Monday, February 21, 2022

KOTI SAMITHI, HYD PRESENTS 2022 మహా శివరాత్రి పర్వదినోత్సవం సందర్భంగా ప్రత్యేక నాటిక - "కిరాతార్జునీయం " - SIVAM MAHASIVA RATRI CELEBRATIONS:

 "కిరాతార్జునీయం " U TUBE LINK 

RADIO LINK LINK. 

Today a U Tube was Prepared on Shankaaravam and the importance of Shanku.

Link  

2AM  to 3 AM: AKHANDA BHAJANA SLOT FOR KOTI SAMITHI. SUCCESSFULLY COMPLETED WITH SWAMY'S BLESSINGS. AND WITH THE CO-OPERATION OF ALL. 

With the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Baba varu  the following members of Koti Samithi have participated in the Bhajana Slot. 

1) Sri V Srinivas, 2) Sri Venkat Rajanna, 3) Smt Bhuvaneswari, 4) Chi. Bhadra Devi, 5) Smt Kalpana, 6) Smt V Vijaya Laksmi  7) Smt Jyothi of Zia Guda, 8) Smt Malathi of Central Warehousing Corporation, 9) Sri Surendra Patel, 10) Sri Rati Rao Patil, 11) Sri Manik Prabhu, 12) Sri Manik Prabhu's Son, 13) Sri M Anjaneyulu, 14) Sri A Vinay Kumar,  15) Sri Ch. Lakshma Reddy Garu. and 16) Convenor P.Visweswara Sastry. 

Balvikas Children: Master Hemang, Chi Bhadra, Master Leeladhar have participated in their particular Slot at 5 PM to 5-30 PM. 

Gurus: 




Mr Srinivas of Koti Samithi is performing Vibhuti Abhisekham at midnight of 1st March 2022. 















2022 మహా శివరాత్రి పర్వదినోత్సవం సందర్భంగా ప్రత్యేక నాటిక - "కిరాతార్జునీయం " 

ఈ నాటిక సమర్పణ -  

 శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి, హైదరాబాద్.  

ఈ నాటికలోని  పాత్రలు, పాత్రధారులు, 

అర్జునుడుగా శ్రీ వాచస్పతి అంబడి పూడి మురళీకృష్ణ, 

కృష్ణుడిగా  - శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్,

శివుడిగా - శ్రీ K  శివ కళాధర్,  

పార్వతి గా - శ్రీమతి పూర్ణిమ సుమన్,

నందిగా - శ్రీ అనుమంచి విశ్వమోహన్, 

బృంగి గా శ్రీ కె  వి ఎస్ కె గణేష్,

 శృంగి గా - తుమ్మలపల్లి వెంకట సుబ్రహ్మణ్యం, 

ద్రౌపదిగా డాక్టర్ ఎం మీనా కుమారి,

నారదుడిగా శ్రీ బి సాయి ప్రభాకర్,

ధర్మరాజుగా - శ్రీ రేగేళ్ల అనిల్ కుమార్,

భీముడు, శ్రీ శరత్ కృష్ణ పరాయితం

వ్యాసుడిగా శ్రీ జి వి ఎన్ రాజు, 

ఇంద్రుడిగా శ్రీ మదన్ గుప్తా,

నకులుడుగా శ్రీ వి. వెంకట రాజన్న 

మరియు సహదేవుడుగా, మూకాసురుగా శ్రీ పి. విశ్వేశ్వర శాస్త్రి పాల్గొన్నారు.


 కిరాతార్జునీయం 6వ శతాబ్దంలో మహాకవి భారవి చే రచింపబడిన సంస్కృత పద్య కావ్యం. ఈ కావ్యం అర్జునుడు మరియు మారు వేషంలో ఉన్న శివుని మధ్య జరిగిన యుద్దాన్ని తెలుపుతూ రాయబడింది. సంస్కృతంలోని ఆరు మహా కావ్యాలలో ఒకటిగా కిరాతార్జునీయం కొనియాడబడింది. ఈ కావ్య రచనా శైలి పద ఎన్నిక మరియు అద్భుత వర్ణన, సంస్కృత పండితుల ప్రశంసలు పొందింది. ఈ కావ్యంలో ఎక్కువగా వీర రసం బాగా వర్ణించబడింది. ఇందులో కవి మహాభారతంలో వనపర్వంలోని ఒక చిన్న భాగాన్ని తీసుకుని వర్ణించాడు.

పాండవులు వనవాసానికి వెళ్ళినపుడు ద్రౌపది, మరియు భీముడు కౌరవులతో యుద్ధం ప్రకటించమని ధర్మరాజును బలవంతం చేస్తారు. కానీ ఆయన అందుకు అంగీకరించడు. చివరగా ఇంద్రుడి సలహాతో అర్జునుడు అడవిలో తపస్సు చేసి శివుణ్ణి మెప్పిస్తాడు. శివుడు అందుకు ప్రీతి చెంది ఏమైనా వరం ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు.


కిరాతుడు - శివుడితో యుద్ధం చేస్తున్న అర్జునుడు:

అదే అరణ్యం ప్రాంతంలో మూకాసురుడు అనే రాక్షసుడు ఎలుగుబంటి రూపంలో తిరుగుతుంటాడు. అది ఒకసారి అర్జునుణ్ణి చూసి మీదకు దూసుకురాబోతుంది. అప్పుడు శివుడు కిరాతుడి రూపంలో అక్కడికి వస్తాడు. ఇద్దరూ కలిసి దానివైపు ఒకేసారి బాణం వేస్తారు. అది చనిపోతుంది. అయితే ఎవరు బాణం ముందు వేశారో సందిగ్ధం మొదలౌతుంది. చివరకు వివాదంగా మారి యుద్ధానికి దారితీస్తుంది. ఆ యుద్ధంలో ఎంతసేపైనా అర్జునుడు కిరాతుని ఓడించలేక పోతాడు. చివరకు తప్పు తెలుసుకుని శివుణ్ణి శరణు వేడుకుంటాడు. శివుడు అతని పరాక్రమానికి మెచ్చి చాలా శక్తివంతమైన పాశుపతాస్త్రం ప్రసాదిస్తాడు. ఆ ఆయుధమే అర్జునుడు *మహాభారత యుద్ధ* సమయంలో కర్ణుని సంహరించడానికి వాడాడు.


అందరికీ సాయి శివోహం.

మౌళిగుళ్కెడు చంద్ర మర్ఖండ కళ తోడ,

బెడదారు గుంపెడు జడల తోడ,

జడలలొ ప్రవహించు చడలేటి జిగు తోడ,

డంబైన ఫాల నేత్రంబు తోడ,

నల్ల నేరెడు వంటి నల్లని మెడ తోడ,

కరమున నాగ కంకణము తోడ,

నడుమున చుట్టిన నాగ చర్మంబు తోడ,

మైనిండ నలదు భస్మంబు తోడ,

కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టు తోడ,

తాంబుల రాగదరంబు తోడ,

తట హేమ మయ వజ్ర తాటంకముల తోడ,

విక్షస్య  వర్ధయా వృష్ఠి తోడ,

నల్ల కలవలు దునుమాడి కొల్లలాడు,

నేడి చామనఛాయల మేని తోడ...!

భావం 

సిగపై దీపస్తంభము వలె ప్రజ్వరిల్లు చంద్రుని చల్లని కాంతి పుంజములు నలుదిశలా వ్యాపించు చుండగా,

శిరస్సునిండా గుంపులు గుంపులు గల జటాజూటములతో,

ఆ జటాజూటములనుండి నదీనదాలు జలధారలగా ప్రవహించు చుండగా,

 నొసటి మధ్యన ప్రజ్వరిల్లే మూడొకన్నుతో ఈ జగత్తును లయం చేసే ముక్కంటి,

 అల్ల నేరుడుపండువలె నిగనిగలాడే నల్లని మెడ కల్గి,

చేతికి వంకీలుగా నాగరాజును ఆభరణంగా తొడిగి, 

నడుముకు నాగ చర్మము ధరించి, 

వంటినిండా భస్మం పులుముకుని,

నుదుట నిండుగా తీర్చిదిద్దిన చక్కటి కుంకుమబొట్టుతో వెలుగులీనుతూ,

తాంబూలము సేవించిన ఎర్రని పెదవులతోనూ,

వజ్రములు పొదిగిన బంగారు చెవికమ్మలు తోనూ,

చిన్నగా మొదలై హోరున వర్షించే కుంభవృష్టిని తలపించే రూపము నీది,

మేనిచామన ఛాయా శరీరంతో,

కనులుదోచే నీ సొందర్యం నిజంగా చూడగానే అపహరించాలనే బుద్ధిపుట్టే నల్లకలువల చందం,

ఓ ఈశ్వరా..

ప్రకృతిని మించిన నీ సౌందర్యం ఈ జగత్తును పూర్తిగా నీ శాంతి,ప్రేమ,

ఆనందాలతో మానవాళి హృదయలోతుల్ని పూర్తిగా ముంచివేసింది కదా ఈశా,

ఇదియే కదా ఈ సృష్టికి గొప్ప బహుమతి సాయీశా...


శ్లోకం భావ వివరణ:

శ్రీ.కస్తూరి సాయి భాస్కర్.

Tuesday, February 15, 2022

PRASHANTI NILAYAM SEVALU & OFFLINE PROGRAMS:

 



  • RAMU
  • SRISAILAM
  • YOGESH
  •  PATELRANJEET RAVI SON
  • SKILL DEV CETNRE  MEMBERS. 
  • NIRANJAN 
  • SAI  KUMAR 


  


Friday, February 11, 2022

భీష్మ ఏకాదశి. 12-2-2022

 భీష్మ ఏకాదశి.




12.02.2022. శనివారం.

పంచమవేదమైన మహాభారతాన్ని వేదవ్యాసుడు రాసినా,భీష్ముడు అనే పాత్ర లేకపోతే భారతమే లేదు! 

తాను కోరుకునే సమయంలోనే మరణించగలిగే వరం కూడా ఆయన సొంతం.అందుకే మార్గశిరమాసంలో అంపశయ్య మీదకి చేరుకున్నా... ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకూ వేచిచూశాడు.

ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత తనకు మోక్షం కలిగించమని ఆ పరంధాముని అష్టమి రోజున వేడుకున్నాడు. 

ఇక మరణ

సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కురుకుల వృద్ధుడు.అంపశయ్యపై ఉన్న తనను చూసేందుకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతి గురించి బోధించాడు. పాండవులతో అక్కడకు వచ్చిన కృష్ణపరమాత్ముడుని స్తుతిస్తూ శ్రీ విష్ణు సహస్రనామాలని పలికాడు. 

మాఘమాస ఏకాదశి రోజున భీష్ముడు తన దేహాన్ని వదిలి స్వర్గానికి చేరుకున్నాడు.

అందుకే దీనిని భీష్మ ఏకాదశి అని జయ ఏకాదశి అని కూడా అంటారు.ఈ రోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని నమ్మకం.

ఇక భీష్ముడు భారతీయులందరికీ పూర్వీకుడే!ఆచార్యునిగా, భరతవంశానికి ఆదిపురుషుడిగా మనకు చిరస్మరణీయుడు.

అందుకే ఈ ఏకాదశినాడు ఆయనకు తర్పణాలను విడవాలని పండితులు సూచిస్తారు.భీష్ముని తమ పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుని పోతాయట.

ఈ రోజునే విష్ణు సహస్ర నామం పుట్టిందని పురాణాలు చెప్తున్నాయి.అందుకే దీనిని విష్ణు సహస్ర నామ జయంతి అని కూడా పిలుస్తుంటారు.

విష్ణు సహస్రనామ విశేషాలను భీష్ముడు పాండవులకు తెలిపి,కురుక్షేత్ర యుద్ధంలో వారి విజయానికి భీష్ముడు కారణమయ్యాడు.

భీష్ముడు అందించిన విష్ణుసహస్రనామాలను ఈరోజున పారాయణ చేస్తే విశేష ఫలితం దక్కుతుంది. 

 మాఘశుద్ద అష్టమి నుంచి ద్వాదశి వరకూ ఉన్న ఐదు రోజులనూ భీష్మ పంచకం అని పిలుస్తారు.

ఈ అయిదు రోజులూ భీష్ముడి వ్యక్తిత్వాన్ని తలచుకుంటారు.ఆ మహాత్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ ఐదు రోజులనూ కేటాయిస్తారు. 


🙏🙏🙏

జై సాయిరాం.

======================================================== 

రేపు ఫిబ్రవరి 12 శనివారం భీష్మ ఏకాదశి సందర్భంగా...

🌹🌺 భీష్మ ఏకాదశి అని ఎందుకంటారు? 🌺🌹

మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ రోజునే కురుకుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు. బీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం విష్ణు సహస్రనామం. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉన్నాడు. నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికాలుడుతు గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు. దీనికి కలవరపడిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుడిని ప్రశ్నించారు. మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః" కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడని ఆ జగన్నాటక సూత్రధారి సమాధానం ఇస్తాడు.

అందుకే నా మనసు అక్కడికి వెళ్లిపోయింది, మీరు కూడా నాతో రండని పాండవులకు తెలిపాడు. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మశాస్త్రాలను అవపోశణం పట్టి పూర్తిగా ఆకలింపు చేసుకున్న మహనీయుడు. ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతోంది, ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోడానికి రండి' అని భీష్మపితామహుడి చెంతకు తీసుకు వచ్చాడు.

సుమారు మూడు పక్షాల నుంచి అంపశయ్యపై పడి ఉన్నాడు. దేహమంతా బాణాలు గుచ్చుకుని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది. మాఘమాసంలో ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు, ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు. తాను కోరుకుంటే మరణం చెంతకు వస్తుంది, కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని కోరుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకున్నాడు.

తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు. అంతటి జ్ఞానం కలిగిన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. అలాంటి వాళ్లు ఏ రోజు నిష్క్రమించినా వైకుంఠం ప్రాపిస్తుంది. భీష్ముడు తనకి మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు.

అయితే తాను చేసిన దోషం ఒకటి స్పష్టంగా గాంగేయుడికి జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి పాపం శరీరం పైనే రాసి ఉంటుందట! అది తొలగితే తప్ప సద్గతి కలగదట. ఇంతకీ భీష్మపితామహుడు చేసిన దోషం ఏంటంటే? పాండవ పత్ని ద్రౌపదికి నిండు సభలో అంతటి అవమానం జరుగుతున్నా ఏమీ చేయలేక పోయాడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువైన వసిష్ఠుడు ఆమెతో ఇలా చెప్పారట "మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః" హే ద్రౌపతి! ఇతరులు తొలగించలేని ఆపదలు కలిగినపుడు శ్రీహరిని స్మరించుకోమన్నారు.

కురుసభలో వస్త్రాపహరం జరుగుతుంటే అతి పరాక్రమవంతులైన అయిదుగురు భర్తలు ఆమె గౌరవాన్ని కాపాడలేకపోయారు. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కనబెట్టారు. కృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. కాబట్టే అలా చేసినందుకు కౌరవులను మట్టు పెట్టాడు. పాండవులకూ కూడా అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలనుకున్నాడో ఆమెకే నష్టం జరుగుతుందని భావించాడు.

ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ భగవంతుడే అర్జునుడితో చెప్పాడట. ద్రౌపదికి ఎప్పుడు అవమానం జరిగిందో అప్పుడే వారిని తీసి పాడేశాను, ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితంలా ఉన్నారే తప్ప, ఆ గౌరవాన్ని నీకు కట్టబెట్టాలని యుద్ధం చేయమంటున్నాంటూ అర్జునుడితో శ్రీకృష్ణుడు అన్నాడట.

భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తుంటే, పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ 'తాతా! ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని ప్రశ్నించిదట. అందుకు భీష్ముడు 'అవును తల్లీ! నా దేహం నా అధీనంలో లేదు, అది ధుర్యోదనుడి సొంతం. నీకు అవమానం జరుగుతుందని తెలిసినా, నా దేహం నా మాట వినలేదని అన్నాడు. అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టే ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపశయ్యపై ఉన్నానని చెప్పాడు.

కురు వంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిపోయిన భీష్ముడు, పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్వజించాడు. ' హే ద్రౌపతీ! కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోడానికే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు ఈనాడు నేను ధర్మాలను బోధించవచ్చని పాండవులకు ఎన్నో సూత్రాలను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్ముడికి నొప్పి నుంచి ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాందించి ధర్మసూత్రాలను చెప్పించాడు.

నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పొచ్చుకదా అని భీష్ముడు ప్రశ్నించాడు. నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదని కృష్ణుడు బదులిచ్చాడు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు దాని గురించి చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల తన సారాన్ని చెప్పగలదా! అందులో పండిన మొక్క చెబుతుంది ఎంత సారమో. అలాగే అనుభవజ్ఞుడవైన నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు.

భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యమవుతుంది. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితమని జగన్నాటక సూత్రధారి భావించాడు. అలా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత ఆయనే నేరుగా చెప్పాడు, విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వస ారా చెప్పించాడు. కాబట్టి విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా మోక్షం కలుగుతుంది🙏

Wednesday, January 12, 2022

GAYATRI MANTRA CHANTING FROM 13-1-2022 ONWARD TILL 21ST FEB 2022.

 


హైదరాబాద్ జిల్లాలోని 16 సమితులలో ఉన్న శ్రీ సత్యసాయి సేవా సంస్థల భక్తులు,సాయి కుటుంబ సభ్యులు అందరికీ సాయిరాం.ప్రస్తుతము ఉన్నటువంటి విపత్కర పరిస్థితులలో,లోకక్షేమంకోసం, సామూహికంగా గాయత్రి మంత్రము ఒకే సమయములో జపించిన ఆ మంత్ర ప్రభావం వలన,ఉత్పన్నమయ్యే శక్తి తరంగాలవలన ప్రజల జీవితాలకి శాంతి,సంతోషం,మానసిక ప్రశాంతత లభిస్తుంది. మహా మహిమాన్వితమైన గాయత్రి మంత్ర సామూహిక జపము ఒకే సమయంలో చేసిన,ఆసాధకుల భౌతిక, మానసిక,ఆధ్యాత్మిక, మేధాశక్తులను,ఉత్తేజ పరుస్తుంది.ప్రాపంచిక విషయముల నుండి విముక్తడిని చేసి, దైవానికి సన్నిహితుల్ని చేస్తుంది.

భగవాన్ మనకు అందరికీ ఈ విధంగా ఆదేశించారు,తెల్లవారగట్ల ఒకే సమయంలో ఓంకారము,సుప్రభాతము చేయుట,మరియు సాయంత్రం ఒకే సమయంలో భజన చేయుట,ఈ విధంగా ఒకే సమయంలో గాయత్రి మంత్ర జపము చేయడం వలన ప్రతి కుటుంబ సభ్యులలో ఐకమత్యము మరింత బలపడుతుంది.

గత సంవత్సరం సామూహికంగా,ఒకే సమయంలో చేసిన ప్రార్థనా ఫలితం మన సంస్థలో ఇప్పటికే అందరూ రుచి చూసి ఉన్నారు.మరొక్కసారి ఆ ఫలాన్ని అందుకుందాము. ప్రజా క్షేమమునకు,దేశ సౌభగ్యమునకు,లోక కల్యాణం కోసం స్వామివారి ఆశీస్సులతో సంకల్పించుకున్న గాయత్రీ మంత్ర జపము 108 సార్లు,40 రోజులు,ప్రతీ రోజు ఉదయం 7 గం|| లకు చేద్దాము. ఈ బ్రహత్తర కార్యమును జనవరి 13వ తారీకు,‌గురువారము,వైకుంఠ ఏకాదశి పర్వదినమున మొదలుపెట్టి,ఫిబ్రవరి 21వ తారీకు సోమవారమున పూర్ణాహుతి తో సుసంపూర్ణం‌ చేసుకుందాము. 

ఈ పుణ్య కార్యక్రమం రేపటిరోజు ముక్కోటి ఏకాదశి,ఉదయం 7 గం లకు శివం మందిరంలో జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా కార్యవర్గ బృంద సభ్యులు 108 సార్లు గాయత్రి మంత్ర జపము చేసి ప్రారంభం చేస్తారు. ఆసక్తి కలిగిన వారు శివంలో జరిగే గాయత్రి మంత్ర జపంలో పాల్గొనడానికి ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాను.

(కొవిడ్ నియమ నిబంధనలను పాటిస్తూ.) మరుసటి రోజు నుండి సాయి కుటుంబ సభ్యులు,భక్తులు అందరూ ఎవరి‌ ఇళ్ళల్లో‌ వారు అంత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతీ రోజు ఉదయం 7 గం|| లకు ఈ గాయత్రీ మంత్ర జపము చేద్దాము. ఆ సాయిగాయత్రీమాత అనుగ్రహ ఆశీస్సులతో త్వరితగతిని ప్రపంచవ్యాప్తంగా,ఆరోగ్యకర పరిస్థితులు చక్కబడాలని కోరుతూ... జై సాయిరామ్. మీ సోదరుడు, A MALLESWARA RAO HYDERABAD DISTRICT PRESIDENT 

Wednesday, December 29, 2021

SRI SATHYA SAI PUSTAKAALAYAM - PRARAMBHOSTAVAM 1-1-2022 AND INAUGURATION REPORT. & PRESS CLIPPINGS DT 2-1-2022

JAN Ist 2022  PHOTOS LINK: 

                           PL CLICK HERE  U TUBE LINK





రిపోర్ట్ డేటెడ్ 1-1-2022

శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి, హైదరాబాద్ ఆధ్వర్యంలో, ఆంగ్ల నూతన సంవత్సర ప్రారంభ వేళ, రెండు సెంటర్స్ లో “ శ్రీ సత్య సాయి పుస్తకాలయం ప్రారంభోత్సవం, ఈ రోజు 1-1-2022 ఉదయం 1 గంటకు GUNFOUNDRY లోని LIC క్వార్టర్స్ లో మరియు ఉస్మాన్ గంజ్ లోని, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి, స్కిల్ డెవలప్మెంట్(టైలోరింగ్)  సెంటర్ లో “ శ్రీ సత్య సాయి పుస్తకాలయం ప్రారంభోత్సవం”1-1-2022 గావించబడినవి. 

స్వామి వారి దివ్య ఆశీస్సులతో, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోఠి సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఊస్మాన్గంజ్ తొప్ఖానాలో గల స్కిల్ డెవలప్మెంట్(టైలోరింగ్)  సెంటర్ లో  ఈ రోజు ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను నిరాడంబరంగా  జరిగాయి . ఈ కార్యక్రమంలో  టైలోరింగ్లో శిక్షణ పొందుతున్న మహిళలు మరియు వారి పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు . ఈ కార్యక్రమానికి శ్రీమతి పద్మావతి గారు , శ్రీమతి సుగుణ గారు, శ్రీ నరసింహారావు గారు,  జ్యోతి ప్రకాశనం గావించిన అనంతరం వేదము , భజన తో ప్రారంభం అయ్యి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి సందేశమును ను సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి అనేక ఉదాహారణలతో తెలియజేస్తూ , శిక్షకులకు నూతన సంవత్సర విశిష్టత,   తెలియజేసి అందరికి నూతన ఉత్తేజాన్ని కలుగజేసారు . స్వామి వారి సందేశము ::

 ప్రతి క్షణము నూతన సంవత్సరమే - కొత్త సంవత్సరములు, కొత్త నెలలు మనకు ఆనందాన్ని, దుఃఖాన్ని, కష్టాన్ని తీసుకొని రావటంలేదు. ప్రతి సెకండ్ కూడను ఒక నూతనమైనటువంటిదే. సెకండ్ లేక నిమిషము రాదు. నిమిషము లేక గంటలు రావు. గంటలు లేక దినములు గడువవు. దినములు లేక నెలలు గడువవు. నెలలు లేక సంవత్సరం కాదు. కాబట్టి ఈ సంవత్సరం అంతయు కూడను క్షణములతోనే ఆధారపడి ఉంటున్నాది. ప్రతి క్షణము కూడను మనము పవిత్రముగా అనుభవించినప్పుడే, ఈ సంవత్సరము నూతన సంవత్సరము అవుతుంది. ఒక్కొక్క క్షణము మనము ఎట్టి కార్యముల చేత, ఎట్టి గుణముల చేత, ఎట్టి ప్రవర్తన చేత కాలము గడుపుతున్నామో. దాని ఫలితమే మన సంవత్సర ఫలితం.  స్వామి సందేశానంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వామి సందేశాన్నివారి దినందిక జీవితంలో  అమలు పరిచే విధంగా శక్తిని ఇవ్వమని స్వామిని వేడుకొన్నారు.

శ్రీ సత్య సాయి పుస్తకాలయం లోని పుస్తకములను అందరు రిజిస్టర్ లో పేర్లు నమోదు చేసుకొని, శ్రీ సత్య సాయి పుస్తకాలను, ఎవరికి కావాలని, వారి వారి స్థాయిలలో వున్నా పుస్తకములను తీసుకొని ప్రారంభించారు. 

అందరు కలిసి స్వామి వారికీ మంగళ హారతి ఇవ్వగా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది . ఈ కార్యక్రమంలో దాస  పద్మావతి , శ్రీ నరసింహా రావు, శ్రీనివాస్, కల్పన, సరితా, స్వప్న, యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.   ఫోటోలు జత చేయడం అయినది .

 సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి














SRI SATHYA SAI PUSTAKAALAYAM - PRARAMBHOSTAVAM 1-1-2022 



101 BIRTHDAY CELEBRATIONS - AT PRASHANTI NILAYAM CIRCULARS ETC.,

  PRASHANTI SEVA SADHANA 90309 13135 - Saraswathi garu please motive Sevadal Gents and Ladies for 14 to 25 at least 10 each NSS Program Co-o...