Monday, June 27, 2022

ALL INDIA CONVENORS CONFERENCE AT PRASHANTI NILAYAM DT 24TH TO 26TH

 ALL INDIA CONVENORS CONFERENCE AT PRASHANTI NILAYAM DT 24TH TO 26TH JUNE 2022 


Swamy speech 







TORI RADIO LINK. 


ఓం శ్రీ సాయిరాం అఖిల భారత సమితి కన్వీనర్ ల సాధనా శిబిరము  శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, భారత దేశం , 24-26 జూన్ 2022, ప్రశాంతి నిలయం .

 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో,అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా సంస్థల ద్వారా “ భగవానుని దివ్య పదముద్రలను అనుసరిస్తూ మూలముల వైపు పయనం”అను ఇతివృత్తముతో  జూన్ 24  నుండి 26 వరకు ప్రశాంతి నిలయంలో శ్రీవారి దివ్య సన్నిధిలో నిర్వహింపబడిన అఖిల భారత సమితి కన్వీనర్ ల సాధనా శిబిరములో   భారత దేశంలుమూలల నుండి 2000మంది సమితి కన్వీనర్లుపాల్గొని స్వామి వారి దివ్య సందేశముల సారాంశాన్ని , సంస్థ దివ్య నియమావళిని , ఆరు శాశ్వత లక్ష్యములను , సభ్యులు విధిగా పాటించవలసిన నవసూత్ర ప్రవర్తనా నియమావళిని, సంస్థ విధి విధానములను పునశ్చరణ చేసుకొని ఉత్సాహాన్ని నింపుకొని , కార్యోన్ముఖులైనారు.

 24 జూన్ 2022 ఉదయం సాయి కుల్వంత్ సభా మండపము నందుశ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్లచే వేద పఠనంతో ప్రారంభమై, శ్రీ నాగేష్ జి ధాకప్ప మెంబర్ , శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్స్వాగత్వపన్యాసంతో కొనసాగింది .

స్వామి వారు చెప్పిన ప్రతి సభ్యునికి/కన్వీనర్లకిఉండవలసిన ముఖ్యమైన లక్షణములను శ్రీ ధాకప్పవిశదీకరించినారు. ఆసక్తి,ధైర్యం,భక్తి,శక్తి, అన్నిటికీ తయారుగా ఉండుట, చిత్తశుద్ధి కలిగి ఉండాలని చెప్పినారు.సంస్థలో మనం చేసే సమితి కార్యక్రమాలుఆత్మతృప్తి కోసం చేయాలని ,సంస్థల యొక్క గౌరవం తగ్గించకుండా చూసుకోవడం,మనం చేసే తప్పులవల్లసంస్థ పేరుకు భంగం కలగకుండా చూసుకోవాలని తెలిపినారు.

ఆ తర్వాత స్వామి వారి దివ్య ఉపన్యాసం,భజన , మంగళ హారతితో  ప్రారంభోత్సవ కార్యక్రమము ముగిసినది.

అనతరం  శ్రీ సత్యసాయి అంతర్జాతీయ క్రీడా ప్రాంగణం (ఇండోర్ స్టేడియం) నందు ప్లీనరీ సదస్సు 10:40 ని || లకు వేద పఠనం తో ప్రారంభమై శ్రీ చక్రవర్తి , ఛైర్మన్ -శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్, శ్రీ ఆర్ జె రత్నాకర్, మానేజింగ్ ట్రస్టీ శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, శ్రీ నిమీష్ పాండ్య ,అఖిల భారత అధ్యక్షులు ,శ్రీ సత్యసాయి సేవా సంస్థలు,భారతదేశం జ్యోతి ప్రజ్వలన చేసి తర్వాత ప్రశాంతి పతాక ఆవిష్కరణ చేసినారు.

‘భగవానుని దివ్య పద ముద్రలను అనుసరిస్తూ మూలములను బలోపేతం చేయడం - సంస్థ వ్యాప్తి’ అనే అంశం పై శ్రీ నిమీష్పాండ్య,అఖిల భారత అధ్యక్షులు మాట్లాడుతూ . “శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఈ విశ్వంలో ఒక విలక్షణ శక్తిగా అవతరించాయి . సంస్థలు మనలను మనం అభివృద్ది పర్చుకొనుటకు , మన తప్పులను సరిచేసుకొనుటకు ,స్వీయ పరివర్తనకు స్థాపించారు. అన్నీ స్వామి మాత్రమే చేస్తున్నట్టు బావించాలి.

శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు సమితి అత్యంత ప్రధానమైన మరియు ముఖ్యమైన విభాగము.సమితి కన్వీనర్ చాలా ప్రధాన భూమిక పోషించాలి . మానవతా విలువలు ఈ సంస్థకు పునాది. స్వామి చెప్పిన విషయములపై చర్చ జరపకుండా వారు చెప్పిన మార్గమును తూ . చ . తప్పకుండా  అనుసరించండి.

ఈ సంస్థ లో సమితి ,మహిళా విభాగము , సేవాదళ్ ,బాలవికాస్ మరియు భజన మండలి 5 ప్రధాన అంగములు. మనం అనుసరించవలసినది , ఆరాధించవలసినది  కేవలం స్వామిని  మాత్రమే” అనితెలిపారు .

తరువాత శ్రీ ఆర్ జె రత్నాకర్ మేనేజింగ్ ట్రస్టీ ,శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ “శ్రీ సత్యసాయి దివ్య ఉద్యమం”అనే అంశం మీద మాట్లాడుతూస్వామికి సేవ చేసే ప్రతి వారు, స్వామి చేతనే ఎన్నుకోబడి స్వామి వారి సందేశాన్ని వారిచే ప్రకటింప చేస్తున్నారని, రెండు వేలు పైన వచ్చిన సమితి కన్వీనర్ల రూపం లో స్వామి వారి విశ్వ రూప దర్శనం జరుగుతోందని,సమితి అనేది సంస్థ కి గుండె వంటిదని తెలిపినారు. స్వీయ పరివర్తన , భారతీయ సంస్కృతి సంస్థ యొక్క పునాది మరియు సంస్థలోకి వచ్చే ప్రతి వ్యక్తి యొక్క ప్రవేశము  సేవ చేయటం మరియు ఆత్మ పరిశీలన గా గుర్తించండి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మన ఆచరణ ద్వారా తెలియజేయండి. ఈ సంస్థ ఎంటర్టైన్మెంట్ (వినోదం) ఇవ్వదు,ఎన్లైటెన్మెంట్(జ్ఞానోదయం) కోసమనీ స్వామి తెలియజేశారు. మనం ఒక తల్లి బిడ్డలం,ఒక తీగ పువ్వులం,ఒక దేశ పౌరులం అని స్వామి ఎన్నో సార్లు చాటారు. మన సంస్థ లో చేసే ప్రతి కార్యక్రమము ఆత్మ తృప్తి కోసం చేయాలి. సంస్థ లో అన్నీ స్థాయులలో నవవిధ భక్తి మార్గములలో ఒక విషయం ఇతరులను నిందించ కుండా ఉండేలా చూసుకోవాలి. మన బాస్ ఎల్లప్పుడూ మన తోనే ఉండే బాస్ అని చెప్పి విరమించారు.

తరువాత శ్రీ సంజయ్ సహాని పరీక్షా విభాగ అధిపతి, శ్రీ సత్య సాయి యూనివర్సిటీ గురించి శ్రీ సత్య సాయి విద్యా విధానము దాని ప్రాముఖ్యత,పాటించే ప్రమాణాలు తెలియజేశారు.తరువాత సమాంతర సదస్సుల పై ప్రకటనలు మరియు  వివరములు- సభా వేదికలను పరిచయం తో ఈ ఉదయం కార్యక్రమము ముగిసినది.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ,ఒడియా,బెంగాలీ,మరాఠీ,హిందీ(2 సెషన్స్)బాషలలోసమాంతర సదస్సులు9 వేదిక లలో జరపబడ్డాయి.

ఈ సమాంతర సదస్సులలో 11 అంశములపై మూడు రోజులలో తెలుపబడ్డాయి.

ఈ క్రింద ఇవ్వబడిన అంశములపై ముందుగా ఎంపిక చేయబడిన వక్తలు ఆయా బాషలలో ఒక్కొక్క అంశము పై 30 ని|| లు  మరియు ఏమైనా సందేహములకు 10 ని|| ల సమయం కేటాయించారు.

1 వ అంశము- శ్రీ సత్యసాయి సేవా సంస్థల దివ్య నియమావళి, శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆవిర్భావం, చారిత్రాత్మక ఘట్టములు

2 వ అంశము - సంస్థలో సమితి కన్వీనర్ పాత్ర, బాధ్యతలు, కాలానుగుణంగా భగవాన్ బాబా వారి నిర్దేశాలు

3 వ అంశము- స్వీయ పరివర్తనకు సేవను సాధనంగా ఉపయోగించుట, సమితి స్థాయిలో అందరూ సేవలో పాల్గొనటం కు అవకాశములు కల్పించుట.

4 వ అంశము - ఆధ్యాత్మిక సాధన

5 వ అంశము - నవసూత్ర ప్రవర్తన నియమావళి

6 వ అంశము- కోరికల పై అదుపు, ఆకలి దప్పులు ఉపశమింప చేస్తూ ఆధ్యాత్మిక అంతరార్థములతో  నారాయణ సేవ

7 వ అంశము - శ్రీ సత్యసాయి బాల వికాస్ ఆవిర్భావం, క్రమానుగత అభివృద్ధి, వ్యాప్తి

8 వ అంశము - సాయి కనెక్ట్, సంస్థ వెబ్ సైట్, రిపోర్టింగ్

9 వ అంశము - అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా సంస్థలు - జాతీయ స్థాయి కార్యక్రమములు

10 వ అంశము - శ్రీ సత్యసాయి గ్రామ సేవ - భగవానుని శత జయంతి వేడుకల లక్ష్యపరంగా ఎంపిక చేసిన గ్రామాలలో గ్రామ సేవ

11 వ అంశము - శ్రీ సత్యసాయి సేవా సమితి - ఆర్ధిక నిర్వహణ మరియు సంస్థలో ఆర్థిక క్రమశిక్షణ

పైన ఇచ్చిన అంశముల పైనే కాక శ్రీ సత్యసాయిభగవానుని చే స్థాపించబడిన

శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్, శ్రీ సత్య సాయి యూనివర్సిటీ, శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ , శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్స్సెస్ -ప్రశాంతి గ్రామ్ మరియు వైట్ ఫీల్డ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రల సమగ్ర విశేషములు,విభాగముల సేవల వివరములు  అందరికీ డా.సుందరేశన్ మరియు డా. Xxఇన్డోర్ స్టేడియం లో అందించారు.

శ్రీ అనూప్ సెక్సేనా - జోనల్ ప్రెసిడెంట్ - పశ్చిమ జోన్ ,శ్రీ ప్రొ.Er. ముకుందన్ గారు - జోనల్ ప్రెసిడెంట్ దక్షిణ  జోన్, శ్రీ సత్యేన్ శర్మ గారు -   జోనల్ ప్రెసిడెంట్ ఈశాన్య  జోన్, శ్రీ భరత్ ఝవార్ గారు - జోనల్ ప్రెసిడెంట్ సెంట్రల్  జోన్ వారు వారి వారి జోన్లలో నిర్వహించే విశిష్ట పద్దతులను - ప్రత్యేక  సేవలను వివరించినారు

ఈ సమాంతర సదస్సులకు ఆయా రాష్ట్ర అధ్యక్షులు,గ్లోబల్ కౌన్సిల్ మెంబర్లు పరిశీలకులుగా వ్యవహరించారు.ప్రతి వేదికకు శ్రీ ఆర్ జె రత్నాకర్,శ్రీ నిమీష్ పాండ్య మరియు ఇతర జాతీయ స్థాయి సమన్వయ కర్తలు విచ్చేసి తమ సందేశమును అందించినారు.

అందులో బాగంగా తెలుగు సమాంతర వేదిక లో శ్రీ నిమీష్ పాండ్య -జాతీయ అధ్యక్షులు ఈరోజు 25.6.22 తేదీన ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ కన్వీనర్లను ఉద్దేశించి, ప్రశాంతి నిలయం నందు ప్రసింగించారు. అందలోని కొన్ని ముఖ్య విషయములు.

1. సంస్థలోని ప్రతీ సభ్యుడు వ్యక్తి గత సాధన విధిగా చేయాలి.

2. మనమందరము తప్పకుండ ఆధ్యాత్మిక సాధనలో ముందుకు  వెళ్తామని శపధం చేయాలి.

3. ఎప్పుడు ఎక్కడ  ఎవ్వరిని విమర్శించరాదు.

4. స్వామి ప్రేమను సమాజంలోకి వెదజల్లాలి.

5. మన అందరిలోనూ ఐక్యత ఉండాలి. మనమందరం ఒక్కటే.

6. రాబోయే మూడు సంవత్సరాలలోను మనం  దృష్టి పెట్టవలసినవి ఈ క్రింది 5 అంశములు.

    1. సమితి 

     2. బాలవికాస్  

     3. మహిళా విభాగం

     4. నారాయణ సేవ 

     5. భజన 

మన చేతికి ఉన్న ఐదువేళ్ళులా వీటిపై దృష్టి సాధించండి.

8. ఎక్కువ వ్యయంతో పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్ట వొద్దు. దీనితో అహంకారం వస్తుంది. పైన చెప్పిన 5 అంశములపైనే దృష్టి పెట్టండి.

9. మీరందరు ఒకటిగా ఉండి స్వామి ఆశయాన్ని కలను నెరవేర్చండి.అని అందరికీ తెలిపినారు.

శ్రీ ఆర్ జె రత్నాకర్ -మానేజింగ్ ట్రస్టీ,శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మాట్లాడుతూ మన తెలుగు బాష అవతార పురుషిని మాతృ బాష అని అందరిదీ ఒక కుటుంబమనీ. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఎల్లప్పుడూ సంస్థలకు చేదోడు వాదోడు గా ఉండి మన తెలుగు రాష్ట్రములలో 1000 గ్రామాలను దత్తత  తీసుకుని స్వామి వారి నూరవ పుట్టు  పండుగకు

ఈ వెయ్యి పుష్పాల హారాన్ని స్వామి వారి పదముల చెంత సమర్పించాలని కోరారు.

 

3 వ రోజు ఉదయం శ్రీ సాయి కుల్వంత్ సభా మండపము నందు సుమారు 2000 కన్వీనర్లు, శ్రీ సత్య సాయి గ్లోబల్ కౌన్సిల్ మెంబర్లు ,జాతీయ,రాష్ట్ర స్థాయి పధాధికారుల మధ్య అఖిల భారత శ్రీ సత్యసాయి సమితుల కన్వీనర్ల సాధనా శిబిరం యొక్క ముగింపు సభఅంగరంగ వైభవముగా జరిగినది.

ముందుగా శ్రీ నిమీష్ పాండ్య శ్రీ సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షులు సభికులను ఉద్దేశించి ప్రసంగించినరు. ఈ సంస్థ ఎందుకోసం భగవాన్ ఏర్పాటు చేసినది,ముందు ముందు అనుసరించ వలసిన ప్రణాళిక,స్వామి వారికి నచ్చే విధముగా సమితులు ఉండాలని. విశ్వ మానవాళికి మన ప్రవర్తన ద్వారా స్వామి వారి సందేశమును వ్యాప్తి గావించాలని . నూతన వ్యక్తులను స్వామి సంస్థలలోకి తీసుకురావడానికి కృషి చేయాలని,ఆధ్యాత్మిక సాధన ద్వారా స్వీయ పరివర్తన కోసం కృషి చేసి తద్వారా విశ్వ మానవాళిలో భగవంతుణ్ణి దర్శించాలని ఉద్ఘాటించారు.తదుపరి అందరితో స్వామి వారి దగ్గర ప్రతిజ్ఞ చేయించినారు. ఈ కార్యక్రమమునకు సంబందించిన నేపధ్య గేయాన్ని ప్రసారం చేసినారు.

తదుపరి భగవానుని దివ్య సందేశం లో సంస్థ లో ఏ విధమైన తారతమ్యాలు లేవని జాతీయ అధ్యక్షులయినా,రాష్ట్ర అధ్యక్షులయినా,జిల్లా అధ్యక్షులయినా,సమితి అధ్యక్షులయినా ( కన్వీనర్లు ) స్వామి కార్యక్రమాలలో తేడా ఉండకూడదని,సంస్థలో ధనము గూర్చి ఎవరిని ఆడగరాదని, మనకున్న దానిలో కార్యక్రములు చేసుకోవాలని,ఆడంబరములు విడనాడి ఆర్భాటాముల కోసం సేవలు సలుప              రాదని,అందరూ ఐకమత్యంతో మెలిగి భరత జాతి గౌరవమును నిలపాలని చెప్పి “గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై” భజన తో ముగించినారు.

అనంతరం శ్రీ సత్యసాయి సేవాసమితి కన్వీనరలందరికీ శ్వేత వస్త్రములు , స్వామి వారి పాదుకలను  మరియు ప్రసాదం అందరికీ పంచినారు.

ఈ కార్యక్రమము లో చివరగా ప్రతి రాష్ట్ర అధ్యక్షులు వారితో పాటు వారి  రాష్ట్రము లో ఉన్న సంప్రదాయాన్ని ప్రతిబింబించే దుస్తుల అలంకరణ లో ఉన్న ఒక సభ్యుని తోపాటు  స్వామి వారికి మహా మంగళ హారతి ఇచ్చినారు.

ఈ కార్యకమము లో భాగంగా సాయి కుల్వంత్ సభా మండపము నందు 24-06-2022 వ తేదీ సాయంత్రం శ్రీ సత్య సాయి సేవా సంస్థల జాతీయ సంగీత బృందం వారిచే మరియు  25-06-2022 సాయంత్రం బృందావన్ భజన్ మహిళా బృందం వారిచే “స్వరార్చన” అనే సంగీత విభావరి కార్యక్రమాలను స్వామి వారికి సమర్పించినారు.

జై సాయిరాం

No comments:

Post a Comment

YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...