Saturday, May 16, 2026

19th May Mahila Day Celebrations: " Remove Illusion ( Maya) and reach closer to Madhava (GOD)

 

శ్రీమయి –జ్యోతిర్మయి - మహిళా డే కార్యక్రమాలు- 19-5-2026 నివేదిక.

ఈ నాటి మహిళా దినోత్సవం  కార్యక్రమము, సి బి యెస్ గౌలిగూడ చమన్ ప్రాంగణములోనున్న చలివేంద్రం లో ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి, " ఆధ్యాత్మిక క్రీడా పోటీలు " ల లో భాగంగా, శ్రీమయి –జ్యోతిర్మయి , అను శీర్షికలో భాగంగా, “మాయను తొలగించుకో- మాధవుని దరి చేరుకో” అనే కార్యక్రమము జ్యోతి ప్రకాశనం, వేదం, భజన, హనుమాన్ చాలీసా పారాయణం తో ప్రారంభ మైనది.   అంశం “మాయను తొలగించుకో- మాధవుని దరి చేరుకో” ను తీసుకొని, అందరూ మహిళలు యెంతో  ఆనందంగా పాల్గొని, కోపం (Anger) , అసూయ (Jealousy)  అహంకారం (Ego)  దురాశ (Greed) గాసిప్ / అపవాదు (Gossip) స్వార్థం (Selfishness) ఆలస్యం (Laziness), ఈ లక్షణములు మనలను మాయలో వుంచుటవి. ఈ లక్షణములను, ఈ లక్షణములను అధిగమించుతే, మనము మాధవుని దరి చేరుకోగాలము అన్నారు.

 

ప్రేమ (Love) సేవ (Service) దయ (Compassion) సహనం (Patience) భక్తి (Devotion) సత్యం (Truth) నమ్రత (Humility) క్షమ (Forgiveness) ఈ లక్షణములు  “మాయ నుండి మాధవుని వైపుతీసుకొని వెళ్ళు మార్గములని అన్నారు.

కోపం వస్తే నేను భజనలు వింటాను అని, నేను ప్రతి రోజు పక్షులకు నీళ్లు పెడతాను, అని, నా చిన్నపుడు చలివేంద్రంలో నీరు ఇచ్చానని తెలిపారు.

మాయ – మాధవుడు ను కంపేర్ చేస్తూ,  “పక్కింటి వారి గురించి చెడుగా మాట్లాడటం  మాయ (Maya) అని,  ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం మాధవుడు (Madhava) ని దరిచేరుట అని అన్నారు.

చివరగా మాయను విడిచి ప్రేమ, సేవ, భక్తి మార్గంలో నడిస్తే మాధవుని దరిచేరవచ్చు. నని అన్నారు. అదే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్పిన మహవాక్యములు లవ్ అల్ – సర్వ్ అల్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.

మానవ సేవే మాధవ సేవ

ఈ కార్యక్రమానికి తొలుతగా మహిళా incharge శ్రీమతి విజయలక్ష్మి గారు స్వాగత వచనాలు పలుకగా, శ్రీమతి కల్పన, శ్రీమతి శైలేశ్వరి, శ్రీమతి రూప, శ్రీమతి వాణి, శ్రీమతి స్వరూప రాణి, శ్రీమతి గంగా, శ్రీమతి గుబ్బ జ్యోతి, శ్రీమతి అరుణ చందరాజు తదితరులు పాల్గొన్నారు. అందరూ కలసి సేవా కార్యక్రమములో భాగంగా కోటి సమితి నిర్వహిస్తున్న చలివేంద్రం ప్రాంగణంలో చల్లని మంచి నీరు తొ పాటు, సుమారు 500 నుండి 600 మందికి బట్టర్ మిల్క్ ను ( మజ్జిగను వితరణ గావించారు. )

చిరివరగా, స్వామి వారికి మంగళ హారతి తొ ఈ నాటి కార్యక్రమము దిగ్విజయముగా స్వామి పాదాల చెంత సమర్పించబడినది.

 సాయిరాం. 




No comments:

Post a Comment

KOTI SAMITHI WEDNESDAY NAGARA SANKEERTHANA 15-7-2026

  ఈ నాటి నగర సంకీర్తన నివేదిక.15 -7-2026 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో , ఈ రోజు నగర సంకీర్తన ఎంతో భక్తి శ్రద్దల...