శివమ్ లో శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం వరలక్ష్మి వ్రతం
ఓం శ్రీ సాయిరాం
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, భగవానుడు నడయాడిన శివం మందిర ప్రాంగణంలో హైదరాబాద్ లో గల, సత్య సాయి సేవా సంస్థలు, 16 సమితిలో, మొదటి శుక్రవారం, అనగా ఈ రోజు కోటి సమితి సమితి, హిమాయత్నగర్ గాంధీ నగర్ సమితి, సీతాఫలమండి సమితి వరలక్ష్మి వ్రతం లో పాల్గొన్నారు. ఈ ఉదయం 9-30 గంటలకు శివమ్ గర్భగుడి నుండి వూరేగింగా ఈ కార్యక్రమం కన్నా ముందుగా అందరూ శివం లో గల వినాయకుడు విగ్రహం దగ్గర నుంచి ప్రారంభించి శివమ్ మందిరం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి సాయి గాయత్రి మంత్రాలు వేదమంత్రాలు ఉచ్చరించుచు స్వామివారికి పూర్ణకుంభ తో స్వా గతం పలికి అందురు కలసి జ్యోతి ప్రకాశనం గావించి, కార్యక్రమానికి ఆసీనులై నారు.
ఈ నాలుగు సమితులు మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి, శివం భజన మందిర ప్రాంగణంలో ఎంతో శ్రద్ధాభక్తులతో మొదటి శుక్రవారం శ్రావణ మంగళ గౌరీ వ్రతం, స్వామి వారి చిరకాల భక్తులు, శ్రీ మంగళపల్లి రామకృష్ణ శర్మ గారు వారి డైన శైలిలో వినాయక పూజా తో, మొదలుపెట్టి స్త్రీలకు సర్వసుఖాలు, సౌభాగ్యాన్నిచ్చే వరలక్ష్మీ వ్రతం గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడని శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహార్షి చెప్పిన కథను వరలక్ష్మి వ్రతం - పూజ, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి ఆష్టోత్తరం,వరలక్ష్మి ఆష్టోత్తరం, శ్రీ లక్ష్మి కుంకుమార్చన, సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం అందరిని అత్యద్భుతంగా ఆకట్టుకుంది.
ఈ రోజు ముఖ్యలుగా స్వామి చిర కాల భక్తురాలు శ్రీమతి రేవతి గారు, శివమ్ భజన సింగర్ శ్రీమతి శర్మదా గారు, హైదరాబాడ్ డిస్ట్రిక్ట్ ఆధాత్మిక విభాగ సమన్వయ కర్త శ్రీమతి కామేశ్వరి గారు శ్రీమతి శేషవల్లి గారు, హైదరాబాడ్ డిస్ట్రిక్ట్ మహిళా సేవాదళ్ సమానవ్యకర్త శ్రీమతి శశి గారు, హిమాయత్నగర్, గాంధీ నగర్, సీతాఫలమండి మరియు, కోటిసమితి మహిళా సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఏంతో సంతోషముతో వారి వారి ఇండ్లలో తయారు చేసిన ప్రసాదాలను స్వామి వారికీ అందరు కలసి, నైవేద్యముగా సమార్పణ గావించి, స్వామి వారికీ అందరు కలసి మంగళ హారతి సమర్పణతో సమర్పతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.
ఫోటోలు పంపద మైనది.
No comments:
Post a Comment