Saturday, February 10, 2018

SRI LALITHA SAHASRANAAMA PAARAYANAM & KUMKUMA POOJA 10-2-2018





Report on sri lalitha sahara naama paarayanam and kumkuma pooja 10-2-2018 organised in Pulla reddy bulding 6th Floor Abids, Hyderabad
శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి ఆధ్వర్యములో, 10-2-2018న నిర్వహించిన శ్రీ లలిత సహస్ర నామ యజ్ఞాన్నీ  శ్రీ విద్యా ఆరాధకులు, శ్రీ వి వి ఎల్ నరసింహం, తదితరులు, జ్యోతి ప్రకాశనం గావించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పారాయణమును,  కుంకుమ పూజను నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమములో ముఖ్య అథితిగా పాల్గొన్న శ్రీ విద్యా ఆరాధకులు, శ్రీ వి వి ఎల్ నరసింహం, భక్త గాణానికి లలిత సహస్ర నామ ప్రాశస్యామును, ఆ నామాలను పారాయణము చేయాల్సిన విధానంపై సోదాహరణముగా వివరించారు. నిగూడార్ధము కల్గిన లలిత సహస్ర నామాలపై సమగ్ర అవగాహనను పెంపొందించుకొని ఆ జగన్మాతను అర్చించే భక్తులకు అమ్మ అనుగ్రహాము ఉంటుందని శ్రీ నరసింహం తెలిపారు. ఈ పవిత్ర యజ్ఞంలో అల్మాసగూడ లోని లలిత సహస్ర నామ మిత్ర మండలి మహిళా సభ్యలు అధికసంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. పారాయణము అనంతరము ప్రముఖ గాయని  శ్రీమతి రేవతి  జగన్మాత వైభావాన్ని వర్ణిస్తూ గానం చేసి భక్తులను ఆకట్టుకున్నారు. శ్రీ సత్య సాయి సంస్థలు, కోటి సమితి కన్వీనర్ వందన సమర్పణ గావిస్తూ, స్వామికి, స్వామి చిరకాల భక్తులు, గబ్బా సాగర్ గారు, సురేష్ రేణిగుంట,  మంగళ హారతి సమర్పణ తో ఈ పవిత్ర కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.
ఈ పవిత్ర కార్యక్రమములో, శ్రీమతి రేవతి, శ్రీమతి వెలివేటి అరుణ , శ్రీమతి అన్నపూర్ణ, శ్రీమతి శ్రీవల్లి, శ్రీమతి శ్రీ శారదా సుప్రియ, శ్రీమతి పద్మజా, శ్రీమతి సునీత, శ్రీమతి శ్రీ  బృందం, రాజ్యలక్ష్మి బృందం, వరలక్ష్మి బృందం, శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ (టైలారింగ్ ) శిక్షణ పొందుతున్న వారు, పాల్గొన్నారు.










Wednesday, February 7, 2018

Radio Report on Sri Tyagaraja Aaradhanostavam 26-1-2018

7-2-2018

ప్రపంచ వ్యాప్తముగా విటుంన్న రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆసిస్సులతో,   శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, హైదరాబాద్ వారు 26-1-2018 న సత్య సాయి భగవానుడు నడయాడిన శివమ్ ప్రాంగణంలో, వర్ధమాన, సుప్రసిద్ధ, 50 మంది కళాకారులతో, శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం “ బంటురీతి ” ఘనరాగ పంచరత్న కీర్తనల  రేడియో సాయి రిపోర్ట్ రేపు అనగా 8-2-2018 న వినండి,    www.radiosai.org టైపు చేసి  తెలుగు స్ట్రీమ్ లో ఉదయం 10-20 మరియు రాత్రి 9-20 వినగలరు. వీలుకాని  వారు ఈ క్రింద నున్న లింక్ ను నొక్కి విని ఆనందించండి అందరికి షేర్ చేయ గలరు.

pl click

Radio Report on Sri Thagaraja Aaradhanostavam 26-1-2018


ప్రపంచ వ్యాప్తముగా విటుంన్న రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి, హైదరాబాద్, వారి ఆధ్వర్యములో శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం ను 26-1-2018 న శివమ్ ప్రాగణంలో నిర్వహించిన సంగతి విడితమే.. తత్ సంబంధమైన రేడియో రిపోర్ట్ ను క్రింద నున్న లింక్ ను నొక్కి వినండి. ఆనందించండి.  

Friday, February 2, 2018

Invitation of Tandularchana, held on 4-2-2018 , Report, Photos Link, Video Link, & Press Clippings




Tandularcharna report DT 4-2-2018

శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటీ, సమితి, హైదరాబాద్, ఆధ్వర్యములో, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహముతో " సాయి గాయత్రీ జపం మరియు తండులార్చన " కార్యక్రమము,  ఈ రోజు అనగా  తేది : 4-2-2018 న    భక్తులు, సేవదాల్ సభ్యులు, మనోరంజితం  విద్యార్ధులు, కోటి సమితి దత్తత తీసుకున్న శ్రీ సత్య సాయి విద్య జ్యోతి విద్యార్థులు,  అందరూ   సాయి గాయత్రీ జపం మరియు తండులార్చన లో ఆబిడ్స్ లో గల జి.  పుల్లారెడ్డి భవనములో నున్న శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్, హాలు,  నిరాడంబరముగా, అత్యంత భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు.

బాలవికాస్ ఇంచార్జి,  శ్రీమతి శ్రీ సీతా మహాలక్ష్మి,  బాలవికాస గురువు శ్రీమతి రేణుక గార్లు, కన్వీనర్  విశ్వేశ్వర  శాస్త్రి జ్యోతి  ప్రకాశనము గావించగా

బాలవికాస్ ఇంచార్జి, బాలవికాస్ గురువులు,  కన్వీనర్, అందరు కలసి, గాయత్రీ మంత్రము యొక్క విశిష్టతను, తాడులార్చన గురించి తెలుపగా “తండులార్చన” కార్యక్రమము, ప్రారంభమైనది. అందరికి, పళ్ళెము, పంచముఖీ,వేద మాత గాయత్రి హృదయ మద్య మందు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారున్న   చిత్రపటము, బియ్యము, ఇచ్చి,   మంత్రము విశిష్టతను తెలిపిన తదుపరి, తండులార్చన  కార్యక్రమము, 108 సార్లు అందరు కలసి  "ఓం సాయీశ్వరాయ విద్మహే, సత్య దేవాయ ధీమహి తన్న: స్సర్వ ప్రచోదయాత్ " మంత్రమును  పలుకుతూ, తండులార్చనతో   , శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్, హాలు,  6 వ అంతస్తు, మరుమ్రోగినది.

ఈ మధ్యనే గ్రూప్ 3 పూర్తిచేసుకున్న బాల వికాస్ విద్యార్థులకు, అసిస్టెంట్ కమీషనర్ అఫ్ పోలీస్, శ్రీ శ్రీకాంత్ గారు, ముఖ్య అతిధి గా విచ్చేసి, మాస్టర్ సాయి కుమార్, మాస్టర్ శశివాదన్, మాస్టర్ సాకేత్,  కుమారి సాయి వాణి, సాయి లక్ష్మి, కుమారి బి పావని గార్లకు,   ప్రశంశా పత్రములను Mr & Mrs Srikant garlu  బహుకరించారు. శ్రీకాంత్ గారు  మాట్లాడుతూ, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి, కార్యక్రమాలలో తానూ కూడా భాగస్తుడిని చేసినందుకు, తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ,  కోటి సమితి నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను, ప్రశంసిస్తూ, కోటి సమితి సభ్యలను అభినందించారు.

 ఈ పవిత్ర కార్యక్రమములో, మొత్తము 50  మంది, పాల్గొని, స్వామి దివ్య అనుగ్రహమునకు, పాత్రులైనారు.  అసిస్టెంట్ కమీషనర్ ( crimes ) sri శ్రీకాంత్  గారు భగవానునికి, హారతి, సమర్పణతో కార్యక్రమము, ముగిసినది.


Photos Link.



Video link




101 BIRTHDAY CELEBRATIONS - AT PRASHANTI NILAYAM CIRCULARS ETC.,

  PRASHANTI SEVA SADHANA 90309 13135 - Saraswathi garu please motive Sevadal Gents and Ladies for 14 to 25 at least 10 each NSS Program Co-o...