Please Click Here to view the photographs శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, అద్వర్యంలో 5, డిసెంబర్ 2015 నుండి,5 మార్చ్, 2016 వరకు కుట్టు కేంద్రము ప్రారంబించి, 18 మందికి, 90 రోజుల శిక్షణ నిచ్చిన , సందర్భములో అందులో ఎంపిక చేసిన, ఇద్దరికి, 2 కుట్టు యంత్రముల బహుకరణ,మరియు శ్రీ సౌమ్య గారి భక్తీ సంగీత కార్యక్రమము, ఆదివారం 13న అబిడ్స్, జి. పుల్లా రెడ్డి భవనం లో గల శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్ ప్రాంగణములో 6 వ అంతస్తు లో ఎంతో భక్తీ శ్రద్దలతో జరిగినది. గంటన్నర సేపు జరిగిన శ్రీమతి శ్రీ సౌమ్య గాత్ర కచేరికి, తబలా శ్రీ జయకుమార్ ఆచార్య, వయోలిన్ శ్రీ రాజన్ గారు , వాద్య సహకారము ఆత్యఅద్భుతముగా అందించారు. శ్రీమతి శ్రీ సౌమ్య, శ్రీమతి అనిత, శ్రీమతి సునంద జ్యోతి ప్రకాశం గావించి, న అనంతరం వర్ణం తో ప్రారంబించి, త్యాగరాజ సంకీర్తన, శ్రీ ముత్తుస్వామి దేక్షితర్ కీర్తన, సత్య సాయి, తులసిదాస్ భజనలు తమ శ్రవ్య మైన గళంలో, కర్నోపెతముగా, పాడి అందరి మన్నలను పొందినది అనుటలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు.గంభీరనత రాగం లో డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారి, "అమ్మ ఆనందాయని వర్ణం" తో మొదలు పెట్టారు.హంసధ్వని రాగం లో తులసిదాస్ భజన " జయ జయతి జయ "అమృతవర్షిని రాగం లో శ్రీ ముత్తుస్వామి దేక్షితర్ గారి "ఆనందామృత అ కర్శిని "కళ్యాణి రాగంలో (తనకిస్ట మైన సంకీర్తన ) నిదిచాల సుఖమా, శ్రీ త్యాగరాజ సంకీర్తన ను పాడి అందరిని అలరించింది.సత్యసాయి భజన, జయరాం శ్రీ రామ్ అనే భజనలకు అందరు కూడా కలసిపాడి, భజనను రక్తి కట్టించారు."హమ్కో ,మాన్, కి శక్తి దేనా " అనే హిందీ భజన ను అందరు కలసి పాడి కర తాల ధ్వనులతో మందిర ప్రాంగణము మారు మ్రోగింది.ఈ సందర్భమును పురస్కరించుకొని, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి, పక్షాన శ్రీమతి సునీత, శ్రీమతి సునంద గార్లు గాయని శ్రీమతి శ్రీ సౌమ్యను శ్రీ వెంకటేశ్వర స్వామి, చాయ చిత్రము బహుకరించి, సత్కరించారు.శ్రీ ప్రమోద్ కుమార్ మహేశ్వరీ గారు, మురళీధర్ బాగ్ నివాసి, శ్రీమతి లక్ష్మి గారికి కుట్టు యంత్రము బహుకరించారు.శ్రీమతి సునంద గారు, హనుమాన్ tekdi sana square అపార్ట్ మెంట్ watchmen కూతురు కుమారి రేవతికి కుట్టు యంత్రము బహుకరించారు.ఈ కార్యక్రమములో, కోటి సమితి సభ్యులు, కుట్టుకేంద్రంలో శిక్షణ పొందిన వారు, పొందవలసిన వారు, బాలవికాస్ గురువులు, మహిళలు, శ్రీ చల్లమల్ల రెడ్డి గారు, నరసింహ రావు,శ్రీమతి సునీత గార్లు, తదితరులు పాల్గొన్నారు.చివరగా, శ్రీమతి శ్రీ సీతా మహా లక్ష్మి గారు స్వామి కి హారతి సమర్పణతో, కన్వీనర్ శ్రీ విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పిస్తూ, ఏప్రిల్ 2 వ తేదిన, osman gunj లోని శ్రీ సత్య సాయి సేవ క్రెంద్రము లో tailoring శిక్షణ తరగతులు ప్రారంభము కనున్నవని తెలియ చేసారు.
Pl go to recordings blog and click Sree Sowmya Koti Samithi Program Part I & Part II
Subscribe to:
Post Comments (Atom)
UGADI & SRIRAMA NAVAMI CELEBRATIONS AT SIVAM - BY GANDHI NAGR SAMITHI. 30-3-2025 BY GANDHINAGAR SAMTHI, AND MEHDIPATNAM SAMITHI.
UGADI INVITATION From Convenor Brother Sri B V Madhusudhan S/o Late Sri B V L Narasimha Rao Garu Sairam Sir We invite you and all your ...

-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...
-
ఓం శ్రీ సాయిరాం HIGH SCHOOL SUBJECT. "ఇచ్చుట- క్షమించుట" ఓం శ్రీ సాయిరాం ఈ రోజున ( 11-9-2024) శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిర్...
-
18TH OCTOBER, - TAPOVANAM PARAYANAM PAGES 27-32 చదవండి : కామెంట్స్ లో చదివినటుల తెలియ పరుస్తూ మీ అనుభవములను తెలపండి.
No comments:
Post a Comment