Thursday, May 11, 2017

5TH VOCATIONAL TRAINING CONVOCATION 9-6-2017 Report & Photos.

Report On 5th batch Vocational Training Convocation
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి , హైదరాబాద్, ఒకేషనల్ ట్రైనింగ్ లో టైలరింగ్ లో 5 బ్యాచ్ లో 1-3-2017 నుండి 2-6-2017 వరకు దాదాపు  90 రోజుల శిక్షణ పూర్తి గావించిన 20 మందికి, ఒకేషనల్ ట్రైనింగ్ కవొకేషన్ ను అబిడ్స్, జి. పుల్లారెడ్డి భవనము లో గల శ్రీ సత్య సాయి సాయి స్టడీ సర్కిల్,  ప్రాంగణములో, రోజు సాయంత్రము 4-30 గంటలకు, వేదపఠనము, భజన, స్వామి వారి దర్శనముతో,  కార్యక్రమము  ప్రారంభము గావించబడినది.  కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి స్వాగత వచనములు పలుకిన తదనంతరము నాటి కార్యక్రమమునకు ముఖ్య అతిధిగా విచ్చేసిన, తెలంగాణ మరియు  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షలు   శ్రీ ఎస్ జి చలమ్, జ్యోతి ప్రకాశనం గావించారు. శ్రీమతి రేణుక, ఒకేషనల్ ట్రైనింగ్ కార్యక్రమ వివరాలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు, 100 మంది, శిక్షణ పొందినట్లు, తెలియజేసారు.        
          రాష్ట్ర అధ్యక్షలు శ్రీ ఎస్ జి చలమ్, సుశిక్షితులైన 20 మందికి, సర్టిఫికెట్స్ బహుకరణ, మరియు ఏప్రిల్ మాసములో నిర్వహించిన,  సమ్మర్ క్యాంపు లో పాల్గొన్న 30 మంది బాల బాలికలకు సర్టిఫికెట్స్ బహుకరణ, మరియు, సత్య సాయి సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ లో వైద్యము పొందిన కుటుంబము నకు నేషనల్ నారాయణ సేవ గా, బియ్యము, కందిపప్పు, నూనె, అందించి, 4 బ్యాచ్లో శిక్షణ పొందిన కుమారి జ్యోతి కి ఒక కుట్టు మిషన్ కూడా కోటి సమితి పక్షాన బహుకరించారు.  
రాష్ట్ర అధ్యక్షలు,  మాట్లాడుతూ, మహా పట్టణములో ఇంత మంది ఉండగా వీరే   ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ పొందారంటే, ఇది కేవలం, స్వామి సంకల్పమే అని అంటూ, కార్యమైనా, భక్తితో, నిష్ఠతో, కొనసాగించాలని, మీరు కొనసాగించారని, పాల్గొన్న ప్రతి వారికీ అభినందనలు, తెలుపుతూ, కోటి సమితి సభ్యులను, టైలారింగ్  కోచ్  పద్మావతి గారిని,   కోటి సమితి బాలవికాస్ విద్యార్థులకు, శుభాకాంక్షలు తెలియ జేస్తూ,  మీరు కూడా మాతో అనేక సమాజ  సేవ కార్యక్రమాలలో, పాల్గొని, మన మంతా స్వామి దివ్య ఆసిస్సులు, పొందుదామన్నారు.

కార్యక్రమములో, హైదరాబాద్  జిల్లా అధ్యక్షులు శ్రీ ఎం వి ఆర్ శేష సాయి,డాక్టర్ . కృష్ణ కుమార్, విష్ణు వర్ధన్, లక్ష్మ రెడ్డి,   శ్రీమతి సీత మహాలక్ష్మి, పద్మజ, రేణుక, విజయ లక్ష్మి, సునీత, తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్య సాయి సేవ సమితి, కోటి సమితి పక్షాన, రాష్ట్ర అధ్యక్షలు శ్రీ ఎస్ జి చలం గారిని  సమితి సభ్యులు అందరూ కలసి, సముచితముగా, సత్కరించుకొని, ఆనంద పడ్డారు. రాష్ట్ర అధ్యక్షలు, శ్రీ ఎస్ జి. చలం  భగవానునికి, మంగళ హారతి సమర్పణతో, కానవొకేషన్ కార్యక్రమము, ముగిసినది.

కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ గావిస్తూ, 6 బ్యాచ్ టైలరింగ్ లో శిక్షణ స్థానికుల నుండి సెల్ నెంబర్ లో 94404 09410,. 88865 09410, సంప్రదించి, పేరు నమోదు చేసుకోవలసిందిగా కోరారు.
ఫోటో జత చేయడమైనది.


VISWESWARA SASTRY

KOTI SAMITHI CONVENOR. 
Please ">Click Here to See 5TH VOCATIONAL TRAINING CONVOCATION 9-6-2017 PHOTOS



Sunday, May 7, 2017

Abhisekam at Shivam 7-5-2017

భగవాన్ శ్రీ సత్య సాయి భగవాన్  దివ్య అను గ్రహముతో ప్రతి నెల 7 వ తేదీన, కోటి సమితి సభ్యులకు, మహాశివరాత్రి, పర్వదినోత్సవ శుభ సందర్భమున, మన శివమ్ మందిర ప్రాంగణములో, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరుకు నిర్వహించ సంకల్పించడమైనది. ఈ కార్యక్రమును కూడా,  రోజు ఒక సమితి వారు, అభిషేక కార్యక్రములో పాల్గొనే విధముగా ప్రణాళిక సిద్ధం చేసిన సందర్భముగా, కోటి సమితి కి, అభిషేకము 7 వ తేదీని మరియు 22 వ తేదీ లను కేటాయించారు.  ఈ అభిషేకము మరియు శ్రీ చక్ర పూజ  కూడా భక్తి, శ్రద్దలతో, జరిపించిన స్వామి కి , హృదయ పూర్వక నమ సుమాంజలులు. తెలుపుకుంటూ సాయి రామ్.. ఈ నాటి అభిషేకమ్ లో శ్రీ మెట్టు వేణూ కుమార్ దంపతులు పాల్గొన్నారు.
Please ">Click Here to See Abhisekham Photos at Shivam 7-5-2017

Friday, April 14, 2017







Please Click Here to See 6th Aadhanostavam of Bhagawan Sri Sathya SAi Baba, Photos - Sri Sowmya Program

Please click here  to See 6th Aadhanostavam of Bhagawan Sri Sathya SAi Baba, Video  - Sri Sowmya Program

Monday, April 3, 2017

హేవిళంబి - శ్రీ రామ నవమి - రేడియో సాయి - ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాల్లో భాగంగా శ్రీ సత్య సాయి సేవ సంస్థల కోటి సమితి వారికీ స్వామి ప్రసాదించిన " రామదాసు " నాటిక..

హేవిళంబి - శ్రీ రామ నవమి - రేడియో సాయి -  ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాల్లో భాగంగా శ్రీ సత్య సాయి సేవ సంస్థల కోటి సమితి వారికీ స్వామి ప్రసాదించిన  " రామదాసు " నాటిక.. ఈ నాటికను అతి తక్కువ సమయంలో, రేడియో సాయి వారికీ ( గణేష్ గారికి ) అందించే భాగ్యము కలుగ జేసినందుకు, స్వామి వారికి, సహకరించిన వారికీ అందరికి స్వామి వారి దివ్య అసిస్సులు ఉండాలని కోరుకుంటూ, ఈ ధ్వని ముద్రణను 2-30 నిమిషములకు జి పుల్లారెడ్డి భవనము 6 వ అంతస్థులో ప్రారంభించి,  7-30 గంటలకు  ముగిసినది. ఈ నాటిక నిడివి 22 నిమిషములు., పాటలు మ్యూజిక్ ఆడ్ చేసిన 25 నిమిషములకు రావోచ్చును. ఈ నాటికలోని పాత్రలు - పాత్ర దారులు --- తండ్రిగా, రాజన్నగా, తానీషాగా శ్రీ పి సత్య నారాయణ  ప్రసాద్ గారు, తల్లి గా శ్రీమతి లక్ష్మి గీత గారు, గోపన్నగా శ్రీ బి సురేష్ కుమార్ గారు, దమ్మక్క గా కుమారి స్నిత, అబిద్ గా మరియు రంగన్న గా రంజాన్ అలీ గారు, భటుడుగా జవేడేగా, బొఇయిగా శ్రీ నిరంజన్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమమును ధ్వని ముద్రణ శ్రీ పి విశ్వేశ్వర శాస్త్రి. అందరు రేపు అనగా శ్రీ రామ నవమి సందర్భముగా రేడియో సాయి లో 5-4-2017 న ఉదయం 10-30 నుండి సాగే  ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంలో ఈ రామదాసు నాటకమును విని ఆనందించగలరు. ఈ ఫొటోస్ మన పుల్లారెడ్డి భావనములో రిహార్సల్స్ లో తీసినవి.   క్రింద నివ్వబడిన  radio sai link ను   నొక్కి తెలుగు స్ట్రీమ్ లోకి వెళ్లి వినగలరు. 



Please Click Here for listening the Sri Ramanavami Navami Live Program Link. including Rama Das Drama. Please Click Here for downloading the Sri Ramanavami Navami Live Program Link. including Rama Das Drama Please do send your valuable feedback to listener@radiosai.org

Saturday, March 25, 2017

KOTI SAMITHI BAL VIKAS PROGRAM IN MAURITIUS RADIO BROADCASTING.

Please Click Here to see live program of Sri Sanjeeva Narasimha Appadu in MBC last 10 minutes Koti Samithi Balvikas Program


Tuesday, March 21, 2017

శ్రీమతి రజిత, గారి నివాసములో భజన - 21-3-2017


భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆసిస్సులతో, శ్రీమతి రజిత, గారి నివాసములో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి సభ్యులచే, అత్యంత భక్తి శ్రద్దలతో, భజన కార్యక్రమమును, జరిపించిన స్వామికి, హృదయపూర్వక, కృతజ్ఞతలు, తెలుపుకుంటూ, ఈ భజన లో, శ్రీ ప్రభాకర్, శ్రీ రాంచందర్, శ్రీ వెంకటేశ్వర నాయుడు, శ్రీ వసంత రావు, శ్రీ చల్లమల్ల లక్ష్మారెడ్డి, శ్రీమతి విజయ లక్ష్మి, శ్రీమతి రేణుక, శ్రీమతి, భజన, శ్రీమతి ఆరాధన లు పాల్గొన్నారు. శ్రీమతి రజిత గారింట్లో, భజన తోట్ట తొలిసారిగా జరిగిన  భజన. వేదము, అష్టోత్తర పూజ, తో భజన, నామస్మరణా, విశిష్టత, గూర్చి శ్రీమతి భావన గారు తెలుపగా, శ్రీమతి రజిత దంపతులు, స్వామి వారికీ మంగళ హారతి సమర్పణతో, భజన సంపూర్ణమైనది. జై సాయిరాం. 

Wednesday, March 15, 2017

KOTI SAMITHI. WEDNESDAY & THURSDAY NAGARA SANKEERTHANA - 2-9-2026 & 3-9-2026

          KOTI SAMITHI. WEDNESDAY & THURSDAY  NAGARA SANKEERTHA NA -  2-9-2026 & 3-9-2026  11 వ ( వారం )  నగర సంకీర్తన.  భగవాన్ శ్రీ...