశి 

                                                       కార్తీకమాసం సోమవారం 

                                                                   15-11-2021

ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, Koti సమితి, హైదరాబాద్ వారిచే చేపట్టిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం సుస్వాగతం.  ముందుగా  విష్ణు సహస్రనామ పారాయణ యొక్క ప్రాధాన్యత గురించి రెండు వాక్యాలు.

భారత మహా సంగ్రామం అనంతరం అంపశయ్యపై ఉండిన భీష్మ పితామహుని ద్వారా శ్రీ కృష్ణ పరమాత్మ ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాండవులకు ఉపదేశం చేయిస్తూ లోకాన్ని తరింప చేసాడు.  మానవునికి మోక్ష సాధనములో భాగంగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చాలా శ్రేష్ఠమైనదిగా చెప్పబడింది.  విశేషించి ఈ కలియుగంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ వలన సులభంగా తరించవచ్చని శ్రీ కృష్ణుని అభిమతం.  

శాస్త్ర ప్రకారం మనకు నక్షత్రాలు ఇరవై ఏడు.  ఒక్కొక్క నక్షత్రానికి అంటే 27 నక్షత్రాల కి నాలుగు శ్లోకాల చొప్పున కేటాయిస్తే 108 శ్లోకాలు అవుతాయి.  మొత్తంగా  పారాయణ చేయలేనివారు ఏ నక్షత్రంలో ఏ పాదానికి చెందినవారు  ఆయా పాద సంఖ్య  శ్లోకాన్ని తెలుసుకుని ఆ ప్రకారం వారు వీలుని బట్టి ఎన్ని సార్లైనా చదువుకోవచ్చు. దీనివల్ల నక్షత్ర పాదదోష నివారణ కూడా జరుగుతుందని చెప్తారు.

ఈ రోజు మనమంతా పుస్తకం దగ్గర ఉంచుకుని పారాయణ ప్రారంభానికి శ్రీకారం చుడదాం. జై సాయిరాం. 




No comments:

Post a Comment

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం  - 2025  GOOGLE FORM: LINK:  TOTAL NO OF CANDIDATES LINK:  ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వా...