Friday, April 8, 2016

IST BATCH FREE TAILORING COACHING INAUGURATION. 5-12-2015 TO 5-3-2016

Please Click Here to view the photographs భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతో ఈ రోజు, అనగా 5-12-2015 న శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి ఒక విశేష సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శ్రీ సత్య సాయి ఉచిత టైలరింగ్ శిక్షణ శిభిరం శ్రీమతి శాంత, శ్రీమతి రేణుక, శ్రీ భోగేశ్వరుడు, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, శ్రీ అనుప్ కుమార్, శ్రీ ఎం ఎల్ నరసింహ రావు, ప్రేమ సాయి కలేన్దర్స్ అధినేత, సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి జ్యోతి ప్రకాశం చెయ్యగా కార్యక్రమం, వేద పఠనం, భజనతో ప్రారంభం అయ్యింది. శ్రీ భోగేశ్వరుడు మాట్లాడుతూ అందరిని శ్రద్ధతో నేర్చుకున్న అందరికి కోర్స్ పూర్తి అయ్యిన అనంతరం కుట్టు మెషినులు బహుకరించనున్నట్లు తెలిపారు. శ్రీమతి రేణుక స్వాగత వచనాలు పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఎం ఎల్ నరసింహ రావు, శ్రీమతి వెంకట లక్ష్మి, బాలవికాస్ గురువులు, శ్రీమతి సీత మహా లక్ష్మి, భాగ్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి అనిత మాస్టర్ ఈ రోజు కార్యక్రమంలో భాగంగా సారీ పెట్టికాట్ కట్ చేసే విధానం, కుట్టు విధానము నేర్పించారు. ఈనాటి కార్యక్రమం భగవానుడికి మంగళ హారతి నరసింహ రావు, సునీత సమర్పణతో సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ గావిస్తూ ఈ శిక్షణ శిభిరం రెండు నెలలు కొనసాగుతుందని, దీని తర్వాత ఇంకా మరిన్ని శిక్షణ శిభిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పొంద దలిచిన వారు 8886509410, 9440409410 ను సంప్రదించగలరు.జై సాయి రామ్ సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి

No comments:

Post a Comment

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం  - 2025  GOOGLE FORM: LINK:  TOTAL NO OF CANDIDATES LINK:  ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వా...