Friday, November 13, 2026

PRESS NOTE DT 14-11-2026 101 BIRTH DAY CELEBRATIONS AT SIVAM.

 PRESS NOTE DT 14-11-2026

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి ట్రస్ట్, తెలంగాణ మరియు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, శివం, హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 101వ జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని, 2026 నవంబర్ 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు భగవానుడు నడయాడిన హైదరాబాద్, విద్యానగర్ లో గల శివమ్ మందిర ప్రాంగణంలో వారం రోజులపాటు వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు భక్తి కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

భగవాన్ వారి పవిత్ర జీవితం, విశ్వప్రేమ, మానవతా విలువలు మరియు నిస్వార్థ సేవా సందేశాలను స్మరించుకుంటూ ఈ వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో నిర్వహిస్తున్నారు.

కార్యక్రమ వివరములు 

ప్రతిరోజూ ఉదయం 5.00 గంటలకు ఓంకారం, సుప్రభాతంతో కార్యక్రమాలు ప్రారంభమై, 5.15 గంటలకు నగర సంకీర్తన, 9.30 గంటలకు నిత్య పూజ మరియు 11.30 గంటలకు నారాయణ సేవ నిర్వహించబడతాయి.   

ప్రతిరోజూ సాయంత్రం 6.00 గంటలకు వేద పారాయణంతో ప్రారంభమై, 6.20 గంటలకు జ్యోతి ప్రకాశనం, 6.25 గంటలకు ఆనాటి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రసంగం, 6.35 గంటలకు ప్రత్యేక జన్మదినోత్సవ కార్యక్రమం, 7.30 గంటలకు భజనలు, 7.50 గంటలకు భగవాన్ వారి దివ్య సందేశం మరియు రాత్రి 8.00 గంటలకు మంగళ హారతి నిర్వహించబడతాయి.

నవంబర్ 17న ఉదయం పల్లకీసేవ 16 సమితిలచే స్వామి వారి పల్లకీల ఊరేగింపు ప్రశాంతి పతాక ఆవిష్కరణ, ప్రతి రోజు పూజ, 

సాయంత్రం : సాయి స్వర్ణాంజలి (SAI SWARNANJALI) – బాలవికాస్ విద్యార్థులచే సంగీత నీరాజనం. వరజ సిస్టర్స్ (Varija Sisters) 

నవంబర్ 18, బుధవారం – శ్రీ సత్యసాయి పాఠశాలల దినోత్సవం  

సాయంత్రం:సమర్పయామి (SAMARPAYAMI) – శ్రీ సత్యసాయి విద్యావిహార్ హైస్కూల్ విద్యార్థులచే "సహస్ర శీర్ష పురుషం" అనే అంశంపై నృత్య రూపకం (Dance Drama) ప్రదర్శించబడుతుంది.

నవంబర్ 19, గురువారం – శ్రీ సత్యసాయి మహిళా దినోత్సవం ఉదయం: శ్రీ సత్యసాయి సత్యనారాయణ వ్రతము

సాయంత్రం: అష్ట పుష్పాంజలి (ASHTA PUSHPANJALI) – మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్యానల్ చర్చ (Panel Discussion) నిర్వహించబడుతుంది.

నవంబర్ 20, శుక్రవారం – శ్రీ సత్యసాయి యువజన దినోత్సవం ఉదయం: మహిళా విభాగం ఆధ్వర్యంలో నిత్య పూజ 

సాయంత్రం: సాయి కథ (SAI KATHA) – శ్రీమతి లాస్య, సుకృతి మరియు శ్రీ సత్యసాయి అలివేలు మంగా బాలమందిర్ విద్యార్థులచే నృత్య రూపకం (Dance Ballet) ప్రదర్శించబడుతుంది.

నవంబర్ 21, శనివారం – శ్రీ సత్యసాయి పూర్వ విద్యార్థుల దినోత్సవం ఉదయం: మహిళా విభాగం ఆధ్వర్యంలో నిత్య పూజ

సాయంత్రం: కరిష్యే వచనం తవ (KARISHYE VACHANAM TAVA) – శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్, అనంతపురం క్యాంపస్ పూర్వ విద్యార్థులచే ప్రత్యేక కార్యక్రమం సమర్పించబడుతుంది.

నవంబర్ 22, ఆదివారం – శ్రీ సత్యసాయి సేవా దినోత్సవం ఉదయం: మహిళా విభాగం ఆధ్వర్యంలో నిత్య పూజ సాయంత్రం: మిస్టిక్ వైబ్స్ (MYSTIC VIBES) – శ్రీ ముత్తుకుమార్ మరియు వారి బృందంచే ప్రత్యేక సంగీత నీరాజనం సమర్పించబడుతుంది.

నవంబర్ 23, సోమవారం – భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 101వ జన్మదినోత్సవం

ఉదయం: సాయి జగన్నాథ రథోత్సవం 101 మంది పండితులచే మహా రుద్రాభిషేకం

సాయంత్రం: సాయి... మా హృదయ నాదం (SAI... MAA HRUDAYA NAADAM) – శివం భజన బృందం వారిచే ప్రత్యేక సంగీత కార్యక్రమం.  ఊయల సేవ (జూలా సేవ) కేక్ కటింగ్ కార్యక్రమం.

ఈ వారం రోజుల వేడుకల్లో బాలవికాస్ విద్యార్థులు, పాఠశాలల విద్యార్థులు, మహిళా విభాగం, యువజన విభాగం, పూర్వ విద్యార్థులు మరియు సేవాదళ్ సభ్యులు తమ భక్తి, ప్రతిభ, సేవాభావాలను వివిధ కార్యక్రమాల ద్వారా భగవాన్ వారి దివ్య పాదపద్మాలకు సమర్పించనున్నారు.

ఈ పవిత్ర వేడుకలలో భక్తులు, సేవాదళ్ సభ్యులు, బాలవికాస్ విద్యార్థులు, మహిళలు, యువజనులు, పూర్వ విద్యార్థులు మరియు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని భగవాన్ వారి దివ్య ఆశీస్సులను పొందవలసిందిగా నిర్వాహకులు సాదరంగా ఆహ్వానిస్తున్నారు.

భగవాన్ వారు ప్రపంచానికి అందించిన మహోన్నత సందేశాలైన:

అందరినీ ప్రేమించండి – అందరికీ సేవ చేయండి

ఎల్లప్పుడూ సహాయం చేయండి – ఎవరినీ బాధించకండి

అనే ఆశయాలను మన జీవితాల్లో ఆచరిస్తూ, మన ప్రియతమ గురుదేవులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 101వ జన్మదినోత్సవ వేడుకలను అందరం కలిసి భక్తిశ్రద్ధలతో విజయవంతం చేద్దాం.

కన్వీనర్
శ్రీ సత్యసాయి ట్రస్ట్, తెలంగాణ

రాష్ట్ర అధ్యక్షులు
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, తెలంగాణ

జిల్లా అధ్యక్షులు
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, శివం, హైదరాబాద్



No comments:

Post a Comment

PRESS NOTE DT 14-11-2026 101 BIRTH DAY CELEBRATIONS AT SIVAM.

  PRESS NOTE DT 14-11-2026 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి ట్రస్ట్, తెలంగాణ మరియు శ్రీ సత్యసాయి సేవ...