Friday, April 8, 2016

13-9-2015 Sri Gidugu Sri Ram Murthy Jayanthi Celebrations - Venue Slate School, Abids, Hyd.

Please Click Here to view the photographs భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహముతో, తెలుగు వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి సేవాసంస్థలు, కోఠి సమితి ఈ రోజు ఉదయం అనగా 13-9-2015 న స్లేట్ ది స్కూల్ పలక బడి అబిడ్స్ సౌజన్యంతో, ఆ పాఠశాల ప్రాంగణంలో . తెలుగు భాష విశిష్టత - తెలుగు భాషా పరిరక్షణలో మన బాధ్యత అనే విషయంపై వ్యాసరచన, ఒక్క ఆంగ్ల పదం లేకుండా తెలుగులో వక్తృత్వము తెలుగులో పద్య పఠనం, పోటీలు నిర్వహించారు. వేద పాఠశాలలో చదువుకునే పిల్లలు వేదం చదవడం సామాన్య విషయమే. కానీ శ్రీ సత్యసాయి బాలవికాస్ విద్యార్ధులు స్పష్టంగా వేద పఠనం చేయడం, వేద పఠనంతో ఈ కార్యక్రమం ప్రారంభం కావడం విచ్చేసిన ఆహూతులను ఎంతగానో ఆకట్టుకుంది. కర్మన్ ఘాట్, అమీర్ పేట్, అబిడ్స్ ప్రాంతాల్లో ఉన్న స్లేట్ ( పలక బడి )పాఠశాలల విద్యార్ధులతో పాటు లిటిల్ ఫ్లవర్ స్కూల్, హెచ్.వి.ఎస్. స్కూల్, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్ధులు కలసి మొత్తం సుమారు 200 మందికి పైగా విద్యార్ధులు ఈ పోటీల్లో పాల్గొని విజయవంతం చేశారు. కోఠి సత్య సాయి సేవా సమితి కన్వీనర్ శ్రీ పొనుగుపాటి విశ్వేశ్వర శాస్త్రిగారి స్వాగత వచనాలతో ప్రారంభమైన సభ స్లేట్ స్కూల్, అబిడ్స్ వారి సహకారంతో విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రములో, శ్రీమతి రేణుక, శ్రీమతి శ్రీ సీతా మహా లక్ష్మి, శ్రీమతి సునంద, శ్రీమతి లక్ష్మిగీత, కుమారి శ్రీ శారద సుప్రియ, న్యాయ నిర్ణేతలుగా, శ్రీమతి మీనా కుమారి, శ్రీమతి హనుమ దేవి, శ్రీ నాగభూషణం గారు, శ్రీ చల్ల రామ ఫణి గార్లు, పాల్గొన్నారు. శ్రీ ప్రమోద్ కుమార్ మహేశ్వరీ, శ్రీ చక్రధర్, శ్రీ మనికంట, లు పాల్గొన్నారు. స్వామి పూర్వ విద్యార్ధి, శ్రీ సురేంద్ర నాథ్ గారికి స్వామి తో వారికీ గల అనుభావాల కార్యక్రమము తరువాత బహుమతి ప్రదాన కార్యక్రమం, స్లేట్ స్కూల్, అబిడ్స్ ప్రాంగణంలోనే వచ్చే ఆదివారం 20వ తేదీన 9-30 గంటకులకు జరుగుతుందని తెలుపడము జరిగినది. ఈ కార్యక్రమము, దిగ్విజయముగా జరిపిన స్వామికి, మరియు ఈ ప్రాంగణం కేటాయించిన శ్రీ వాసిరెడ్డి అమర్నాథ్ గారికి, హృదయ పూర్వక థాంక్స్ తెలుపుకుంటూ కార్యక్రమము ముగిసింది. జై సాయి రామ్ విశ్వేశ్వర శాస్త్రి.

No comments:

Post a Comment

UGADI & SRIRAMA NAVAMI CELEBRATIONS AT SIVAM - BY GANDHI NAGR SAMITHI. 30-3-2025 BY GANDHINAGAR SAMTHI, AND MEHDIPATNAM SAMITHI.

 UGADI INVITATION From Convenor Brother Sri B V Madhusudhan  S/o Late Sri B V L Narasimha Rao Garu  Sairam Sir  We invite  you and all your ...