KOTI SAMITHI.WEDNESDAY & THURSDAY
NAGARA SANKEERTHANA - 2-9-2026 & 3-9-2026
11 వ ( వారం ) నగర సంకీర్తన.
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, ఈ రోజు 3-9-2026 నగర సంకీర్తన ఎంతో భక్తి శ్రద్దలతో, ఉస్మాన్ గంజ్ లో గల వీధులలో జరిగినది. ఈ నాటి కార్యక్రమములో, మొత్తము 8 మంది భక్తులు పాల్గొన్నారు. ఉస్మాన్ గంజ్ లో గల శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ టైలోరింగ్, నుండి 21 సార్లు ఓంకారం, సుప్రభాతం, వేదపఠనం, ప్రారంభ మైనది.
నగర సంకీర్తన అంటే ఉదయం బ్రహ్మ ముహూర్తంలో, భక్తులు కలిసి, భగవాన్ నామ స్మరణ చేస్తూ,వీధులలో భజనలు పాడటం. ఓంకారం, సుప్రభాతం, వేద పఠనం తరువాత నాటి నగర సంకీర్తనలో, గణపతి ఓం, గణపతి ఓమ్, గురు బాబా గురు బాబా, జగన్మాతే జాగా జనని, సాయి నారాయణ నారాయణ, హరినామ్ ఘాట్ చెలో, సాయి నామ్ ఘాట్ చేలో, హరి హరి హరి స్మరణ కరో, ఆనందసాగర మురళీధర, భగవాన్ సత్యసాయి బాబా వారి గళంలో, హరిభజన బినా సుఖ శాంతి నహి, అనే భజనలను ఏంతో భక్తి శ్రద్దలతో ఆలపించారు. భజనలతో కొనసాగినది. చివరగా నరసింహ రావు స్వామి వారికీ మంగళహారతి సమర్పణతో, పాల్గొన్న ప్రతిఒక్కరు అందరు సంతోషించినారు.
ఈ రోజు నగర సంకీర్తన అనంతరం, 11 వారములు పూర్తి అయిన సందర్భముగా ఒక చిన్న సమీక్ష కార్యక్రమము నిర్వహించు కున్నాము. అందరు ఏంతో సంతృప్తి కరమైన విషయములు, అందిస్తూ , ఇక వచ్చే గురువారం నుండి ద్విగుణీకృత మైన ఉత్సహంతో పాల్గొనే విధముగా అందరు వారి సంతోషాన్ని వక్తం చేస్తూ, తాళములు మరింత శ్రావ్యంగా వాయించుటకు, మరియు అందరు ఓంకారమును, మరియు భజనను ఏక కంఠంతో, పాడే విధముగా స్వామిని ప్రార్ధించారు.
కన్వీనర్ తన సంతోశాన్ని వ్యక్తం చేస్తూ, త్వరలో, బేగంబజార్ లో సుధాకర్ పాటిల్ నేతృత్వంలో, శుక్రవారం జరుపుటకు, ప్రణాళిక ను కూడా సిద్ధం చేస్తున్నారు.
ఇంత వరకు, 11 బుధ వారములు 11 గురువారములు నగర సంకీర్తన అంటే 22 నగర సంకీర్తనలు జరిగినవి. కన్వీనర్ మాట్లాడుతూ, తానూ 21 నగర సంకీర్తనలలో పాల్గొన్నానని, అదే విధముగా అందరు వారి వారి ఏరియాలలో తప్పకుండా హాజరు కావలసినదిగా, కోరారు.
4 వ తేదీన శివమ్ లో జరిగే కృష్ణ జన్మ వేడుకలు గూర్చి సవివరముగా తెలిపి, మనమంతా స్వామి సేవలో పాల్గొని, స్వామి అనుగ్రహాన్ని మనం నిరంతరం పొందుతూ ఉండాలని కోరారు.


.jpeg)
.jpeg)
సాయిరాం 🙏
ReplyDelete