
Thursday, March 24, 2022
SRI SATHYA SAI SEVA ORGANISATIONS, KOTI SAMITHI, HYDERABAD:

Monday, March 14, 2022
20-3-2022 SRI SADGURU SRI THYAGARAJA AARADHANOSTAVAM AT SIVAM.
ఓం శ్రీ సాయి రామ్
శివమ్ మందిరం లో, కోటి సమితి ఆధ్వర్యంలో 40 మంది సుప్రసిద్ధ వర్ధమాన కళాకారులతో సాంప్రదాయ కీర్తనలు, ఘన రాగా పంచరత్నకీర్తనల గోష్టి.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహాముతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి ఆధ్వర్యములో 22-3-2022 న సాయంత్రము 5-30 గంటలకు, భగవానుడు నడయాడిన విద్యానగర్ లో గల శివమ్ ప్రాంగణంలో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవం భక్తి శ్రద్దలతో జరిగింది.
శ్రీ ఎం వి ఆర్
శేష సాయి గారు, శ్రీ రతిరావు పాటిల్, శ్రీ శరత్ కృష్ణ , శ్రీ ఎం ఎల్ ఎం స్వామి, శ్రీమతి శశిగారు, శ్రీమతి కామేశ్వరి, గార్లు, జ్యోతి ప్రకాశానం గావించి, తదనంతరం కోటి సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి స్వాగత వచనములు పలుకగా, డాక్టర్ వై రమాప్రభ గారి బృందం, తో 40 మంది సుప్రసిద్ధ వర్ధమాన కళాకారులూ, సాంప్రదాయ కీర్తనలు,
ఘన రాగా పంచరత్నకీర్తనల గోష్టి గాన
కార్యక్రమాన్ని ప్రారంభించారు.
శ్రీ త్యాగరాజ స్వామి రచించిన, “ ఘన రాగ పంచరత్న కీర్తనలను, వర్ధమాన, కళాకారులు, సుప్రసిద్ధ
కళాకారులతో, కలసి,మొత్తము 40 మంది
శ్రీ త్యాగరాజ స్వామి వారి దివ్య ఆత్మకు
నాదంజలి సమర్పించారు సుప్రసిద్ద కళాకారులు, శ్రీమతి డాక్టర్ వై రమాప్రభ, శ్రీ జ్ఞనాంబళ్ గారు, 1. Dr. Y. Ramaprabha, 2. Smt.Neyvelu
Gnanambal Ramanathan 3. Kum. M. Tulaja 4 Kum. Sivani 5.Smt.A.Srivani 6. Smt C.
Manogyna 7.Kum.C.Srikruti 8. Smt.విజయలక్ష్మి
శ్రీ ఎం ఎల్ ఎన్ స్వామి గారు శ్రీ త్యాగరాజ వేష ధారణ లో ఉంచ్చ వృత్తిని శివమ్ మందిర ప్రాగణంలో నిర్వహించారు.
మృదంగంపై శ్రీ పి దుర్గ కుమార్ కుమార్ గారు, వయోలిన్ పై శ్రీ కొమండూరి అనంత శౌరిరాజన్, అత్యద్భుతముగా వాద్య సాహాకారమును అందించారు.
ఈ ఆరాధనోత్సవములో కార్యక్రమానికిని ముందు, సాంప్రదాయ కీర్తనలు దుర్గాబాయి దేశముఖ్ మహిళా సభ కాలేజీ అఫ్ ఫైన్ ఆర్ట్స్, మొదటి సంవత్సర, రెండవ సంవత్సర, మరియు ఫైనల్ సంవత్సర, విదార్థులు ఎంతో భక్తి శ్రద్దలతో భక్తి పూర్వకముగా, సామర్పణ గావించారు. శ్రీ సత్య సాయి భజనలు అందరి మన్నలను పొందినారు.
శ్రీ ఏ మల్లేశ్వర రావు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం టైలరింగ్ లో 100 రోజులు శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సర్టిఫిఫికేట్స్ ను బహుకరించారు.
శ్రీ సత్య సాయి సేవ సంస్థల, కోటి సమితి పక్షాన, స్టేట్ ట్రస్ట్ మెంబెర్ శ్రీ ఎం వి ఆర్ శేష సాయి గారు శ్రీ టి. కోటేశ్వర రావు ప్రముఖ ఛార్టర్డ్ అకౌంటెంట్, కళాకారులను, జ్ఞ్యాపికలతో ఘనంగా సత్కరించారు.
విశ్వేశ్వర శాస్త్రి. పి. సమితి కన్వీనర్.
ఫోటోలు జత చేయడమైనది.
- Sri V Srinivas In time
- Sri P V Sastry In Time
- Sri Chakradhar Late
- Sri M Ramulu in time
- Sri Kamesh late
- Sri Ramanujaiah late
- Sri Sai Absent.
- Sri Ram Das Before Time.
- Sri Srisailam In Time.
- Sri Lakshminarayana Absent
- Sri Lakshminaryana Huppuguda, Absent
- Sri Sydulu - Absent
- Sri Sai Kumar, Absent
- Sri Raja Sekhar, Absent
- Sri Janny Absent
- Sri Niranjan Late
- Sri Bhavyashu Absent.
- Sri Pandu Absent
- Sri Ch Lakshma Reddy In Time.
- Sri Nagesh Late
- Sri Anil Kumar Absent.
- Sri Balaji In Time.
- Kum Varshini In Time.
- Kum Vaishavi In Time.
- Smt Bhuvaneswari In Time.
- Smt Vijayalakshmi Late
- Smt Sitamahalakshmi Late
- Smt Kalpana Late
- Smt Shaileswari Late
- Smt Kusuma Absent
- Smt Padmavathy Late
- Smt Vaani Late
- Smt Annapurna Absent
- Kum Ashritha In Time.
- Mrs Nikhita Gupta Absent
- Ms Afsha Banu Late
- Ms Farhana Begam Late
- Mrs Peddabomma Suwarna Late
- Mrs Addula Kalpana Late
- Ms A Bhavani Late
- Mrs Adavi Mounika Late
- Mrs B Swapna Late
- Mrs K Padma Late
- Mrs Yadamma Late
- Mrs D Shalini Late
- Mrs D Malleswari Late
- Mr Manikanta - Late
- Chenna Keshava In Time
- Hari Babu - Before Time.
- M Anjaneyulu - In Time.
- G Akhila Late
- D Chinna In Time.
- Srinivas Reddy - Late
𝐒𝐫𝐢 𝐓𝐡𝐲𝐚𝐠𝐚𝐫𝐚𝐣𝐚 𝐀𝐚𝐫𝐚𝐝𝐡𝐚𝐧𝐨𝐬𝐭𝐚𝐯𝐚𝐦 𝐁𝐘 𝐊𝐎𝐓𝐈 𝐒𝐀𝐌𝐈𝐓𝐇𝐈 𝐀𝐓 𝐒𝐈𝐕𝐀𝐌 𝐎𝐍 𝟐𝟎-𝟑-𝟐𝟎𝟐𝟐 𝐏𝐋 𝐒𝐀𝐕𝐄 𝐓𝐇𝐄 𝐃𝐀𝐓𝐄
PRESS NOTE
శివమ్ లో సుప్రసిద్ధ కళాకారులతో, బంటురీతి పేరిట - సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి
ఆరాధనోత్సవాలు 20-3-2022
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యములో భగవానుడు
నడయాడిన శివమ్ ప్రాంగణంలో సుప్రసిద్ధ కళాకారులతో, సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి
ఆరాధనోత్సవాన్ని 20 -మార్చ్,
2022 సాయంత్రం 5 -30 గంటలకు ప్రారంభం,
కార్యక్రమ వివరములు.
20-3-2022 సాయంత్రము 5-30 గంటలకు
శ్రీ త్యాగరాజ వేష ధారణ లో శ్రీ ఎం ఎల్ ఎం
స్వామి ఉంచ్చ వృత్తిని శివమ్ మందిర ప్రాగణంలో నిర్వహించనున్నారు.
5-30 గంటలకు, వేదం భజన, శివమ్ భజన బృందంచే.
6-10 గంటలకు - వర్ధనామాన సుప్రసిద్ధ కళాకారులచే సాంప్రదాయ కీర్తనలు.
6-30 గంటలకు - హైదరాబాద్ జిల్లా అధ్యక్షుల చే జ్యోతి ప్రకాశనం,
6-35 నుండి సుప్రసిద్ధ కళాకారులు -
డాక్టర్ వై రమాప్రభ గారి బృందం శ్రీ త్యాగరాజ స్వామి రచించిన, “ ఘన రాగ పంచరత్న కీర్తనల సమర్పణ. మృదంగం పై శ్రీ పి దుర్గ కుమార్, వయోలిన్ పై కొమాండూరు పై అనంత శౌరి రాజన్ సహకరించనున్నారు.
8-15 నిమిషాలకు - శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో గత 100 రోజులుగా 14 వ బ్యాచ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ , టైలోరింగ్ లో శిక్షణ పొందిన 12 మందికి సర్టిఫికెట్స్ బహుకరణ.
8-20 నిమిషాలకు కళాకారులకు స్వామి ప్రేమను ఒక మొమెంటో రూపంలో అందరికి బహుకరణ.
8-30 గంటలకు - స్వామి వారి మంగళ హారతి - ప్రసాద వితరణ.
Sd/---
CONVENOR
KOTI SAMITHI
కోటి సమితి సేవాదళ్ సభ్యలు, మహిళలు , బాలవికాస్ విద్యార్థులు, మరియు మన మాన్తా 3-00 గంటలకే శివమ్ చేరి
కార్యక్రమము నిర్వహించుకొనవలెను.
అందరికి ప్రేమ పూర్వక ఆహ్వానం: అందరికి ఈ విషయము తెలియ జేయ ప్రార్ధన.
Monday, February 21, 2022
KOTI SAMITHI, HYD PRESENTS 2022 మహా శివరాత్రి పర్వదినోత్సవం సందర్భంగా ప్రత్యేక నాటిక - "కిరాతార్జునీయం " - SIVAM MAHASIVA RATRI CELEBRATIONS:
Today a U Tube was Prepared on Shankaaravam and the importance of Shanku.
2AM to 3 AM: AKHANDA BHAJANA SLOT FOR KOTI SAMITHI. SUCCESSFULLY COMPLETED WITH SWAMY'S BLESSINGS. AND WITH THE CO-OPERATION OF ALL.
With the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Baba varu the following members of Koti Samithi have participated in the Bhajana Slot.
1) Sri V Srinivas, 2) Sri Venkat Rajanna, 3) Smt Bhuvaneswari, 4) Chi. Bhadra Devi, 5) Smt Kalpana, 6) Smt V Vijaya Laksmi 7) Smt Jyothi of Zia Guda, 8) Smt Malathi of Central Warehousing Corporation, 9) Sri Surendra Patel, 10) Sri Rati Rao Patil, 11) Sri Manik Prabhu, 12) Sri Manik Prabhu's Son, 13) Sri M Anjaneyulu, 14) Sri A Vinay Kumar, 15) Sri Ch. Lakshma Reddy Garu. and 16) Convenor P.Visweswara Sastry.
Balvikas Children: Master Hemang, Chi Bhadra, Master Leeladhar have participated in their particular Slot at 5 PM to 5-30 PM.
Gurus:
Mr Srinivas of Koti Samithi is performing Vibhuti Abhisekham at midnight of 1st March 2022.
ఈ నాటిక సమర్పణ -
శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి, హైదరాబాద్.
ఈ నాటికలోని పాత్రలు, పాత్రధారులు,
అర్జునుడుగా శ్రీ వాచస్పతి అంబడి పూడి మురళీకృష్ణ,
కృష్ణుడిగా - శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్,
శివుడిగా - శ్రీ K శివ కళాధర్,
పార్వతి గా - శ్రీమతి పూర్ణిమ సుమన్,
నందిగా - శ్రీ అనుమంచి విశ్వమోహన్,
బృంగి గా శ్రీ కె వి ఎస్ కె గణేష్,
శృంగి గా - తుమ్మలపల్లి వెంకట సుబ్రహ్మణ్యం,
ద్రౌపదిగా డాక్టర్ ఎం మీనా కుమారి,
నారదుడిగా శ్రీ బి సాయి ప్రభాకర్,
ధర్మరాజుగా - శ్రీ రేగేళ్ల అనిల్ కుమార్,
భీముడు, శ్రీ శరత్ కృష్ణ పరాయితం
వ్యాసుడిగా శ్రీ జి వి ఎన్ రాజు,
ఇంద్రుడిగా శ్రీ మదన్ గుప్తా,
నకులుడుగా శ్రీ వి. వెంకట రాజన్న
మరియు సహదేవుడుగా, మూకాసురుగా శ్రీ పి. విశ్వేశ్వర
శాస్త్రి పాల్గొన్నారు.
పాండవులు వనవాసానికి వెళ్ళినపుడు ద్రౌపది, మరియు భీముడు కౌరవులతో యుద్ధం ప్రకటించమని ధర్మరాజును బలవంతం చేస్తారు. కానీ ఆయన అందుకు అంగీకరించడు. చివరగా ఇంద్రుడి సలహాతో అర్జునుడు అడవిలో తపస్సు చేసి శివుణ్ణి మెప్పిస్తాడు. శివుడు అందుకు ప్రీతి చెంది ఏమైనా వరం ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు.
అదే అరణ్యం ప్రాంతంలో మూకాసురుడు అనే రాక్షసుడు ఎలుగుబంటి రూపంలో తిరుగుతుంటాడు. అది ఒకసారి అర్జునుణ్ణి చూసి మీదకు దూసుకురాబోతుంది. అప్పుడు శివుడు కిరాతుడి రూపంలో అక్కడికి వస్తాడు. ఇద్దరూ కలిసి దానివైపు ఒకేసారి బాణం వేస్తారు. అది చనిపోతుంది. అయితే ఎవరు బాణం ముందు వేశారో సందిగ్ధం మొదలౌతుంది. చివరకు వివాదంగా మారి యుద్ధానికి దారితీస్తుంది. ఆ యుద్ధంలో ఎంతసేపైనా అర్జునుడు కిరాతుని ఓడించలేక పోతాడు. చివరకు తప్పు తెలుసుకుని శివుణ్ణి శరణు వేడుకుంటాడు. శివుడు అతని పరాక్రమానికి మెచ్చి చాలా శక్తివంతమైన పాశుపతాస్త్రం ప్రసాదిస్తాడు. ఆ ఆయుధమే అర్జునుడు *మహాభారత యుద్ధ* సమయంలో కర్ణుని సంహరించడానికి వాడాడు.
అందరికీ సాయి శివోహం.
మౌళిగుళ్కెడు చంద్ర మర్ఖండ కళ తోడ,
బెడదారు గుంపెడు జడల తోడ,
జడలలొ ప్రవహించు చడలేటి జిగు తోడ,
డంబైన ఫాల నేత్రంబు తోడ,
నల్ల నేరెడు వంటి నల్లని మెడ తోడ,
కరమున నాగ కంకణము తోడ,
నడుమున చుట్టిన నాగ చర్మంబు తోడ,
మైనిండ నలదు భస్మంబు తోడ,
కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టు తోడ,
తాంబుల రాగదరంబు తోడ,
తట హేమ మయ వజ్ర తాటంకముల తోడ,
విక్షస్య వర్ధయా వృష్ఠి తోడ,
నల్ల కలవలు దునుమాడి కొల్లలాడు,
నేడి చామనఛాయల మేని తోడ...!
భావం
సిగపై దీపస్తంభము వలె ప్రజ్వరిల్లు చంద్రుని చల్లని కాంతి పుంజములు నలుదిశలా వ్యాపించు చుండగా,
శిరస్సునిండా గుంపులు గుంపులు గల జటాజూటములతో,
ఆ జటాజూటములనుండి నదీనదాలు జలధారలగా ప్రవహించు చుండగా,
నొసటి మధ్యన ప్రజ్వరిల్లే మూడొకన్నుతో ఈ జగత్తును లయం చేసే ముక్కంటి,
అల్ల నేరుడుపండువలె నిగనిగలాడే నల్లని మెడ కల్గి,
చేతికి వంకీలుగా నాగరాజును ఆభరణంగా తొడిగి,
నడుముకు నాగ చర్మము ధరించి,
వంటినిండా భస్మం పులుముకుని,
నుదుట నిండుగా తీర్చిదిద్దిన చక్కటి కుంకుమబొట్టుతో వెలుగులీనుతూ,
తాంబూలము సేవించిన ఎర్రని పెదవులతోనూ,
వజ్రములు పొదిగిన బంగారు చెవికమ్మలు తోనూ,
చిన్నగా మొదలై హోరున వర్షించే కుంభవృష్టిని తలపించే రూపము నీది,
మేనిచామన ఛాయా శరీరంతో,
కనులుదోచే నీ సొందర్యం నిజంగా చూడగానే అపహరించాలనే బుద్ధిపుట్టే నల్లకలువల చందం,
ఓ ఈశ్వరా..
ప్రకృతిని మించిన నీ సౌందర్యం ఈ జగత్తును పూర్తిగా నీ శాంతి,ప్రేమ,
ఆనందాలతో మానవాళి హృదయలోతుల్ని పూర్తిగా ముంచివేసింది కదా ఈశా,
ఇదియే కదా ఈ సృష్టికి గొప్ప బహుమతి సాయీశా...
శ్లోకం భావ వివరణ:
శ్రీ.కస్తూరి సాయి భాస్కర్.
Sunday, February 20, 2022
Tuesday, February 15, 2022
Friday, February 11, 2022
భీష్మ ఏకాదశి. 12-2-2022
భీష్మ ఏకాదశి.
12.02.2022. శనివారం.
పంచమవేదమైన మహాభారతాన్ని వేదవ్యాసుడు రాసినా,భీష్ముడు అనే పాత్ర లేకపోతే భారతమే లేదు!
తాను కోరుకునే సమయంలోనే మరణించగలిగే వరం కూడా ఆయన సొంతం.అందుకే మార్గశిరమాసంలో అంపశయ్య మీదకి చేరుకున్నా... ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకూ వేచిచూశాడు.
ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత తనకు మోక్షం కలిగించమని ఆ పరంధాముని అష్టమి రోజున వేడుకున్నాడు.
ఇక మరణ
సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కురుకుల వృద్ధుడు.అంపశయ్యపై ఉన్న తనను చూసేందుకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతి గురించి బోధించాడు. పాండవులతో అక్కడకు వచ్చిన కృష్ణపరమాత్ముడుని స్తుతిస్తూ శ్రీ విష్ణు సహస్రనామాలని పలికాడు.
మాఘమాస ఏకాదశి రోజున భీష్ముడు తన దేహాన్ని వదిలి స్వర్గానికి చేరుకున్నాడు.
అందుకే దీనిని భీష్మ ఏకాదశి అని జయ ఏకాదశి అని కూడా అంటారు.ఈ రోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని నమ్మకం.
ఇక భీష్ముడు భారతీయులందరికీ పూర్వీకుడే!ఆచార్యునిగా, భరతవంశానికి ఆదిపురుషుడిగా మనకు చిరస్మరణీయుడు.
అందుకే ఈ ఏకాదశినాడు ఆయనకు తర్పణాలను విడవాలని పండితులు సూచిస్తారు.భీష్ముని తమ పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుని పోతాయట.
ఈ రోజునే విష్ణు సహస్ర నామం పుట్టిందని పురాణాలు చెప్తున్నాయి.అందుకే దీనిని విష్ణు సహస్ర నామ జయంతి అని కూడా పిలుస్తుంటారు.
విష్ణు సహస్రనామ విశేషాలను భీష్ముడు పాండవులకు తెలిపి,కురుక్షేత్ర యుద్ధంలో వారి విజయానికి భీష్ముడు కారణమయ్యాడు.
భీష్ముడు అందించిన విష్ణుసహస్రనామాలను ఈరోజున పారాయణ చేస్తే విశేష ఫలితం దక్కుతుంది.
మాఘశుద్ద అష్టమి నుంచి ద్వాదశి వరకూ ఉన్న ఐదు రోజులనూ భీష్మ పంచకం అని పిలుస్తారు.
ఈ అయిదు రోజులూ భీష్ముడి వ్యక్తిత్వాన్ని తలచుకుంటారు.ఆ మహాత్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ ఐదు రోజులనూ కేటాయిస్తారు.
🙏🙏🙏
జై సాయిరాం.
========================================================
రేపు ఫిబ్రవరి 12 శనివారం భీష్మ ఏకాదశి సందర్భంగా...
🌹🌺 భీష్మ ఏకాదశి అని ఎందుకంటారు? 🌺🌹
మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ రోజునే కురుకుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు. బీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం విష్ణు సహస్రనామం. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉన్నాడు. నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికాలుడుతు గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు. దీనికి కలవరపడిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుడిని ప్రశ్నించారు. మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః" కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడని ఆ జగన్నాటక సూత్రధారి సమాధానం ఇస్తాడు.
అందుకే నా మనసు అక్కడికి వెళ్లిపోయింది, మీరు కూడా నాతో రండని పాండవులకు తెలిపాడు. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మశాస్త్రాలను అవపోశణం పట్టి పూర్తిగా ఆకలింపు చేసుకున్న మహనీయుడు. ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతోంది, ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోడానికి రండి' అని భీష్మపితామహుడి చెంతకు తీసుకు వచ్చాడు.
సుమారు మూడు పక్షాల నుంచి అంపశయ్యపై పడి ఉన్నాడు. దేహమంతా బాణాలు గుచ్చుకుని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది. మాఘమాసంలో ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు, ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు. తాను కోరుకుంటే మరణం చెంతకు వస్తుంది, కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని కోరుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకున్నాడు.
తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు. అంతటి జ్ఞానం కలిగిన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. అలాంటి వాళ్లు ఏ రోజు నిష్క్రమించినా వైకుంఠం ప్రాపిస్తుంది. భీష్ముడు తనకి మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు.
అయితే తాను చేసిన దోషం ఒకటి స్పష్టంగా గాంగేయుడికి జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి పాపం శరీరం పైనే రాసి ఉంటుందట! అది తొలగితే తప్ప సద్గతి కలగదట. ఇంతకీ భీష్మపితామహుడు చేసిన దోషం ఏంటంటే? పాండవ పత్ని ద్రౌపదికి నిండు సభలో అంతటి అవమానం జరుగుతున్నా ఏమీ చేయలేక పోయాడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువైన వసిష్ఠుడు ఆమెతో ఇలా చెప్పారట "మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః" హే ద్రౌపతి! ఇతరులు తొలగించలేని ఆపదలు కలిగినపుడు శ్రీహరిని స్మరించుకోమన్నారు.
కురుసభలో వస్త్రాపహరం జరుగుతుంటే అతి పరాక్రమవంతులైన అయిదుగురు భర్తలు ఆమె గౌరవాన్ని కాపాడలేకపోయారు. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కనబెట్టారు. కృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. కాబట్టే అలా చేసినందుకు కౌరవులను మట్టు పెట్టాడు. పాండవులకూ కూడా అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలనుకున్నాడో ఆమెకే నష్టం జరుగుతుందని భావించాడు.
ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ భగవంతుడే అర్జునుడితో చెప్పాడట. ద్రౌపదికి ఎప్పుడు అవమానం జరిగిందో అప్పుడే వారిని తీసి పాడేశాను, ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితంలా ఉన్నారే తప్ప, ఆ గౌరవాన్ని నీకు కట్టబెట్టాలని యుద్ధం చేయమంటున్నాంటూ అర్జునుడితో శ్రీకృష్ణుడు అన్నాడట.
భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తుంటే, పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ 'తాతా! ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని ప్రశ్నించిదట. అందుకు భీష్ముడు 'అవును తల్లీ! నా దేహం నా అధీనంలో లేదు, అది ధుర్యోదనుడి సొంతం. నీకు అవమానం జరుగుతుందని తెలిసినా, నా దేహం నా మాట వినలేదని అన్నాడు. అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టే ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపశయ్యపై ఉన్నానని చెప్పాడు.
కురు వంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిపోయిన భీష్ముడు, పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్వజించాడు. ' హే ద్రౌపతీ! కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోడానికే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు ఈనాడు నేను ధర్మాలను బోధించవచ్చని పాండవులకు ఎన్నో సూత్రాలను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్ముడికి నొప్పి నుంచి ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాందించి ధర్మసూత్రాలను చెప్పించాడు.
నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పొచ్చుకదా అని భీష్ముడు ప్రశ్నించాడు. నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదని కృష్ణుడు బదులిచ్చాడు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు దాని గురించి చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల తన సారాన్ని చెప్పగలదా! అందులో పండిన మొక్క చెబుతుంది ఎంత సారమో. అలాగే అనుభవజ్ఞుడవైన నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు.
భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యమవుతుంది. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితమని జగన్నాటక సూత్రధారి భావించాడు. అలా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత ఆయనే నేరుగా చెప్పాడు, విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వస ారా చెప్పించాడు. కాబట్టి విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా మోక్షం కలుగుతుంది🙏
Saturday, February 5, 2022
శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025
శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025 GOOGLE FORM: LINK: TOTAL NO OF CANDIDATES LINK: ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వా...

-
The Sri Sathya Sai Aaraadhana Mahostavam was celebrated with the Divine blessings of Bhagawan Sri Sri Sri Sathya Sai Baba Varu. Water Camp ...
-
Grand Celebration of Mathrusri Eswaramma Aradhanotsavam Grand Celebration of Mathrusri Eswaramma Aradhanotsavam As you know, a free drinki...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...