Sunday, April 17, 2022

MAHILA DAY PROGRAM 19-4-2022:

 శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి హైదరాబాద్
మహిళా దినోత్సవ వేడుకలు 19-4-2022 
 


మహిళా దినోత్సవ వేడుకలు వేదిక: స్కిల్ డెవలప్మెంట్ ట్రయినింగ్ సెంటర్ (టైలోరింగ్) ఉస్మాన్ గంజ్, తోప్ ఖానా హైదరాబాద్ తేదీ: 19 - 04 - 2022  సమయం: 11 గంటలకి ప్రారంభం

స్పీకర్స్: శ్రీమతి పద్మావతి -  శ్రీమతి వాణి  - శ్రీమతి. శ్రావణి - కుమారి. శ్రావణి 

ప్రాచి - మనీషా - దీపాలి షిండే - మంగళ - జ్యోతి - ఏ  శ్రావణి - జి శిల్ప - 

కే శ్రావణి - ఎన్ కవిత, తదితరులు పాల్గొనెదరు. 


శ్రీమతి శైలేశ్వరి, శ్రీమతి భువనేశ్వరి, శ్రీమతి విజయ లక్ష్మి గార్లు జడ్జిలుగా వ్యవహరిస్తారు 

 కన్వీనర్ కోటి సమితి 

                                        19th Mahila day report 19--4-2022 

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి సేవా సంస్థల లో   ప్రతి నెల 19వ తేదీన మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకోవడం అందరికీ తెలిసినవే. అదే క్రమంలో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి ఆధ్వర్యంలో, ఉస్మాన్ గంజ్ తోప్ ఖానాలో గల స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ( టైలోరింగ్ ) లో ఈ రోజు ఘనంగా  మహిళా దినోత్సవ వేడుకలు జరిగినవి.  ఈ కార్యక్రమములో శ్రీమతి పద్మావతి -  శ్రీమతి వాణి  - శ్రీమతి. శ్రావణి ప్రాచి - మనీషా - దీపాలి షిండే - మంగళ - జ్యోతి - ఎన్ కవిత  జి శిల్ప - తదితలురు పాల్గొని, స్త్రీ మూర్తుల వైభవాన్ని, వారి గొప్పదనాన్ని, చాటి చెప్తూ, వారిలో మనము గ్రహించ వలసిన విషయాన్ని విశదీకరిస్తూ తెలియ జేశారు. సరోజినీ నాయుడు, మదర్ థెరిసా, స్వామి వారి మాతృమూర్తి ఈశ్వరమ్మ గారి జీవిత విశేషాలను వివరించారు. మరియు కొందరు వారి మాతృ మూర్తులు,  వారు  కటిక పేదరికాన్ని అనుభవిస్తూ కూడా వారిని ఏ రకంగా పెంచారో, ప్రస్తుతము వీరు వారికీ ఏ రకంగా తోడ్పడు తున్నారో, కన్నీరు కారుస్తూ వారి ప్రసంగాలను కొనసాగించారు. ఈ సంభాషణలు టైలోరింగ్ కోచ్ శ్రీమతి పద్మావతి గారిని మరియు అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.    మంగళ హారతితో కార్యక్రమము ముగిసినది. అందరి కి స్వామి వారి మొమెంటోస్ ను అందజేశారు. ఈ కార్యక్రమములో జడ్జెస్ గా శ్రీమతి శైలేశ్వరి, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, మరియు శ్రీ ఎం ఆంజనేయులు పాల్గొన్నారు. 

కన్వీనర్ చివరగా వందన సమర్పణ గావిస్తూ 24 -4 -2022 శ్రీ సత్య సాయి ఆరాధనా మహోత్సవంలో కుమారి భువన స్వరజ గారి భక్తి సంగీత కార్యక్రమానికి కుట్టు మెషిన్ వితరణ కార్యక్రమానికి హాజరు కావలసినదిగా కోరారు. 

సమితి కన్వీనర్ 

పి విశ్వేశ్వర శాస్త్రి 







6 comments:

  1. Shaileswari: సాయిరాం, ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో మహిళా దినోత్సవం ఎంతో అద్భుతంగా నిర్వహించబడింది అక్కడ స్పీకర్స్ అందరూ ఎంతో చక్కగా, మనసుకు హత్తుకునేలా మాట్లాడారు, అది
    విన్న తర్వాత స్వామి వారి యొక్క కృప మన అందరిపైనా ఎంతో ఉందని నేను భావిస్తున్నాను. ఇంత మంచి ప్రోగ్రామ్ కి నేను హాజరు అయినందుకు స్వామి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సాయిరాం 🙏.

    ReplyDelete
  2. PRACHI VIA WHATSAPP TO P V S: I.....Feel very proud today.....Thanq shastri sir padma teacher vani teacher.... afsa...Sir.....Aaap ka bhout bhout thanq...Ki.Apne...Yeh centre open kiya or thanq padma.Or vani mem or afsa....Jo aap har roj ake humko sab shikhate ho....😍

    ReplyDelete
  3. SRI H SRINIVASULU - ALL INDIA PRESIDENT. TECNO GROUP TO PVS VIA WHATSAPP: Sairam our Dear Sastry gaaru...మీరు నిన్నటి రోజు చక్కని devine కార్యక్రమాన్ని నిర్వర్తించారు... చాలా సంతోషం ప్రేమతో ఆత్మీయులు శ్రీనివాసులు సరోజినీ

    ReplyDelete
  4. BHUVANESWARI VIA TELEGRAM TO PVS: 19/4/22, మహిళా దినోత్సవం సందర్భంగా, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి వారు స్కిల్ డెవలప్మెంట్, ప్రోగ్రాం సెంటర్లో, ఎంతో ఉత్సాహపూరిత వాతావరణంలో జరగడం, శ్రీమతి ఈశ్వరమ్మ, మదర్ థెరీసా మొదలైన గొప్ప మహిళల గురించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఉన్న మహిళలు ప్రసంగించి వారి గుణగణాలను, గొప్పతనాన్ని, సేవా స్ఫూర్తిని తెలుసుకోవడమే కాక వారు నిజజీవితంలో అమలు చేయడం, వారి మాతృమూర్తులకు, స్ఫూర్తిదాయకమైన వనిత లుగా ఇంట గెలిచి, ఉత్తరోత్తర, సమాజ సేవలో పాల్గొని అందరికీ స్ఫూర్తిదాయకమైన మహిళలు గా అందరం కలిసి శ్రీ స్వామికి ఆనందం కలిగించాలని, కోరుకుంటూ
    భువనేశ్వరి

    ReplyDelete
  5. Sairam to all, the extraordinary and excellent service center who is needful and the best selection. I unable to describe more than this. Hearty thankful to Sri.P.V.Shastry Garu tp selection and conducting this service: Sairam

    ReplyDelete
  6. ARUNA CHANDA RAJU'S MESSAGE IN WHATSAPP TO PVS Very nice and well designed and reader friendly. Congratulations. And best wishes for future programmes

    ReplyDelete

YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...