Monday, April 22, 2019

24-4-2019 - Sri Sathya Sai 8th Aaradhanostavam @ SLATE THE SCHOOL.Report and Press clippings




Intro- Revathi 


శ్రీమతి విన్నకోట రేవతి తన సంగీత ప్రదర్శనలను తన ఎనిమిదవ ఏట ప్రారంభించి,  దేశ విదేశాలలో వేలాది ప్రదర్శనలు ఇచ్చి ఎంతో మందిని మంత్ర ముగ్ధులను చేసింది. దాదాపు 20 కి పైగా చిత్రాలలో తన గళాన్ని వినిపించిన తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలకి పరిమితమైంది. తాను సమర్పించిన అన్నమాచార్య కీర్తనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు బహుముఖ ప్రశంసలు అందుకున్నాయి. తను సత్యసాయి భగవానుని పై శ్రీ సత్య సాయి సేవ సంస్థలు  కోటి సమితి  వారి ఆధ్వర్యం లో పాడిన సి.డి లోని గీతాలు, చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గాన సభ వేదికగా నిర్వహించిన శ్రీ సాయి సంగీత ఆరాధన భక్తుల ప్రశంసలు అందుకున్నాయి.భగవాన్  సత్యసాయి వారితో  రేవతికి ఉన్న అనుభందం వర్ణనాతీతం. భారత మాజీ ప్రధాని శ్రీ అట్టాల్  బిహారి వాజ్ పై గారి చేతుల మీదగా శ్రీ అల్లూరి సీతారామరాజు యూత్ టాలెంట్ అవార్డు అందుకుంది.  జాతీయ స్థాయి వరుసగా 11  సార్లు ఉత్తమ గాయని గా బహుమతి పొందింది. ఎన్నెన్నో గీతాలకు తన సంగీత దర్శకత్వం  వహించడంమే  కాకుండా వాద్య సహకారాన్ని కూడా  సమకూర్చింది. ఈనాటి శ్రీ సత్యసాయి 8 ఆరాధనోత్సవాలలో వారు పాల్గొనడము నిజంగా స్వామి వారి సంకల్పంగా భవిస్తూ వారిని స్వామి వారి వద్ద పుష్ష్పములనుంచి కార్యక్రమాన్ని  ప్రారంభించవలసినదిగా కోటి సమితి పక్షాన, సవినయముగా కోరుచున్నాము.  

JAI SAI RAM 
REPORT

 శ్రీ సత్య సాయి బాబా వారి  8 ఆరాధనోత్సవ కార్యక్రమము

భగవాన్ శ్రీ సత్య సాయి దివ్య ఆసిస్సులతో, శ్రీ సత్య సాయి బాబా వారి 8 ఆరాధనోత్సవ కార్యక్రమము గన్ ఫౌండ్రి లో గల స్లాట్ ది స్కూల్, మినీ కాన్ఫరెన్స్ హాల్ లో శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి ఆధ్యరంలో, ఎంతో భక్తి శ్రద్దలతో రోజు ఉదయం 24-4-2019 ఉదయము 9-00 గంటలకు వేద పఠనం తో ప్రారంభమై, ఒక గంట ,  ఎంతో మధురమైన మధురమైన భజనలను ఆలపించారు.
తదనంతరం, నాటి శ్రీ సత్య సాయి  8 ఆరాధనోత్సవ కార్యక్రమము లో భాగంగా, ప్రముఖ గాయని మన్నవ రేవతి ( విన్నకోట ) భక్తి సంగీత కార్యక్రమమును, ఫౌండర్, వ్యవస్తాపక అధ్యక్షులు శ్రీ వాసి రెడ్డి అమర్నాథ్, శ్రీమతి శర్మద, గాయని మన్నవ రేవతి,కోటి,  సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి తదితరులు జ్యోతి ప్రకాశం గావించగా, గాయని మన్నవ రేవతి, గంటన్నర సేపు, భక్తులను మంత్రం ముగ్దులను గావించింది. స్వామిని మేలుకొలుపు పాటలో భాగంగా, మేలుకో, మేలుకో సాయి సర్వేశ్వరా, సాయి ఈశ్వర, పరమ పావన మైన శ్రీ సాయి పాదాలు, అనే పాటలకు  భక్తులు తమ కరతాళ ధ్వనులతో, వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు.
శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి పక్షాన, స్వామి వారి ప్రేమను, ఒక జ్ఞ్యాపిక ద్వారా శ్రీ వాసి రెడ్డి అమర్నాథ్ గారు  మరియు నూతన వస్త్రములను శ్రీమతి శర్మద గాయని రేవతి కి అందజేశారు.
శ్రీ వాసి రెడ్డి అమర్నాధ్ గారు మాట్లాడుతూ, కార్యక్రమాన్ని ఇక్కడ స్లాట్ ది స్కూల్ ప్రాంగణంలో జరిపించినందుకు, కోటి సమితి సభ్యులకు, కృతజ్ఞ్యతలు తెలుపుకుంటూ, స్వామి వారి దివ్య ఆశీస్సులు, మా స్లాట్ కుటుంబం పై ఉన్నందుకు ధన్యవాదములు తెలిపారు.

కార్యక్రమములో ప్రముఖ భజన గాయకుడు, శ్రీ శంకర్ శ్రీరాంభొట్ల, శ్రీ బి వి సత్య ప్రసాద్, శ్రీ విధ్యా ఆరాధకులు శ్రీ వి వి ఎల్ నరసింహం,మహిళా ఇంచార్జి, విజయలక్ష్మి,  బాలవికాస్ గురువులు, శ్రీమతి కళ్యాణి, శ్రీఅనూప్ కుమార్, సేవాదళ్ సభ్యులు, ఒకేషనల్ ట్రైనింగ్ TAILORING లో 11 బ్యాచలో శిక్షణ పొందుతున్నమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ వాసిరెడ్డి అమర్నాథ్ గారు శ్రీమతి శర్మద, గాయని మన్నవ రేవతి, భగవానునికి మంగళ హారతి సమర్పణతో, కార్యక్రమము దిగ్విజయముగా  ముగిసినది.

10 రోజుల ఉచిత వేసవి శిక్షణా శిభిరము

కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి, వందన సమర్పణ గావిస్తూ, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి, మే 9 తేది నుండి మే 18 వరకు 10 రోజుల ఉచిత వేసవి శిక్షణా శిభిరమును ఉదయం 8-30 గంటలనుండి  సాయంత్రము 3 గంటల వరకు, 8 సంవత్సరము నుండి 15 సంవత్సరము వయస్సుగల బాల బాలికలకు, ఆబిడ్స్ లోగల  జి.పుల్లరెడ్డి భవనంలో  నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు.ఆసక్తిగలవారు 9110308898 -  8886509410 SMS ద్వారా పేరు నమోదు చేసుకోవన్నారు.  
సమితి కన్వీనర్  విశ్వేశ్వర శాస్తి,  ఫొటోస్ జత చేయడమైనది.








Wednesday, March 20, 2019

Press Clippings & Links of Tori Radio, U Tube Videos., etc.,










REPORT:

Report dated 19-3-2019
శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి హైదరాబాద్, ప్రతి నెల 19 తేదీన నిర్వహించే మహిళా దినోత్సవ  కార్యక్రమాన్ని నెల కూడా అబిడ్స్, లో గల జి పుల్ల రెడ్డి భవన్ 6 అంతస్తులో గల శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్ ప్రాంగణంలో  అత్యంత భక్తి శ్రద్దలతో ఉదయం 11-30 తో 1 గంట వరకు జరిగినది.

నాటి  విశేష మహిళా దినోత్సవ కార్యక్రమమునకు, ముఖ్య అతిధి గా విచ్చేసిన  శ్రీమతి కళ్యాణి గారు, వేదం పండితులైన బ్రహ్మశ్రీ శ్రీధర శర్మ, శ్రీ దివాకర్ గారు జ్యోతి ప్రకాశనం గావించగా, కార్యక్రమము ప్రారంభించబడినది.

10 బ్యాచ్ టైలారింగ్ లో   శిక్షణ పొందిన, శ్రీమతి ప్రియా సాహు, మహాసాధ్వి సుమతి, గూర్చి, 11 బ్యాచ్ లో శిక్షణ పొందుతున్న శ్రీమతి  అశ్విని,   ఝాన్సీ రాణి గారి గూర్చి, మాట్లడి, అందరి మన్నలను పొందినది
10-3-2019 శ్రీ తాగరాయ గాన సభలో, ఆరు గంటల నిర్విరామ గానంతో, అశేష శ్రోతల్ని మంత్రముగ్దుల్ని చేసి విశేష ప్రజ్ఞను ప్రదర్శించి  విశిష్ఠఅంతర్జాతీయ వండర్ బుక్రికార్డు సాధించిన శ్రీమతి ఆలూరు కళ్యాణి, నాటి  విశేష మహిళా దినోత్సవ కార్యక్రమమునకు, ముఖ్య అతిధిగా విచ్చేసి వారు మాట్లాడుతూ, వారి స్వానుభవాలను విపులంగా తెలియజెసి, కేవలము ప్రజ్ఞ సంగీత కార్యక్రమాలలోనే  కాకుండా, మీరు కూడా అంటే ఒకేషనల్ ట్రైనింగ్ శిక్షణ పొందుతున్నవారికి స్ఫూర్తినిచ్చే విధంగా, అనేక ఉదా హరణములతో, వండర్ బుక్ అఫ్ రికార్డ్స్ సాధించిన సందర్భములో పాడిన కొన్ని పాటలను కూడా పాడి అందరి ప్రశంసలు పొందినారు.
స్వామి చిరకాల భక్తులు, గేయ  రచయిత్రి, స్వరకత్రి , గాయని, ఆలూరు కళ్యాణి, శాస్త్రీయ, లలిత, సంగీత పద్దతులలో రచించి, స్వర పరచిన, పలు భక్తి గీతాలను, ఆరు గంటల పాటు నిర్విరామంగా మధురంగా గానం చేసి, అంతర్జాతీయ వండర్ బుక్ అఫ్ రికార్డ్స్లోలో స్తానం సంపాదించుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని రోజు, శ్రీమతి కళ్యాణి గారికి,  ఒక ప్రత్యేక మొమెంట, శాలువకోటి సమితి  పక్షాన శ్రీమతి పద్మావతి, శ్రీమతి సునీత, శ్రీమతి ప్రియా సాహు, శ్రీమతి శిరీష బహుకరించారు.
కోటి సమితి  కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి, స్వాగత వచనాలు, మరియు వందన సమర్పణ గావించిన తదనంతరము స్వామివారికి మంగళ హారతితో, కార్యక్రమము ముగిసినది.

ఫోటో జతచేయడమైనది.
Samithi Convenor
P Visweswara Sastry.



PL CLICK HERE TO VIEW VEDA ASEERVACHANAM TO SMT KALYANI BY SRI S SREEDHARA SHARMA. 

PL CLICK HERE TO VIEW SRI V S R MOORTHY'S SANDESHAM TO SMT KALYANI. 





WEDNESDAY & THURSDAY NAGARA SANKEERTHA - KOTI SMAITHI. 26-8-2026 AND 27-8-2026

   *Report on Today’s Nagar Sankirtana – 26-08-2026*  With the Divine Grace and Blessings of Bhagawan Sri Sathya Sai Baba, today’s Nagar San...