Wednesday, August 17, 2022

SRI KRISHNA JANMASTHAMI & MAHILA DAY CELEBRATIONS: 19-8-2022 AT SKILL DEVELIOPMENT TRAINING CENTRE: HYD




5249 వ  శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను, ఉస్మాన్ గంజ్ లో గల  శ్రీ సత్య సాయి స్కిల్ DEVLOPMENT ట్రైనింగ్ సెంటర్, (టైలోరింగ్ ) లో ఘనంగా జరిగాయి.  శ్రీమతి దాస  పద్మావతీ గారు, శ్రీమతి దాస వాణి  శ్రీమతి శైలేశ్వరి గారు  జ్యోతి ప్రకాశనం గావించగా, వేదం పఠనం  తో ప్రారంభమై  గణపతి ప్రార్ధన, శాంతి మంత్రాలూ, అనంతరం   గణేష్ భజన , గురు భజన , జగన్మాతే జగత్జనని అనే మాత  భజన  సాయి భజనలతో పాటు,  కృష్ణ భజనలతో, ఆనంద పరవశులైనారు. 

డాక్టర్  పి సుశీల ప్లే బ్యాక్ సింగర్ స్వామి చిరకాల భక్తురాలు స్వామి సమక్షంలో అనేక సార్లు పాడిన పాట "   కోటి సమితి సిస్టర్స్  "మధుర మోహన ఘన శ్యామ సుందర సాయీ" అనే మంచి మధురమైన   పాటను   యెంతో భక్తి పరవశంతో పాడారు.  

కోటి సమితి  బాలవికాస్ విద్యార్థులు, మహిళలు అందరు గోవింద కృష్ణ జై - గోపాల కృష్ణ జై అను భజన స్వామి గళంతో వస్తున్నప్పుడు  కోలాటంలో ఉత్సహంగా పాల్గొన్నారు.

ఈ రోజు  శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను, మహిళా దినోత్సవం సందర్భముగా   శ్రీమతి పద్మావతి,  శ్రీమతి కల్పనా, శ్రీమతి మల్లేశ్వరి, శ్రీమతి వాసవి  తదితరులు, మాట్లాడినారు. చివరగా శ్రీమతి శైలేశ్వరి మాట్లాడుతూ, గోపికల అనన్య భక్తి చాటి చెప్పే విశేషాలను,  కృష్ణ తత్వం లోని  అనేక కొత్త విశేషాలను, తెలిపారు. 

ఈ రోజు  శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భముగా, ఆశ్రిత కల్ప లో విశేష సేవలు అందిస్తున్న శ్రీమతి మల్లేశ్వరి గారిని, శ్రీమతి భాగ్యలక్ష్మి శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి పక్షాన శ్రీ కృష్ణ చిత్ర పటంతో సత్కరించారు. 

కోటి సమితి సిస్టర్స్ స్వామికి మంగళ హారతి సమర్పణ తో కార్యక్రమం దిగ్విజయముగా ముగిసినది. 




 
SPEAKERS OF THE DAY





                                                    





ఈ నాటి కార్యక్రమం లో సహకరించిన వారు, బంతిపూలు, తోరణం, మరియు ముగ్గులు వేసిన వారు ప్రస్తుతం 16 వ బ్యాచ్ లో ట్రైనింగ్ అవుతున్నవారు. 

శ్రీమతి దాస వాణి గారు ఒక రోజు ముందు అందరికి ఫోన్స్ చేసినారు. పద్మావతి గారు సెల్ ఫోన్ లో బాలన్స్ లేక కొన్ని ఫోన్స్ మాత్రమే బిజీ వున్నా కారణంగా చేయ గలిగారు. 

16 వ బ్యాచ్ లో ట్రైయిన్ అవుతున్న సిరీన్ నాకు లైవ్ (వాట్సాప్ ) ఇవ్వటం కారణంగా నేను ప్రత్యక్షముగా కార్యక్రమాన్ని చూడగలిగాను. 

15 వ బ్యాచ్ గౌలిగూడ శ్రావణి ఫొటోస్ తీయడంలో, మరియు మన యూత్ సాయి కుమార్ కూడా ఫొటోస్ తీయడంలో, మరియు స్వామి వారి గళంలో పాట వినిపించడంలో సహకరించారు. 

భాగ్యలక్ష్మి గారు పిల్లలను తీసుకొని వచ్చి, తాను వారి ఇంటినుండి కంజీర తెప్పించి కంజీర వాయించి కార్యక్రమానికి కొత్త శోభను తెచ్చారు. 

అందరికి స్వామి ఆశీస్సులు 








No comments:

Post a Comment

99TH BIRTHDAY CELEBRATIONS AT SIVAM STARTING FROM 17TH NOVEMBER, 2024:

  భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి  దివ్య ఆశిస్సులతో   “  సత్యసాయి భగవానుని   99 వ జన్మ దిన వేడుకలలో భాగంగా   ” 17  నవంబర్ , 2024  న   హైదరాబ...