భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో,ఈ సంవత్సరము, గురుపూర్ణిమ పర్వదినాన్ని (29.07.2026 బుధవారం నాడు) 106 రాయల్ ప్లాజా అపార్ట్మెంట్స్, సుల్తాన్ బజార్లోలో జరుపుకొనే భాగ్యం కోటి సమితి సభ్యులందరికి కరుణతో స్వామి అనుగ్రహించారు. భక్తి శ్రద్ధలతో, వైభవంగా ఈ పండుగ జరుపుకోవాలని మా అందరి ఆకాంక్ష.
మీరు మరియు మన సమితిలో సాయి కుటుంబ సభ్యులు అందరూ కలసి వచ్చి, నగర సంకీర్తనలో పాల్గొని, బాలవికాస్ కార్య క్రమములో భాగంగా, భగవత్ గీత శ్లోకలను, విని ఆశీర్వదించ గలరు. అదే విధముగా 5 మందికి, నేషనల్ నారాయణ సేవ కార్యక్రమములో భాగంగా పాకెట్స్ అందజేయ బడును. పిల్లకు నోట్ బుక్స్ కూడా అందజేయబడును. మా ఆహ్వానాన్ని మన్నించి,అందరూ కార్యక్రమాలు అన్నిటిలో పాల్గొని,స్వామివారి ఆశీస్సులు పొందాలని ప్రార్ధన.
