Sunday, June 28, 2026

THURSDAY NAGARA SANKEERTHANA 2-7-2026




 






ఈ నాటి నగర సంకీర్తన నివేదిక. 2 -7 -2026

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, ఈ రోజు నగర సంకీర్తన ఎంతో భక్తి శ్రద్దలతో, ఉస్మాన్ గంజ్ లో గల వీధులలో  జరిగినది. ఈ నాటి కార్యక్రమములో, మొత్తము 5 మంది భక్తులు పాల్గొన్నారు. ఉస్మాన్ గంజ్ లో గల శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ టైలోరింగ్, నుండి 21 సార్లు  ఓంకారం, సుప్రభాతం, వేదపఠనం, ప్రారంభ మైనది. 
నగర సంకీర్తన అంటే ఉదయం బ్రహ్మ ముహూర్తంలో, భక్తులు కలిసి, భగవాన్ నామ స్మరణ చేస్తూ,వీధులలో భజనలు పాడటం.  ఈ నగర సంకీర్తన వల్ల,మనసు పవిత్రమవుతుంది. భగవన్నామము మనలోని చెడు ఆలోచనలను తొలగిస్తుంది.  పరిసరాలు శుద్ధి అవుతాయి. దైవ నామ ధ్వని,సాత్విక వాతావరణాన్ని సృష్టిస్తుంది.  సమాజంలో ఐక్యత పెరుగుతుంది. అందరూ కలిసి భజనలు చేయడం వల్ల ప్రేమ, సోదర భావం పెరుగుతాయి.  రోజంతా ఆధ్యాత్మిక చైతన్యం ఉంటుంది. ఉదయం దైవస్మరణతో ప్రారంభించిన రోజు ప్రశాంతంగా సాగుతుంది.  దైవానుగ్రహం లభిస్తుంది.  నామస్మరణ కలియుగంలో, అత్యంత సులభమైన సాధనమని బాబా చెప్పారు.  సత్య సాయి బాబా తరచూ చెప్పిన భావం :  నగర సంకీర్తనలో మీరు వీధులను మేల్కొల్పడం కాదు. మీ హృదయంలోని దైవత్వాన్ని మేలుకొలుపుతున్నారు. నగర సంకీర్తన లో పాల్గొనడం ద్వారా వ్యక్తిగత శాంతి, కుటుంబ శ్రేయస్సు, తప్పకుండా కలుగుతాయి కలుగును అని స్వామి వారు అన్న మాటలను వివరంచి,  గణేష్, గురు,  మాత, భజనలు మరియు అనేక భజనలతో  కొనసాగినది. చివరగా నరసింహ రావు స్వామి వారికీ మంగళహారతి సమర్పణతో, పాల్గొన్న ప్రతిఒక్కరు  అందరు సంతోషించినారు. 

పాల్గొన్న వారు. 

1) కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి, 2) శ్రీ ఎం ఎల్ నరసింహ రావు, 3) శ్రీ ప్రకాష్, 4 
వెంకట లక్ష్మి గారు, సాయి రూప   అందరు ఎంతో ఆనందంతో, వచ్చే గురువారం, వారి స్నేహితులతో వస్తామన్నారు. ప్రకాష్ గారు సూచించిన ప్రకారం వచ్చే గురువారం అందరికి తెలిసిన చిన్న చిన్న భజనలు పాడి కార్యక్రమమును    మరింత శ్రావ్యంగా ఉంటుందన్నారు. 

No comments:

Post a Comment

101 BIRTHDAY CELEBRATIONS - AT PRASHANTI NILAYAM CIRCULARS ETC.,

  PRASHANTI SEVA SADHANA 90309 13135 - Saraswathi garu please motive Sevadal Gents and Ladies for 14 to 25 at least 10 each NSS Program Co-o...